24 -11-2017 నుండి 30-11-2017 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబసభ్యుల నుండి అధిక సంఖ్యలో వినతులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. గతంలో మిత్రులతో కలిసి మొదలు పెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞులు కలిసే అవకాశం ఉంది, వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో అధికారులతో కలిసి మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. సాధ్యమైనంత మేర వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండుట మంచిది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట ఉత్తమం. మీ ఆలోచనలకు పెద్దలనుండి గుర్తింపు లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో ఒకింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం కలదు. 

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు సమయం ఇస్తారు. ప్రాధాన్యపరంగా పనులను ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట మేలు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి కావల్సిన సహకారం పొందుతారు. స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి వచ్చు సూచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందికి గురిచేసే ఆస్కారం కలదు. మీ కుటుంబసభ్యుల్లో ఒకరి నిర్ణయం మీకు పెద్దగా నచ్చక పోవచ్చును. సాధ్యమైనంత మేర సర్దుబాటు విధానం మంచిది. 

 

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అధికసమయం కుటుంబసభ్యులతో గడుపుతారు. ఈవారం విందులు,వినోదాల్లో సమయం గడుపుతారు. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. జీవితభాగస్వామికి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయుట మంచిది. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది.  

 

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను మిత్రులకు లేదా ఆత్మీయులకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయిన విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. విదేశీప్రయాణాలు చేయుటకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుస్తాయి. 
 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పనిఒత్తిడి ఉండే అవకాశం ఉంది, తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. బంధువులను లేదా ఆత్మీయులను కలుస్తారు. వారితో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోని విధంగా దూరప్రదేశప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది, తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటతీరు విషయంలో ఒకటికి రెండుసార్లు సరిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. తల్లితరుపు బంధువుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట అవసరం.

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పెద్దల అభిప్రాయాలను అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన నూతన సమస్యలు పెరుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట మంచిది. అనుకోకుండా చేసేప్రయాణాలు ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో వివాదాలు మరింతగా పెరిగే అవకాశాలు కలవు. సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. నూతన ఉద్యోగ అవకాశాలు ఏమాత్రం కలిసి రావు. మీ మాటతీరు వివాదాలకు దారితీస్తాయి.  

 

 

వృశ్చిక రాశి :  ఈవారం మొత్తం మీద సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు.  

 

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీస్కోవడంలో తడబాటు పొందుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ప్రయాణాలు అనుకోకుండా చేయవల్సి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును, అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది.  

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులతో అధికసమయం గడిపే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది, కాస్త ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. అనుకోని ఖర్చులు అవుతాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. 

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. విలువైన వస్తువులను కాపాడుకొనే ప్రయత్నం మేలు. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. 

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద మీ నిర్ణయాలను పెద్దలకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మానసిక పరమైన ఒత్తిడి ఉంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో మనస్పర్థలు ఏర్పడిన , సర్దుకుంటాయి. మీ మాటతీరు అందరిని ఆకట్టుకొనే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు సమయం ఇస్తారు. 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు