21. గ్రీన్ టీ: గ్రీన్ టీ లో కేట్చిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా పని చేస్తాయి. అందువల్ల ఎక్కువగా గ్రీన్ టీ తాగుతూ ఉండాలి.
22. డాండెలైన్ : కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇది బాగా పని చేస్తుంది. పొట్ట దగ్గర ఉండే కొవ్వును తగ్గించడానికి డాండెలైన్ బాగా పని చేస్తుంది.
23. వోట్స్: వోట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా తయారు చేసిన ఆహారపదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఉదరభాగంలో పేరుకుపోయిన కొవ్వు మొత్త తగ్గిపోతుంది.
24. అవకాడో: అవకాడో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే ఎక్కువగా ఆకలికాకుండా చేస్తుంది. ఉదరప్రాంతంలోని కొవ్వులను వెంటనే తగ్గించగల శక్తి అవకాడోకు ఉంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.
25. పీనట్ బట్టర్: పీనట్ బట్టర్ మీ శరీరంలోని ఫ్యాట్ ను తగ్గించేస్తుంది. ఇందులో మోనో శాట్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్ గా దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో ఫ్యాట్ కరిగిపోతుంది.
26. సొరకాయ : రోజూ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒకగ్లాస్ సొరకాయరసం తాగితే చాలా మంచిది. దీంతో మీ పొట్ట మొత్తం కరిగిపోయి ఫ్లాట్ టమ్మీగా మారుతుంది. ఇది కొవ్వును తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది.
27. యోగర్ట్ : యోగర్ట్ కూడా కొవ్వును కరిగించడంలో బాగా పని చేస్తుంది. రెగ్యులర్ గా యోగర్ట్ తినేవారు చాలా తక్కువ టైమ్ లో పొట్టను తగ్గించుకోగలగుతారు.
28. అరటి : ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే ఉంటే పొట్ట దగ్గరున్న కొవ్వు కరిగిపోతుంది. రెగ్యులర్ తింటూ ఉంటే దీని ప్రయోజనాలు మీకే తెలుస్తాయి.