నేనూ మనిషినే లఘు చిత్రసమీక్ష - రూపినేని ప్రతాప్

NENU MANISHINE || A SHORT FILM BY || FEROZ SHAIK

చిత్రం : నేను మనిషినే
నటీనటులు : నాగ్, ప్రియ, ఫిరోజ్ షేక్, లీలాకృష్ణ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ : శ్రీవంశీ
సంగీతం : ప్రవేజ్ బాషా
రచన, దర్శకత్వం : ఫిరోజ్ షేక్

కథ : ఒక వ్యక్తి తన సాధారణమైన జీవితంలో భాగంగా ఒక చోటికు వెళ్తాడు. అక్కడ ఒక సంఘటన్ చూసి ఇన్ స్పైర్ అవుతాడు. అక్కడ నుండి బయలుదేరుతుండగా సడెన్ గా ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేస్తూండడం చూస్తాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్తాడు....అతడితో ఏం చెప్పాడు? అసలు వాళ్ళిద్దరి మధ్యా ఉన్న సంబంధం ఏమిటి? అసలు అతను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటాడు?? ఇవన్నీ తెలియాలంటే ఈ " నేను కూడా మనిషినే " చిత్రం చూడాల్సిందే..

విశ్లేషణ : నిజ జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఉన్న వ్యక్తులను చూస్తూంటాం. కానీ మనకెందుకులే అని వదిలివేస్తుంటాం. కానీ, ఆ సమస్య మన కుటుంబంలో ఎవరికైనా వస్తే ఒక బాధ్యతగా ఆ సమస్య గురించి ఆలోచిస్తాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తాం..సమాజం కూడా కుటుంబం లాంటిదే అందులో ఏ ఒక్కరికీ ఆ సమస్య వచ్చినా మనవంతు సహాయం అందించాలి..ఎందుకంటే మనం మనుషులం కాబట్టి..మనం చేసే సహాయం మనకు గొప్పది కాకపోవచ్చు. కానీ, అది పొందిన వారికి మాత్రం జీవితం అనే అంశాన్ని చాలా చక్కగా అవిష్కరించాడు దర్శకుడు. అందరికీ అర్థమయ్యేలా తాను చెప్పలనుకున్న పాయింట్ ని ఎక్కువ సాగదీయకుండా...సూటిగా...క్లుప్తంగా ముగించాడు....తక్కువ నిడివి లోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :
1) డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ
2) దర్శకత్వం
3)డైలాగ్స్
4)ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :
1) నటీనటుల హావభావాలు
2) పర్ఫెక్షన్

సాంకేతిక విభాగం గురించి చెప్పుకోవాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది కెమెరా గురించి...ప్రతి ఫ్రేం చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా బాగుంది.డైలాగ్స్ బాగున్నాయి కానీ, పలికే నటీనటుల ముఖాల్లో హావభావాలు ఇంకొంచెం బాగుండాల్సింది. మొక్కుబడిగా డైలాగ్స్ అప్పజెప్పారు. కథ, కథనం పాతదే అయినా, తన దర్శకత్వ ప్రతిభతో కొత్తగా చెప్పిన దర్శకుడు అభినందనీయుడు.

చివరగా : ప్రతీ కొత్తరోజు మనకి కొత్త జీవితాన్ని ఇస్తుంది...ప్రతి సమస్య ఒక కొత్త ఫలితాన్ని ఇస్తుంది... చక్కటి సామాజిక దృక్పథంతో మంచి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఫిరోజ్ షేక్ కి అభిననదనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మoచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అభిలషిస్తోంది గోతెలుగు.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి