జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

శ్రీరాముడు : సీతా.....ఏమిటీ రాస్తున్నావ్?

సీతమ్మ : రామకోటి రాస్తున్నాను స్వామీ...!!

...............................

 

 

మంత్రి : జుట్టు మీద పన్ను విధించినందు వల్ల అందరూ గుండు కొట్టుకున్నారు మహాప్రభో!!

మహారాజు : ఐతే గుండు మీద కూడా పన్ను ప్రకటించండి!!

మంత్రి : నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను ప్రభో!

మహారాజు : రాజీనామా చేసి ఏం ఉద్యోగం చేయ గలవు?

మంత్రి : హాయిగా క్షుర కర్మ చేసుకుంటూ, మహారాజులా జీవిస్తాను ప్రభో!

 

సోమినాయుడు : ప్రజలు, ప్రజారాజ్యం కావాలన్నారు, రాజుని సిమ్హాసనమ నుంచి వైదొలగమన్నారు !

భీమిరెడ్డి : రాజు ఒప్పుకున్నాడుగా..రాజ్యాంగాన్ని ప్రజా ప్రతినిధులకప్పగించాడుగా?

సోమినాయుడు : అప్పగించాడు సరే.....ఆ ప్రజా ప్రతినిధులతో పాటూ తనూ ఒక ప్రజా ప్రతినిధిగా చేరాడు గదా!

భీమిరెడ్డి : ఐతే ఏమైంది?

సోమినాయుడు : తను తీసుకునే నిర్ణయాలనే ఇతర ప్రతినిధుల చేత అమలు జరిపిస్తున్నాడు ! మునుపటికీ ఇప్పటికీ తేడా ఏదీ??

..............................

కింపురుషుడు : రంభ, తిలోత్తమ, మేనక, ఊర్వశి లలో మిక్కిలి అందగత్తె ఎవరు?

కిన్నెరుడు : మనవల్ల చెప్ప తరం కాదు : భూలోకానికి వెళదాం పద !

అక్కడ తపస్సులు చేసే వాళ్ళనడిగితే సమాధానం దొరుకుతుంది !

(భూలోకంలో )

కింపురుషుడు : అయ్యా, మా ప్రశ్నకి సమాధానం చెప్ప గలరా?

శుష్మాసురుడు : చెబుతాను గానీ, ముందు ఒక్కొక్కరినే నా దగ్గరికి పంపించండి !!

కిన్నెరుడు : హు...! రాక్షసుడ్ని అడగడం తప్పయి పోయింది!

..................................

కత్తి వీరుడు : కత్తి సాము పోటీలో గెలిచాను. మీరు ప్రకటించిన బహుమతి, యువ రాణి మరియు అర్థ రాజ్యం నాకివ్వండి రాజా !

రాజు : బహుమతి ప్రకటించింది నిజమే ! ఐతే పోటీ జరుగుతుండగా, యువరాణి నీతో ఓడి పోయిన వాడిని వరించింది..!!

కత్తి వీరుడు : ఆ ఓడి పోయిన వాడు మరణించాడు గదా !

రాజు : అదే చెప్పొచ్చాను, కనుక ఈ బహుమతి ప్రకటనను వాపసు తీసుకుంటున్నాను...! నువ్విక వెళ్ళొచ్చు !!

.............................

మాయల ఫకీరు : నా ప్రాణం, ఒక చిలుక బొందిలో వుంది ! దాన్ని చంపితే గాని నేను చావను తెలుసా ? పైగా ఆ చిలుకను ఒక చోట భద్రంగా దాచాను ! దాన్ని పట్టుకోవటం తేలిక కాదు !

మాయల ఫకీరు పెళ్ళాం : అది తప్పించుకు పారి పోయి, ఒక చిలక జోస్యుడితో తిరుగుతోంది !

మాయల ఫకీరు : వెంటనే ఆ చిలక జోస్యుడ్ని వెతికి పట్టుకు రమ్మని మనుషుల్ని పంపించు !

మాయల ఫకీరు పెళ్ళాం : ఈ ఊళ్ళో లక్షకు పైబడి చిలక జోస్యులున్నారు ! ఎవడ్ని పట్టుకోమూ ?

................................

వెంకట్రెడ్డి : ఆ ఫలానా దేశం, ఫలానా రాజుకి ఎంత మంది కుమార్తెలు ?

రామినాయుడు : ఒకే కుమార్తె !

వెంకట్రెడ్డి : ఆమె పేరు?

రామినాయుడు : ఫలానా యువరాణి !

.................................

భక్తుడు : నిన్ను నమ్మిన వాడిని, నట్టేట ముంచితివేమయ్యా?

స్వామి : అందుకే నీకు ఈత ప్రసాదించాను నాయనా ! ముత్యపు చిప్పలు ఏరుకో.....బ్రతుకు పో...!!

........................

 

 

రాణి : మీ కుమారుడు , మీకంటే పరమ పిరికి !

రాజు : ఎలా ?

రాణి : సన్యాసం పుచ్చుకుని హిమాలయాలకు వెళ్ళిపోతాడట !

రాజు : ఎందుకు?

రాణి : అక్కడైతే శత్రుభయం ఉండదట !!

 

ఒక గాడిద : నేను అరిస్తే అది గంధర్వ గానంతో స్మానం..

ఇంకో గాడిద : ఎలా ?

ఒకటో గాడిద : నేను అరిస్తే , నన్ను బాదకుండా , నా యజమాని, నా పక్కన కూచుని వింటాడు...!!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి