యమడేంజర్‌ - అమ్మాయిలూ అతుక్కుపోవద్దూ! - ..

girls be care full

ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్‌ ఫోన్లే. అమ్మాయిలు, అబ్బాయిలు స్మార్ట్‌ ఫోన్స్‌ మోజులో పడి ప్రపంచాన్నే మైమర్చిపోతున్నారు. సోరీ సోరీ ప్రపంచాన్నే చుట్టి వచ్చేస్తున్నారనాలేమో. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జయేత్‌ అంటుంటారు పెద్దలు. అదే జరుగుతోంది ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ విషయంలో. ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోనే. కొనుగోలు, వినియోగం చాలా సులభమైపోయింది. అంతే సులువుగా ఈ స్మార్ట్‌ ఫోన్‌లు ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఇట్టే తెలిసిపోతోంది. అంతేనా, బ్యాంకింగ్‌ కార్యకలాపాల నుండి, ఇతరత్రా ముఖ్య కార్యకలాపాలు కూడా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఉన్న చోట నుంచే కదలకుండా పూర్తయిపోతున్నాయంటేనే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతలా ఈ స్మార్ట్‌ ఫోన్‌ మన జీవితంలో భాగమైపోయింది. కాగా స్మార్ట్‌ ఫోన్‌తో కొన్ని ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్స్‌కి ఎక్కువగా యూత్‌ అడిక్ట్‌ అయిపోతున్నారు. వాట్సప్‌, ట్విట్టర్‌, మొబైల్‌ కెమెరా ఇతరత్రా యాప్స్‌.. ఇలా ఒక్క మొబైల్‌తో యూత్‌ ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవల్సింది మొబైల్‌ కెమెరా గురించి. కెమెరా విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సెల్ఫీ గురించి.

ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ముందు చేతిలో ఫోనుంటే, ఓ సెల్ఫీ క్లిక్‌మనిపించాల్సిందే. న్యూ గెటప్‌, న్యూ లొకేషన్‌, న్యూ ఎక్స్‌ప్రెషన్‌.. ఏదైనా కానీ దాన్ని సెల్ఫీలో బంధించి తీరాల్సిందే. అయితే మొదట సరదాగా మొదలైన ఈ చర్య, ఇప్పుడు ఓ మానసిక రుగ్మతగా మారిపోయింది. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ అలవాటు డేంజరస్‌ మానసిక రుగ్మతగా మారిపోయిందనీ నిపుణుల సమాచారమ్‌. కొన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అబ్బాయిలతో పోల్చితే, అమ్మాయిలకి గ్లామర్‌పై ఇంట్రెస్ట్‌ ఎక్కువ. ఆ కారణంగా సెల్ఫీలకి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అబ్బాయిల కన్నా, అమ్మాయిలే సెల్ఫీలకు ఎక్కువగా ఆడిక్ట్‌ అవుతున్నారనీ ఓ నివేదికలో తేలింది. డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, డిఫరెంట్‌ గ్లామర్‌తో సెల్ఫీల్లో తమ గ్లామర్‌ని బంధిస్తున్నారు. ఆ కారణంగా సరదా కాస్త ఇదో మానసిక రోగంగా మారిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదండోయ్‌ సెల్ఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంలో గ్లామర్‌ తగ్గిపోతుందనీ కొన్ని హెచ్చరికలున్నాయి. సో అమ్మాయిలూ సెల్ఫీ విషయంలో తస్మాత్‌ జాగ్రత్త. ఏదైనా శృతిమించనంత వరకూ బాగానే ఉంటుంది. శృతి మించితే ఇదిగో ఇలాగే ఉంటుంది. 
ఇక అబ్బాయిల విషయానికి వస్తే, సెల్ఫీల మోజు అబ్బాయిలకూ బాగానే ఉంది. అయితే, అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఈ అలవాటు కొంచెం తక్కువేనని నివేదికలో తేలింది. సో ఈ మానసిక రుగ్మత పట్ల అమ్మాయిలతో పోలిస్తే, అబ్బాయిలు కొంచెం సేఫ్‌ జోన్‌లోనే ఉన్నారనీ తెలుస్తోంది. ఏది ఏమైనా సరదాని సరదాగానే తీసుకుంటే బావుంటుంది. సరదా కాస్తా అలవాటుగా మారిందంటే, ఆ తర్వాత అలవాటు కాస్తా ఇదిగో ఇలా మానసిక సమస్యలుగా మారి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి. స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే అదేదో చిన్నతనంగా ఫీలవుతున్న పరిస్థితి. ఆ ఆలోచనే ఇన్ని అనర్ధాలకు దారి తీస్తోంది. ఏదేమైనా టెక్నాలజీని అవసరం మేరకు వాడితే అర్ధవంతంగా ఉంటుంది. అవసరాన్ని మించితే వచ్చే అనర్ధాలే ఎక్కువ. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి