ఇక్కడ మనం చెప్పుకునేది భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తన "రెలిజియన్ అండ్ సొసైటీ" అనే గ్రంథంలోనూ, ఇంకా కొందరు పరిశొధకులు వ్రాసిన కొన్ని చారిత్రాత్మిక గ్రంథాల్లోని విషయానికి వివరణ.ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మలు, క్షత్రియులు, జంతుచర్మం ఒలవడం కులవృత్తిగాగల శూద్రుల్లోని ఒక కులం యజ్ఞయాగాదుల్లో ప్రధాన కులాలుగా చెలామణీ అయ్యేవారు...ఎందుకంటే ఏదైనా యాగం జరిగితే చివర్లో జంతు బలి ఇచ్చినప్పుడు దానిని బలిచ్చి పాక శాలకు పంపడానికి ఆ కులంవారే దిక్కు. మంత్రం చదివే బ్రాహ్మణుడు, ఖర్చు పెట్టే క్షత్రియుడితో పాటు, జంతు మాంసంతో వ్యవహరించే ఆ కులం వేద కాలంలోని మత ధర్మంలో కీలక పాత్ర పోషించే వారు...వాళ్ళల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరిగేవి..గౌతముడు అహల్యను పెళ్ళి చేసుకోవడం, వశిష్టుడు అరుంధతిని చెసుకోవడం ఈ బాపతే...అయితే తక్కిన కులాల వాళ్ళకి యజ్ఞ యాగ విధుల్లో పెద్ద పాత్ర ఉండేది కాదు...
ఏ అరమరికలు లేకుండా ఎవరి కుల వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు...ఆహార వ్యవరాల్లో కూడా అంతా మాంసాహారులే కాబట్టి తారతమ్యాలు తెలిసేవి కావు...కొన్నాళ్ళకి బౌధ్దమతం పుట్టింది...దైవాన్ని చెరుకోవడానికి బలి పేరుతో ఏ జంతువుని హింసించాల్సిన పని లేదు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే చాలు మోక్షమే..అనడం వల్ల స్వచ్చంద మత మార్పిడిలు ఎక్కువ సంఖ్యలో జరగడం చూసి అప్పటి పాలకులు కంగారు పడ్డారు..మత సంరక్షణ కోసం బౌద్ధంతో పోటీ కి దిగారు...ప్రధానంగా బౌధ్ధం లో ఉన్నది అహింస కనుక ఇక హిందువులు కూడా ఎవ్వరూ మాంసం ముట్టకూడదన్నారు..జనం ఒప్పుకోలేదు...'అసలు యజ్ఞ యాగాల్లో మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు..మా పధ్ధతి మీ కోసం మార్చుకోమంటే మాకు కష్టం...అందుకే బౌద్ధం మాకు కుదరదు..మేము హిందువులుగానే ఉంటాం..మా తిండి మేము ఎప్పటిలాగే తింటాం..ఇంతగా చెబుతున్నారు కనుక మీరు మానేయండీ అన్నారు...జంతుచర్మంతో వ్యవహరించే కులవృత్తిగలవారు ససేమిరా అన్నారు..'మాకు వచ్చిన విద్యే ఇది...చర్మం ఒలవడం మానేయమంటే మాకు కుదరదు...ఒలిచిన వాళ్ళం మాంసం వండుకోకుండా అసలు వీలు కాదు.. అని తేల్చేసారు..క్షత్రియులు కూడా 'జంతువుని చంపే విషయంలోనే ఇంత ఆలొచిస్తే మాలో పౌరుషం చస్తుంది..రేపు యుధ్ధం వస్తే అహింస మంత్రం వల్లిస్తే శత్రువులు ఊరుకుంటారా? తలలు నరుక్కు పోతారు..అందుకే మాంసం మానడం మాకూ కుదరదు..." అని "ఎలాగూ మంత్రాలు వల్లించడం, విద్యా బోధ చెయ్యడమే కనుక మీరు మాత్రం మానేయండి" అన్నారు బ్రాహ్మల్ని మిగతా వాళ్ళు.బ్రాహ్మలు సరే అన్నారు..అప్పటి దాకా అలవాటు ఉన్న దాన్ని మానేయలంటే ఎం చెయ్యాలి? ముందుగా ఆ విషయం మీద అసహ్యం తెచ్చుకోవాలి...అలా బ్రాహ్మలు అప్పటి నుంచి మాంసాన్ని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు...ఒక తరం అసహ్యించుకుంటుంది సరే..తర్వాతి తరం దారి తప్పదని నమ్మకం ఎమిటి? అందుకే మడి-దడి పెట్టుకున్నారు...మాంసం తింటే మెదడు మందగిస్తుందని, సకల పాపాలు చుట్టుకుంటాయని, బ్రాహ్మణ జన్మ సర్వోతృష్టమని, మాంసం తిన్నా, పధ్ధతులు పాటించకపోయినా నిమ్న కులాల్లో పునర్జన్మ ఎత్తాల్సి వస్తుందని పిల్లలకి నూరిపోసేవారు... తమ తర్వాతి తరం పిల్లలు మళ్ళీ అన్య కులస్తులతో కలిసినా, స్నేహం చేసినా మాంసా హారులుగా మారే పరిస్థితి ఉంది కదా..అందుకే 'అస్ప్రుశ్యత పెట్టారు...మరీ ముఖ్యంగా కొన్ని కులాలవారిని ఊరికి ఒక దిక్కున ఉండమని, బ్రాహ్మలు మరో దిక్కున అగ్రహారం కట్టుకున్నారు...ఇదంతా పరస్పర అవగాహనతో హిందూ ధర్మ రక్షణ కోసం అన్ని కులాల వాళ్ళు తీసుకున్న రాజకీయ నిర్ణయం..ఇక ఈ బ్రాహ్మలకి తోడుగా వైశ్యులు కలిసి వచ్చారు...తమకి కూడా వృత్తి, ప్రవృత్తి పరంగా మాంసా హారం అవసరం లేదని అనుకున్నారు. .స్వధర్మం కోసం ఆహార వ్యవహారాలను మార్చుకుని గొప్ప త్యాగం చేసారు గనుక బ్రాహ్మల్ని పూజనీయులన్నాడు రాజు..వారికి హోదా మరింత పెంచారు...సమాజం లొ మొదటి కులంగా తీర్మానించారు...ఈ పధ్ధతి ఎన్నో తరాలు కొనసాగింది...కారణం ఎదైనా బౌధ్ధం దేశంలో వ్యాపించలేకపోయింది...హిందూ ధర్మానిదే పై చేయి అయ్యింది...కానీ అప్పటి రాజకీయ అవసరం శాశ్వత స్థితి పొందింది...అలా బ్రాహ్మణులు శాకాహారులుగా ముద్రవేయబడ్డారు. అంతే తప్ప బ్రాహ్మణులు మాంసం తినకూడదని వేదాల్లోగానీ, గీతలోగానీ లేదని చాలామంది పరిశొధకుల తీర్మానం.భగవద్గీతలో కూడా సాత్విక, రాజస, తామస ఆహారం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు కానీ, ఎక్కడా మాంసాహార, శాకాహార ప్రస్తావన తీసుకురాలేదు. వండిన వెంటనే తినేది, ఆరోగ్యాన్నిచ్చేది సాత్విక ఆహారం. వండిన కొద్దిసేపటికి తినేది, ఉప్పు కారాల కారణంగా అనారోగ్యానికి కారణంగా పరిణమించగలిగేదీ రాజస ఆహారం, వండిన చాలాసేపటి తర్వాత తినేది, పాచిపోయినది, రోగాలు ఇచ్చేది తామసం అన్నారు తప్ప అసలు ఆ పదార్థాలు ఏమిటో చెప్పలేదు. కనుక సనాతనధర్మంలో శాకాహార ప్రస్తావన శాస్త్రీయంగా లేదు. ఇదంతా బౌధ్ధం కారణంగా పుట్టిందే అనడానికి ఇది మరొక రుజువు.