పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే ఇలా చేసి చూడండి! - రాజు

how-to-decrease-fats-in-stomach

11. ఆపిల్ సైడర్ వెనీగర్ : ఆపిల్ సైడర్ వెనీగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అధిక బరువుతో బాధపడేవారు దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు.

12. కొత్తిమీర జ్యూస్ : కొత్తిమీరలో విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కెలొరీస్ మాత్రం తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి మెరగువుతుంది. అలాగే ఉదరభాగంలో ఉండే కొవ్వుును కూడా కొత్తిమీర జ్యూస్ తగ్గించగలదు.

13. కరివేపాకు: కరివేపాకు శరీరంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మనం తినే ఆహారాల్లో కరివేపాకు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఊబకాయం దరిచేరదు.

14. అవిసెగింజలు : అవిసెగింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. వీటిలో శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో క్రియాశీలకంగా పని చేస్తాయి.

15. బాదం: బాదంలో ఫైబర్ ఎక్కవగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. బాదంపప్పును అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల ఉదరం దగ్గర ఉండే కొవ్వు ఈజీగా తగ్గిపోతుంది.

16. పుచ్చకాయ :వాటర్ మిలాన్ లేదా పుచ్చకాయ (కళింగరపండు) బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ రెండు గ్లాసుల పుచ్చకాయ రసం తాగితే త్వరగా మీ పొట్ట ప్రాంతంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది.

17. బీన్స్ : బీన్స్ లోనూ ఫైబర్ అధికంగా ఉంటుది. మీరు రోజూ తినే ఆహారంలో బీన్స్ ను భాగం చేసుకోండి. దీంతో ఈజీగా మీరు పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవొచ్చు.

18. దోసకాయ : దోసకాయ జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని చాలా కేలరీలను ఇది కరిగించి వేస్తుంది. రోజూ ఒక దోసకాయ తినండి. దీంతో ఈజీగా మీ ఉదర భాగంలోని కొవ్వు కరిగిపోతుంది.

19. ఆపిల్ : ఆపిల్ ని రోజూ తింటూ ఉండండి. దీంతో మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే మీ ఉదరభాగంలోని కొవ్వు తగ్గిపోతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్యాట్ ను తగ్గించడంలో బాగా పని చేస్తుంది.

20. గుడ్లు:  గుడ్లు కూడా ఉదర ప్రాంతంలో ఉండే కొవ్వుని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. రోజూ వీటిని తింటే మీ శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. బాడీ మొత్తం ఫిట్ గా మారతుంది. వీటన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు రెగ్యులర్ గా ఈ ఆహారాలను తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందించినట్లవుతుంది.

 

మరికొన్ని ఆహార పదార్థాలు  వచ్చేవారం తెలుసుకుందాము....

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి