17-11-2017 నుండి 30-11-2017 వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చే మనస్తత్వం చూస్తారు . పెద్దలతో కలిసి మీ ఆలోచనలను పంచుకుంటారు,వారి అనుభవాలను పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకింత ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు సరైన సమయంలో సహకారం వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఉత్సాహానికి తగిన విధంగా కష్టపడుట ద్వారా ఊహించిన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ప్రతి విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయాలు బలపడే అవకాశం కలదు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయంలో కాస్త స్పష్టమైన ఆలోచన కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో తగిన విధంగా ఆలోచన కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.  

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి నూతన పనులకు ఆరంభానికి ప్రాధాన్యం ఇస్తారు. సాధ్యమైనంత మేర అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. చేపట్టిన పనులను మొదట్లో వేగంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆరంభంలో ఉన్న వేగం తదుపరి ఉండక పోవచ్చును. నచ్చిన వ్యక్తులను కలుసుకునే ఆస్కారం కలదు, సమయాన్ని వారితో గడుపుతారు. ఉద్యోగపరమైన విషయాల్లో అధికారులతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో శుభకార్యాల గురుంచి ప్రస్తావన వచ్చే అవకాశం కలదు.

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా మీ ప్రయత్నాలు ఉండేలా చూసుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు.

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మేలు. వ్యాపారపరమైన విషయాల్లో ముందుగా చిన్న చిన్న పెట్టుబడులకు అవకాశం ఇవ్వండి. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇస్టపడుతారు. చిననాటి మిత్రులను కలుస్తారు, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులనుండి వచ్చిన సూచనలను పాటించుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మీరు ఆశించిన విధంగా నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు.

 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఉండే అవకాశం ఉంది, తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. బంధువులను లేదా ఆత్మీయులను కలుస్తారు. వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోని విధంగా దూరప్రదేశప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది, తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటతీరు విషయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట అవసరం.

 


తులా రాశి : ఈవారం మొత్తం విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిఫంగి వచ్చే ఆలోచన చేసే అవకాశం ఉంది. మిత్రులతో ఏమైనా మనస్పర్థలు ఉంటే సర్దుబాటు చేసుకొనే ప్రయత్నం మంచిది. మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలతో చర్చలు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మీ మాటతీరు మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

వృశ్చిక రాశి :  ఈవారం మొత్తం మీద ఆరోగ్యం విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగపరమైన విషయాలకు సమయం ఇస్తారు. కాస్త కోపాన్ని తగ్గించుకోవడం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ప్రయాణాలు వాయిదా వేయుట సూచన, అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి, ఎలాంటి ప్రణాళిక వద్దు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు వారమో చివర్లో వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. మిత్రులతో ఊహించని విధంగా వివాదాలు వచ్చే ఆస్కారం కలదు,నిదానం అన్నివేళలా శ్రేయస్కరం.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది , స్థాయికి తగిన పనులకు కట్టుబడి ఉండుట మంచిది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల ఆలోచనలు వినండి,పెద్దలతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడటం సూచన. గతంలో చేపట్టిన పనులకు గాను నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవపరమైన విషయాలకు కాస్త సమయం ఇవ్వడం సూచన. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వాహనముల వలన అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు వాయిదా వేయుట సూచన.

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద బంధువులతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటలో ఆలస్యం అయ్యే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మానసికపరమైన విషయాల్లో ఒకింత ఒత్తడికి లోనయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన సంప్రదింపులు చేయుటకు అవకాశం కలదు. మీ మాటతీరు మూలాన విభేదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మిత్రులతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది.

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికసమయం అధికారుల పనులకు కేటాయించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే ఆస్కారం ఉంది. మీలో మీరు కొంత ఆవేదన కలిగి ఉంటారు. కుటుంబపరమైన విషయాల్లో కాస్త అసంతృప్తిని కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు గాను మీకు గుర్తింపు లభిస్తుంది. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో చర్చలు చేయకండి. మిత్రులమూలన నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. దూరద్రుష్టిని కలిగి ఉండుట మేలు, ప్రణాళిక సిద్ధం చేసుకోండి.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద మీకు నచ్చిన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విదేశాల్లో ఉన్న బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు,సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఊరట చెందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో సమయం గడుపుతారు. గతంలో చేపట్టిన పనులు కొలిక్కి వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విదేశీ ప్రయత్నాలు చేయువారు ఊహించిన ఫలితాలు పొందుతారు.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి