కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోద్ది! - ..

google ideas

గత రోజుల్లో జలుబు, జ్వరాలకి, ఇంటి చిట్కాలు వాడేవాళ్లం. ఇప్పుడు కూడా ఇంటి చిట్కాకే వాడుతున్నాం. అందేంటి అనుకుంటున్నారా? అదేనండీ గూగుల్‌ మాత చెప్పిన చిట్కాలు. జలుబు చేసిందంటే చాలు ముందు, ఇంటర్నెట్‌కి కనెక్ట్‌ అయిపోయి రెమెడీస్‌ చూసేస్తున్నాం. క్యాన్సర్‌ రోగానికీ ఇంటర్నెట్‌ని ఆశ్రయించేవారు ఎక్కువైపోయారు. ఇంటర్నెట్‌ అంతలా మన జీవితాల్లో భాగమైపోయింది. ఎక్సర్‌సైజ్‌ చెయ్యాలంటే ఇంటర్నెట్‌, తిండి తినాలంటే ఇంటర్నెట్‌ ఇలా అన్నిటికీ ఇంటర్నెట్‌తోనే సావాసం చేయాల్సి వస్తోంది. తెల్లారితే ఇంటర్నెట్‌, రోజంతా ఇంటర్నెట్‌, పడుకునే ముందు ఇంటర్నెట్‌. ఇంటర్నెట్‌ లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా? స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్‌ వినియోగం పతాక స్థాయికి చేరింది. ఇంటర్నెట్‌ వినియోగానికి చదువుతో కూడా సంబంధం లేకుండా పోయింది. ప్రతీ ఒక్కరి జీవితాల్లోనూ ఇంటర్నెట్‌ అంతగా భాగం అయిపోయింది. భవిష్యత్తులో ఇంకా అత్యాధునిక టెక్నాలజీని మనం సొంతం చేసుకోవడం ఖాయం. ఎంత టెక్నాలజీని సొంతం చేసుకున్నా, మన శరీరాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎలా? 

ఇంట్లోంచే అన్నీ దొరికేస్తున్నాయ్‌ కదా అనుకుంటే పొరపాటే. ఆసుపత్రికి పోకుండా, వైద్యుని సలహా పొందకుండానే అన్ని వ్యాధులకీ మందులు, ముందు జాగ్రత్తలు తెలిసిపోతున్నాయంటే అదీ పొరపాటే. రెమెడీస్‌ అన్నీ అందరికీ పనికిరావు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి 'చిట్కాలు' ఆయా వ్యక్తులకు వచ్చే చిన్న చిన్న అనారోగ్యాల్ని దూరం చేయొచ్చు. కానీ పెద్ద అనారోగ్యమైతే దానికి డాక్టరే మందు వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి చిన్న జలుబు కూడా రెమెడీస్‌తో కొంప ముంచేస్తుంటుంది. ఈ రోజుల్లో ఏ చిన్న జలుబునీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే సాధారణ జలుబు కంటే తీవ్రమైన అనారోగ్యాల కారణంగా వచ్చే జలుబు ఎక్కువగా కన్పిస్తోంది. ఏ చిట్కాకి అయినా డాక్టర్‌ ఆమోదం తప్పనిసరి. ఇంటర్నెట్‌ వినియోగదారులారా! ఈ విషయాన్ని కొంచెం గమనిస్తే బావుంటుంది. 
వంటి చిట్కాల్ని తేలిగ్గానే పాటించేయొచ్చనుకుంటాం. కానీ అందులో అసలు కంటే కల్తీ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి ఫలితం ఉండదు. ఏ చిన్న అనారోగ్యం సంభవించినా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి కొంత తగ్గిందని అర్థం. కాబట్టి ఆ సమయంలో రిస్క్‌ చేయనే చేయకూడదు. కార్పొరేట్‌ ఆసుపత్రుల మాయలో పడి ఫ్యామిలీ డాక్టర్‌ని మర్చిపోతున్నాం. ఆ ఫ్యామిలీ డాక్టర్‌ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువవుతోంది. ఫ్యామిలీ డాక్టర్‌ శరీరతత్వానికి మించి మందు వేయడు. మీ శరీరతత్వమేంటో మీ ఫ్యామిలీ డాక్టర్‌కి మాత్రమే తెలుస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతీ చిన్న విషయానికి కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళితే, వాళ్లు పేల్చే బిల్లులు, రాసే యాంటియాటిక్స్‌ మన శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాయి. చిన్నపాటి నీరసానికి క్యాన్సర్‌ అని కొందరు భయపడ్తున్నారు. అది ఇంటర్నెట్‌ తెలివితేటల ఎఫెక్ట్‌. మీ చుట్టూ మిమ్మల్ని భయపెట్టేవారెప్పుడూ ఉంటారు. ఏ చిన్న అనుమానం వచ్చినా మీ డాక్టర్‌ని సంప్రదించండి. ఇంటర్నెట్‌ని కాదు, మిమ్మల్ని భయపెట్టేవారిని అసలే కాదు. 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు