చైతన్య దీపికలు పుస్తక సమీక్ష - చామర్తి అరుణ

chaitanya deepikalu story review

దినవహి సత్యవతి గారి చైతన్య దీపికలు బాలల కధల పుస్తకం నిజంగా చైతన్యాన్ని దీప్తింపజేసే పుస్తకం అనడంలో ఎట్టి సందేహం లేదు .ఒక కధలో పాత్రల పేర్లు కూడ అవే అయినా వారు కాలనీ చైతన్యం కలిగించి నామోచిత్యం  నిరూపించారు .ప్రతి కధా ఆగకుండా చదివించేదే .

అత్తా కోడళ్ళ సామరస్యం ,ఇతర్లకు చేసే సహాయం పసిపాప కి స్పూర్తిగా నిలవడం బాగుంది .అంటు వ్యాధి కాని ఒక విటమిన్ లోపానికి బడి నుండి పంపితే తిరిగి స్నేహితుడిని తెచ్చే దాక పిల్లాడి కృషి ,పెద్దల సహకారం ,బడిలో లేని సౌకర్యాల కోసం మౌనం గా పోరాడి సాధించిన మరొ చిన్నారి .ఇలా ప్రతి కధలో పిల్లలే ఆదర్శం ,వీరోచితంగా సమస్యపోరాటం అన్నది పిల్ల ల్లో ఒక అవగాహన కలిగిస్తుంది అనడం లో ఏ అనుమానం లేదు .ఏ కధ కా కధ పిల్లలకే కాదు ,అపుడపుడూ పెద్దలకీ చురకలు పెడుతూ పిల్లల చదువుని పక్కనవారితో పోల్చవద్దని ,పిల్లలు ఏం చేసినా సమర్ధిస్తూ పోకూడదని చక్కగా సాగింది వీరి కధా రచన 

కష్ట పడితే విజయం తధ్యం అని దీక్ష కధ ద్వారా ,ఒకసారి రాస్తే ,చదివిన దాని కన్నా ఏకాగ్రత కలిగి కష్టమైన దైనా సులువుగా వస్తుందని పిల్లలకి అన్యాపదేశ సందేశం ఇచ్చారు .అలాగే ,విముక్తి కధలో కేవలం చదువు తెలివే కాక ,పరిసరాలను పరిశీలిస్తూ చురుగ్గా ,ధైర్యం గా తెలివిగా ఎలా మెలగాలో మనసుకు హత్తుకునేలా వివరించారు .శభాష్ అనే కధలో శ్రీజ పాత్రలో కాగితం విలువని పిల్లలకీ అర్దం అయ్యేలా విపులీకరించారు .నిజానికి ,ఇది నేనూ పాటిస్తూ ,పిల్లలకీ అలవాటు చేశా .లెక్కలు ,సైన్సు బొమ్మలు ,బైటికి వెళ్తే తేవలిసిన లిస్ట్ రాసుకోడానికి వగైరా వాడుతూ ఉంటాము  . చిన్ని చిన్ని కధల్లో ఎన్నో సామాజిక సమస్యలు ఇమిడ్చి చక్కగా చెప్పిన తీరు ప్రశంసనీయం .చింటూ కధలో ధూమపాన దుష్ఫలితాలు నాటకరూపం గా తండ్రిని మార్చిన తీరు శ్లాఘనీయం .వెరసి 

అయ్యో అపుడే అయిపోయాయా ,ఇంకా ఉంటే బాగుండు అనిపించేలా ఉన్నాయి కధలన్నీ .కొని దాచుకోవలసిన పుస్తకం .ఏ వయసు వారికైనా ఉపయుక్తంగా ఉంది.

ప్రతుల కోసం సంప్రదించవలసినది    

దినవహి .సత్యవతి గారు 
చెన్నై 91  97907 52180

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు