మృదువైన పెదవుల కోసం ఇంట్లోనే ఇలా చేయండి..! - ..

remedies to treat lips

చలి కాలంలో మీ పెదవులు మీ పెదవులు పగిలిపోయి, గట్టిగా మారడం, నలుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మీ పెదవులపై చర్మం సున్నితమైనది కాబట్టి పై సమస్యలను పట్టించుకోకపోతే మీ పెదవుల స్థితి ఇంకా పాడవుతుంది. ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకోండి. దానికి ఇంటిచిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. మరి అవేంటో చూద్దాం..

నెయ్యి మీ పెదవులను మెత్తపరిచే ఎన్నోతరాల నుంచి వస్తున్న విధానం. దానిలో వున్న తేమగుణాలు కఠినంగా మారిన, పగిలిన పెదవులతో పోరాడతాయి. కొంచెం దేశవాళీ నెయ్యిని మీ పెదవులపై రాసి అలా వదిలేయండి. రోజుకి రెండుసార్లు ఇలా రాస్తే పెదవులు మృదువుగా మారతాయి.

పంచదార మీ పెదవులపై పేరుకున్న మృతచర్మాన్ని తొలగించే మంచి పదార్థం. ఫలితంగా మీ పెదవులు మృదువుగా మారతాయి. అరచెంచా పంచదారను ఒక చెంచా గులాబినీళ్ళతో కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులంతటా రాయండి. కొద్దినిమిషాల తర్వాత నీరుతో దాన్ని కడిగేయండి. రోజుకి 3-4సార్లు ఇలా చేస్తే పెదవులు మృదువుగా మారతాయి.

దానిమ్మరసం మాయిశ్చరైజింగ్ మరియు కండీషనింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. మృదువుగా మార్చటమే కాక, దానిమ్మరసం మీ పెదవులను సహజంగా పింక్ రంగులోకి కూడా మారుస్తుంది. దూదిని దానిమ్మరసంలో ముంచి మీ పెదవులపై వత్తండి. ఒక అరగంట అలా వుంచి, చల్లనీరుతో కడిగేయండి. రోజుకి ఒకసారి అలాచేసి అందమైన పెదవులను మీ సొంతం చేసుకోండి.

పాలలోని పోషకాలు మీ పెదవులను మృదువుగా, మెత్తగా చేస్తాయి. ఈ ఇంటిచిట్కాను ఏడాది పొడుగునా పెదవుల సంరక్షణ కోసం పాటించవచ్చు. చల్లనిపాలను మెల్లగా పెదవులు మొత్తం రాయండి. 15 నిమిషాలు కడిగేముందు ఎండనివ్వండి. దీన్ని రోజుకి రెండుసార్లు పాటించవచ్చు.

అన్ని పెదవుల సమస్యలకి అద్భుతమైన పరిష్కారంగా బీట్ రూట్ ను మీ పెదవుల సంరక్షణలో ఉపయోగించవచ్చు. బీట్ రూట్ సన్నని ముక్క తరిగి మీ పెదవుల మీద మొత్తం రాయండి. కొన్ని నిముషాలు అలానే రాసి, చల్లనీరుతో కడిగేయండి. రోజుకి 2-3 సార్లు ఇలా చేసి మృదువైన, పింక్ పెదవులు సహజంగా పొందండి.

సహజ మాయిశ్చరైజర్ గా తేనె మీ కఠిన పెదవులకి అద్భుతాలు చేయగలదు. చర్మాన్ని మృదువుపరిచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉండి మీ సమస్యను చిటికెలో పరిష్కరిస్తాయి. కొంచెం తేనెను మీ పెదవులపై రాసుకోండి. పది నిముషాలు అలానే ఉంచి చల్లనీరుతో కడిగేయండి. లిప్ బామ్ కడిగిన తర్వాత రాసుకోండి.

మరొక పెదవులను సహజంగా మృదువుపర్చే వస్తువుగా బాదం నూనెను మీ లిస్టులో చేర్చుకోవచ్చు. ఈ సహజమైన నూనె ప్రతిరోజూ వాడి మొద్దుబారిన పెదవుల సమస్యను పరిష్కరించుకోవచ్చు. 3 నుంచి 4 చుక్కల బాదం నూనెను పెదవులపై రాసి రాత్రంతా ఉంచేయండి. మరుసటిరోజు పొద్దున కడిగేసి పింక్ రంగులో చంటిపిల్లల లాంటి పెదవులను చూసి ఆశ్చర్యపోండి.అమోఘమైన

లోవెరా జెల్ మీ పెదవులను మొత్తంగా అందంగా మార్చేస్తుంది. అది పెదవులను మృదువుగా మార్చటమే కాక పెదవులపై ఉన్న నల్లచర్మాన్ని కూడా పోగొడుతుంది. ఆలోవెరా చెట్టు నుంచి కొంచెం జెల్ తీసుకుని మీ పెదవులపై అద్దుకోండి. అరగంటపాటు అలా ఉండనిచ్చి మామూలు నీరుతో కడిగేయండి. రోజువారి దీన్ని ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయి.

ఆలివ్ నూనె కూడా ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్న వస్తువు. ఈ నూనె షాపులో కొన్న బామ్ లకన్నా ప్రభావవంతమైన సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కొంచెం ఆలివ్ నూనెను అరచేతిలో పోసుకుని, వేళ్ళతో పెదవులపై ఆ నూనెను అద్దుకోండి. రోజు 3-4 సార్లు లిప్ బామ్ లా వాడి ఫలితాలను చూడండి.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి