27-10-2017 నుండి 2-11-2017 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్న , వారం మధ్యనుండి బాగుంటుంది. నూతన ప్రయత్నాల విషయంలో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్లడం ద్వారా మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొవడం ఉత్తమం. సోదరులతో తలపెట్టు చర్చల విషయంలో తొందరపాటు కూడదు, మిత్రులనుండి అందివచ్చిన సహకారాన్ని వినియోగించుకొని లబ్దిపొందు ప్రయత్నం చేయుట మంచిది. సమయాన్ని సాధ్యమైనంత మేర వాడుకొనే ప్రయత్నం మేలు.  

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద నూతన ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఒకింత ఒత్తిడి పెరుగుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి, నూతన ఆలోచనలకు ఆస్కారం కలదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించుట సూచన. గతంలో మొదలు పెట్టిన పనులను తిరిగి కొనసాగించే ప్రయత్నం చేస్తారు. మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది. 


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. మీ ఆలోచనలను మిత్రులు పాటించుట ద్వారా లబ్దిని పొందుతారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం పెద్దగా ఫలితం ఇవ్వకపోవచ్చును. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబంలోని పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ముందుగా చేపట్టిన పనులను పూర్తిచేసేలా ప్రణాళిక కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందే అవకాశం కలదు.  మొండి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మీ మాటతీరు నూతన వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, సర్దుబాటు మేలు. 

 

 


 సింహ రాశి :ఈవారం మొత్తం మీద విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. కుటుంబ పరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్తారు. మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళుట మేలు. కొన్ని కొన్ని సార్లు మీ అనుకున్న వారు మిమ్మల్ని అపార్థం చేసుకొనే అవకాశం కలదు, జాగ్రత్త. ముందుగా చేపట్టిన పనులను పూర్తిచేయుట, గతంలో మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తిచేయుట మంచిది. విదేశీప్రయాణాలు అనుకూలిస్తాయి.  

 

 


కన్యా రాశి : ఈవారం మొత్తం మీద సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. వాహనాల వలన అనుకోని ఖర్చులు అయ్యే ఆస్కారం కలదు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు మార్చుకొనే ప్రయత్నం చేయుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. 

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. గతంలో రావలిసిన ధనం సమయానికి చేతికి అందుటకు ఆస్కారం ఉంది. జీవితాభిగస్వామితో మరింతగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు.  

 

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. పెద్దలతో అనుకోకుండా విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఒకింత ఒత్తిడి పెరుగుటకు ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. చిననాటి మిత్రులతో మీ ఆలోచనలను పనుచుకొనే అవకాశం కలదు 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆత్మీయుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు మూలాన నూతన సమస్యలు వచ్చే అవకాశం కలదు. 

 



మకర రాశి : ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది, తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. విదేశిప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. కుటుంబపరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం మేలు.


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద చేసిన పనులనే మల్లి మల్లి చేయాల్సి వస్తుంది. ప్రణాలిక లేకపోతే నూతన సమస్యలు వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి అందక పోవచ్చును. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వాహనాల వలన ఇబ్బందులు అలాగే ఖర్చులకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. భూమికొనుగోలు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు,తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను లేక మిత్రులను కలుస్తారు. వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన చర్యలు చేపడుతారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. గతంలో ఆగిపోయిన ప్రమోషన్ తరిగి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది,వైద్యుడిని కలవడం మంచిది. 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు