టూ స్మార్ట్‌: కొత్త రోగాలు గురూ..! - ..

too smart

ఇప్పుడు మనం స్మార్ట్‌ యుగంలో ఉన్నాం. దేన్నైనా స్మార్ట్‌గా ఆలోచించాల్సిందే. లేకపోతే రేసులో వెనకబడిపోతాం. పలానా కూర వండాలంటే స్మార్ట్‌ ఫోన్‌. పలానా జాబ్‌ ట్రై చేయాలంటే స్మార్ట్‌ ఫోన్‌, బ్యాంకింగ్‌ కార్యకలాపాలకూ, కమ్యూనికేషన్స్‌కీ ఒక్కటేమిటీ అంతా స్మార్ట్‌గానే జరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం స్మార్ట్‌ ప్రపంచంలో ఉండడం కాదు, మన అరచేతిలోనే స్మార్ట్‌ ఫోన్‌లో ప్రపంచమంతా నిక్షిప్తమైపోయింది. దాన్ని వదిలించుకోలేం. వదిలించుకుంటే మనుగడ సాగించలేమేమో.. అనే ఒక రకమైన భయం పట్టుకుందిప్పుడు అందరికీ. మన జీవితంలో స్మార్ట్‌ మొబైల్‌ ఓ భాగమైపోయింది. జీవితంలోనే కాదు, శరీరంలోనే అంతర్భాగమైపోయిందీ స్టార్ట్‌ ఫోన్‌. ఆ స్మార్ట్‌ఫోన్‌ మన చేతిలో లేకపోతే మనం మనతో లేమనే భావనకొచ్చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే మనం బిగ్‌ జీరో అనే స్థాయికి ఎందుకొచ్చేశాం? అనే ప్రశ్న అప్పుడప్పుడూ తలెత్తుతూ ఉంటుంది. నూటికి నూరు శాతం మందిని ఈ ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. కానీ స్మార్ట్‌ ఫోన్‌కి దూరంగా ఉండడం దాదాపు అసాధ్యం. ఈ స్మార్ట్‌ మొబైల్‌ రోజు రోజుకీ ప్రమాద ఘంటికల్ని అత్యంత తీవ్రతతో మోగించేస్తోంది. స్థూలకాయం, కంటిచూపులో లోపాలు, వినికిడి సమస్య, నిద్రలేమి, మతిమరుపు.. ఇలా చెప్పుకుంటూ పోతే స్మార్ట్‌ ఫోన్‌ కారణంగా మన శరీరాన్ని మనం సర్వరోగాలమయం చేసేసుకుంటున్నాం. స్మార్ట్‌ ఫోన్‌ కారణంగా వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలకు వైద్యుల వద్ద కూడా పరిష్కారాలుండడం లేదు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో పోటీ పడుతోంది స్మార్ట్‌ మహమ్మారి. అయినా కానీ ఈ మహమ్మారిని వదిలించుకోలేకపోతున్నాం.

'పెరుగట విరుగుట కొరకే' అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అదొక్కటే కాదు, దేన్నైనా, దేని పట్ల అయినా మనకు నియంత్రణ ఉండాల్సిందే. నియంత్రణ ఉంటే దేన్నైనా డీల్‌ చేయగలం. స్మార్ట్‌ ఫోన్‌ అయినా అంతే. బిల్‌గేట్స్‌లాంటోళ్లు ఫోన్లు, టాబ్లెట్లు వంటి గాడ్జెట్స్‌ని వినియోగించడంలో నియంత్రణ కలిగి ఉంటారు. కానీ మనం స్టార్ట్‌ టెక్నాలజీ మీద పెడుతున్న శ్రద్ధ దాన్ని అవసరానికి తగ్గట్లుగా వాడాలన్నదానిపై పెట్టడం లేదు. ఓ అంచనా ప్రకారం, స్టార్ట్‌ మొబైల్‌ని యూత్‌ రోజులో 18 గంటలకు పైగా వాడిన సందర్భాలున్నాయట. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి. స్మార్ట్‌గా వాడితే, స్మార్ట్‌ ఫోన్‌ని మించిన స్వర్గం లేదు. పైన చెప్పినట్లు అడ్డగోలుగా వాడితే, స్మార్ట్‌ ఫోన్‌ అంత నరకం ఇంకోటి లేదు. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి