గ్రా .బందం రేగడ్ చిత్రసమీక్ష - రూపినేని ప్రతాప్

Bandham Regad - Telugu Full Movie - 4K Ultra HD With Subs | By Saahith Mothkuri | TNR Promotion

చిత్రం : గ్రా. బందం రేగడ్ 
నటీనటులు : యువచంద్ర, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ రెడ్డి గంటా
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : మోనిష్ భూపతిరాజు
రీ రికార్డింగ్ : మార్క్ కె. రాబిన్
నిర్మాతలు : సంతోష్ మోత్కురి, నిషాంక్ రెడ్డి కుదిత్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : సాహిత్ మోత్కురి

కథ : 1990 సంవత్సరం....ఒక ఫ్యామిలీ...అమ్మ, నాన్న, ఒక కుర్రాడు బండిమీద వెళ్తుంటారు. సడెన్ గా ఒక జీప్ వచ్చి గుద్దేసి యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే, హీరో ఒక నాటు వైద్యుడు...అక్కడ ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని ప్రేమిస్తూంటాడు... కానీ అమ్మాయిని వాళ్ళ బావ పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే ప్రస్తుతం హీరో తన రూం లో గర్ల్ ఫ్రెండ్ తో వుంటాడు. ఆ దశాబ్దం లో తను ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడు కూడా ఆ అమ్మాయినే ప్రేమిస్తాడు. అసలు రెండు జీవితాలు ఏంటి అసలు నిజం ఏది కల అనే విషయం అర్ధం కాక ఇబ్బంది పడే హీరో రెండు జీవితాల్లో తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా... మరియు యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీకి, మన హీరోకి వున్న సంబంధం ఏమిటీ  మరియు హీరోకి ఏమైనా మెడికల్ ప్రాబ్లం వుందా... అని తెలుసుకోవాలనే తొందరపడుతున్నారు మీరు కూడా మా గ్రా బందర్ రేగడ్ సినిమాని వెంటనే చూడండి.

విశ్లేషణ: ఒక మంచి కథనం తో రెండు కలాల్లో జరుగుతున్న కథను చాలా  వివరన్ గా క్లుప్తం గా వివరించాడు. ప్రతి సన్నివేశాన్ని చాలా మంచిగా ఎక్కడ వేస్టేజ్ సీన్స్ లేకుండా దర్శకుడిగా ఏం చెప్పలనుకున్నాడో చాలా బాగా తెర మీద చూపించాడు. హీరో గా చేసిన యువ చంద్ర చాలా బాగా నటించాడు. అస్సలు చెపాలాంటే 1990 లో జరిగిన కథ లో అయితే జీవించాడు అని చెప్పుకోవాలి. హీరోయిన్ మరియు మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ పరిధిమేరకు చాలా బాగా నటించారు.

ప్లస్ పాయింట్స్:
1. కథనం
2. దర్శకత్వం
3. డైరక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ
4. రీ రికార్డింగ్
5. హీరో నటన
6. విజువల్స్

మైనస్ పాయింట్స్: ఇటువంటి చిత్రం లో మైనస్ పాయింట్స్ వెతకాలంటే కష్టం. ఎందుకంటే దర్శకుడు తను తీసుకున్న కథను 100% పర్ ఫెక్ట్ తెరకెక్కించాడు. మరియు ఇటువంటి కథ లో కామెడీ, కమర్షియల్ ఎల్ మెంట్స్ ప్లేస్ వుండదు.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే సింప్లీ సూపర్బ్, ఎడిటింగ్ చాలా బాగుంది. మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిట్యుయేషన్ తగ్గట్టు చాలా బాగుంది. కథ- కథనం- దర్శకత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే. దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. ఇకపోతే నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ లెవల్లో వున్నాయి.

చివరగా: మనం జీవితం లో రోజుకు ఎన్నో విషయాలు చూస్తుంటాం. వాటిలో ప్రతీ విషయం పర్ ఫెక్ట్ గా చెయ్యాలి అనుకుంటాం. ఈ కథ లో దర్శకుడు ఎంచుకున్న విషయాన్ని పర్ ఫెక్ట్  గా చెప్పాడు. ఎటువంటి ఆలోచన లేకుండా చూసేయొచ్చు.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి