ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌ - అంతేనా? - ..

పుడుతూనే అమ్మాయిని లేదా అబ్బాయిని ఇంజనీర్‌ అనో డాక్టర్‌ అనో అంటుంటాం. ఇది ఒకప్పుడు మామూలుగా అనే మాట. కానీ ఇప్పుడది నిజమై కూర్చుంటోంది. నర్సరీలో జాయిన్‌ చేస్తూనే డాక్టర్‌ని చేయాలి, లేదా ఇంజనీర్‌ని చేసెయ్యాలనే ఆలోచనతో తల్లిదండ్రులు ఉంటున్నారు. ఫౌండేషన్‌ అక్కడినుంచే పడిపోతోంది తల్లిదండ్రుల ఆలోచనల్లో. మంచి స్కూలు, అంతకన్నా మంచి చదువు అనే ఉద్దేశ్యంతో లక్షలు ఖర్చు చేయడానికీ వెనుకాడ్డంలేదు. ఈ దారిలో పెద్దల ఆలోచనల్ని పిల్లలపై బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల సున్నిత మనస్తత్వాలు ఏ రకంగా బాధించబడుతున్నాయో తల్లితండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ప్లానింగ్‌, ఫౌండేషన్‌ తప్పు కాదుగానీ పిల్లల ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. 

ఏడేళ్ళ కుర్రాడు ఇంజనీరింగ్‌ చదువుతానని అంటాడు, మరో ఆరు నెలలకి పైలట్‌ అవ్వాలనే ఆలోచన వస్తుంది. ఇంకో ఏడాదికి క్రికెటర్‌ అవ్వాలనుకోవచ్చు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వారి ఆలోచనలు వయసుని బట్టి, వారు పెరుగుతున్న వాతావరణం, చూస్తున్న పరిసరాలు తద్వారా మారిపోవడం సహజం. ఆ ఆలోచనల్ని తల్లిదండ్రులు గుర్తించాలి. కొందరికి కొత్త కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి ఉండొచ్చు. ఇంకొందరికి ఆటలపై ఆసక్తి ఏర్పడవచ్చు. వారి అభిరుచులు అలా అలా మారుతుండడాన్ని గమనించి, వాటి పట్ల తల్లిదండ్రులు స్టడీ చేయడం అలవాటు చేసుకోవాలి. పదో తరగతి పాసయ్యేనాటికి పిల్లలు ఏ వైపుగా ఆలోచనలు సాగిస్తున్నారో, అటువైపు ప్రోత్సహించాలన్న మెచ్యూరిటీ తల్లిదండ్రులకీ రావాల్సి ఉంటుంది. అలా కాక నర్సరీలోనే వారి ఆలోచనల్ని కబ్జా చేసేస్తే ఎలా? అందుకే పిల్లల అల్లర్నిఅదుపులో పెట్టే హక్కు తల్లితండ్రులుగా మనకుంది. కానీ వారి ఆలోచనల్ని కంట్రోల్‌ చేసే హక్కు మనకు లేనే లేదు సుమండీ! 

లేదూ, ఖచ్చితంగా పిల్లల్ని తాము అనుకున్నట్టే ఇంజనీరింగ్‌ చేయించాలనో, మెడిసిన్‌ చదివించాలనో అనుకుంటే పిల్లల్ని కన్విన్స్‌ చేయడం తప్పనిసరి. కన్విన్స్‌ కాకపోతే మాత్రం బలవంత పెట్టకూడదు. పిల్లల భవిష్యత్తుని డిజైన్‌ చేయాలన్న తల్లిదండ్రుల ఆలోచన తప్పు కాదుగానీ, వారి ఆలోచనలతో పిల్లలు ఎంత మ్యాచ్‌ అవుతున్నారన్నదీ ముఖ్యం. అంతిమంగా ఇంజనీర్‌ అయినా, డాక్టర్‌ అయినా అందులో రాణించాల్సింది పిల్లలే. కాబట్టి వారి ఇష్టాయిష్టాలు చాలా చాలా ముఖ్యమని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉంటుంది. జీవితానికి ఇంజనీరింగ్‌ మెడిసిన్‌ మాత్రమే కాదు, భవిష్యత్‌ చాలానే ఉంది. వ్యాపార రంగంలో రాణించేవారిలో కొందరికి అసలు చదువుతో సంబంధమే ఉండదు. క్రికెటర్ల సంగతి చూస్తున్నాం. మహిళా క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ రాణిస్తున్న తీరు మనకి కనిపిస్తూనే ఉంది. అలా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వారికి వారి భవిష్యత్తు పట్ల ఆలోచించే ఫ్రీడమ్‌నిస్తూనే, ఆ ఆలోచనకి మంచి, చెడు అర్ధం అయ్యేలా గైడ్‌ చేసే జ్ఞానోదయం ముందుగా రావాల్సింది తల్లితండ్రులకే. కాబట్టీ.. ప్రియమైన తల్లిదండ్రులూ! పిల్లల మనసులో ఏముందో తెలుసుకోండి. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు