లిటిల్‌ రాస్కెల్స్‌ కోసం కొంచెం కొత్తగా.. - ..

some new things for little raskels

స్కూలు రైట్‌ టైమ్‌ 8.45. కానీ పిల్లలు లేచి రెడీ అయ్యి స్కూలు బ్యాగులు వేసుకుని తయారయ్యేది మాత్రం ఉదయం 6 గంటలకే. ఎల్‌కేజీ స్టడీ నుండే పిల్లలకి ఈ టైమింగ్స్‌ తప్పడం లేదు. ఇందుకు కారణాలు అనేకం. తల్లితండ్రులు తమ పిల్లలు మంచి స్కూళ్లలో చదవాలని కోరుకోవడం, స్కూలుకి, ఇంటికీ ఉన్న దూర భారం ఇలా పలు రకాల కారణాలు. ఇదంతా బాగానే ఉంది. తప్పదు అనుకోవడం. అయితే తమ పిల్లలు తమతో కన్నా ఎక్కువ టైం ఇలా స్కూలు నిమిత్తమే కేటాయిస్తున్నారు. తమ చిన్నారి బాల్యం అంతా ఎక్కువ శాతం స్కూలుకే పరిమితమై పోతోంది. ఇదంతా ఒకెత్తు. కాగా పెరుగుతున్న పిల్లలకి కావాల్సిన పోషకాలు సరైన క్రమంలో అందుతున్నాయా? ఈ రకమైన టైమింగ్స్‌లో. ఎప్పుడో పొద్దున్నే బాక్సులు తీసుకుని స్కూలుకి బయల్దేరతారు. వాటిలో ఎన్ని రకాల ఐటెమ్స్‌ అని భద్రపరుస్తారు కదా, తల్లితండ్రులు. కానీ తప్పదు. తమ పిల్లల ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అల్పాహారంగా బాక్సుల రూపంలో వారికి సర్ది ఇవ్వవలిసిందే. అయితే వాటి విషయంలోనే కొంచెం కొత్తగా ఆలోచించాలి. పిల్లలకి పెట్టే అల్పాహారాన్ని ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇవ్వండి. బిస్కెట్స్‌. చాక్లెట్స్‌. బ్రెడ్‌ తదితర ఫుడ్స్‌ని అవైడ్‌ చేయండి. చిప్స్‌ తదితర జంక్‌ ఫుడ్స్‌ని అస్సలు ప్రోత్సహించకండి. వీలైనంత వరకూ ఇంట్లోనే రకరకాల ఫుడ్‌ ఐటెమ్స్‌ ప్రిపేర్‌ చేసేందుకు మార్గాల్ని అన్వేషించండి.

ఇక మీ పిల్లల బాక్సుల్లో సర్దే ఫుడ్‌ ఐటెమ్స్‌లో ముఖ్యంగా స్ప్రౌట్స్‌ వంటి పోషక విలువలు గల ఆహార పదార్దాలు ఉండేలా చూసుకోండి. రకరకాల పప్పుధాన్యాల్ని మొలకలు వచ్చే వరకూ మీరే భద్రపరచి ఉంచి, వాటిని పిల్లలకు స్నేక్స్‌లా ఇచ్చి చూడండి. వీటిని డైరెక్ట్‌గా అలాగే అందించకుండా, రకరకాలుగా డెకరేట్‌ చేసి ఇస్తూ ఉండండి. రోజూ ఒక్కటే రకం బోర్‌ కొట్టించకుండా, రోజుకో కొత్త ఐటెంని స్ప్రౌట్స్‌గా అందించండి. వాటిని ఒకరోజు ప్లెయిన్‌గా పెట్టండి. ఒక్కోరోజు ఫ్రై చేసి పెట్టిండి. మరో రోజు కట్‌లెట్‌, ఛాట్స్‌ తరహాలో ట్రై చేసి అందించండి. మీ చిన్నారులు ఇష్టంగా తినకపోతే చూడండి. నోరూరే రుచికి చిన్నారులు దాసోహం కాకుండా ఉంటారా చెప్పండి. అంతేకానీ మార్కెట్లో దొరికే ప్రోసెస్‌ ఫుడ్స్‌ని అస్సలు ప్రోత్సహించకండి. వాటిని తీసుకోవడం వల్ల చిన్నారులకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో వారికి చిన్నప్పటి నుండే అవగాహన కలిగేలా చేయండి.

ఎక్కువ టైం స్కూల్లోనే గడుపుతున్నారు పిల్లలు. సో ఏ టైంకి ఏ ఫుడ్‌ని తీసుకోవాలో ఓ క్రమ పద్థతిలో తీసుకునేలా ముందుగానే వారికి ప్రణాళిక సిద్ధం చేసి పెట్టండి. మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ, దోశ, చపాతి వంటి ఐటెమ్స్‌ అయితే బాగుంటాయి. పిల్లలు ఇష్టపడి తినేలా వాటిని రెగ్యులర్‌ పద్థతిలో కాకుండా, కొత్త కొత్తగా డెకరేట్‌ చేసి పెట్టండి. తర్వాత లంచ్‌. వారికి ఇష్టమైన కూరల్ని ముందుగానే తెలుసుకుని ఆ రకంగానే వండి పెట్టండి. లంచ్‌ తర్వాత స్నేక్స్‌గా ఏదైనా ఫ్రూట్స్‌ని సిద్ధం చేయండి. రోజుకో రకం ఫ్రూట్‌ పెట్టండి. బాక్సులో పాడైపోయే ఫ్రూట్స్‌ని పెట్టొద్దు, జాగ్రత్త. యాపిల్‌ని కట్‌ చేయకుండా పెడితే మంచిది. అలాగే గ్రేప్స్‌, జామ, దానిమ్మ వంటి ఇతర ప్రూట్స్‌ని ఎలా పెట్టినా ఫర్వాలేదు. అలాగే అదే టైంలో పచ్చి కాయగూరలు అంటే క్యారెట్‌, బీట్‌ రూట్‌, కీర దోసల వంటి వాటినీ పెట్టొచ్చు. ఈ రకమైన ఫుడ్‌ని పిల్లలకి పెట్టడం వల్ల వారి ఆరోగ్యాన్ని కొంచెం అయినా కాపాడిన వారిమవుతాం. అలాగే ఎదిగే వయసులో వారి శరీరానికి అందాల్సిన పోషకాలని అందించడంలోనూ మన వంతు కృషి చేసిన వారిమవుతాం. సో తల్లి తండ్రులూ ఇది గమనించండి. ఇది మీ ఎదిగే పిల్లల కోసమే సుమా!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి