నవ్వుల జల్లు - జయదేవ్

గంధర్వుడు: రంభ, మేనక, తిలోత్తమలు భూలోకానికి వెళ్ళారా?
కిన్నెరుడు: దేవేంద్రులు, ఆ ముగ్గుర్ని అలంకారంగా సింగారించుకురమ్మని ఆదేశించారు! సలహా కోసరం ముగ్గురూ భూలోకానికి పరుగెత్తారు!
గంధర్వుడు: ఎవర్ని సలహా అడుగుతారట?
కిన్నెరుడు: వడ్డాది పాపయ్య గార్ని!!

 


ఉప సైన్యాధిపతి: శత్రు సైన్యం కోట చుట్టూ ఆక్రమించారు? మన తక్షణ కర్తవ్యం??
సైన్యాధిపతి: రాజు గారు వరుణసూక్త యాగం తలపెట్టారు!
ఉప సైన్యాధిపతి: ఏం ప్రయోజనం??
సైన్యాధిపతి: వర్షాలు పడతాయి. వర్షంలో తడిసి, శతృసేనలు జలుబు, దగ్గు, జ్వరం తెచ్చుకుని పారిపోతారని, నమ్ముతున్నారు మన రాజుగారు!!

అమ్మ: ఏమిటే, నీ జడను జిగిబిగిగా అల్లుకున్నావ్?
కూతురు: అల్లసాని వారి కవితలను చదూతూ, చిక్కు తీసుకోడం మరిచిపోయానమ్మా!!
 

"చీకట్లో దారి తడమాటం దేనికి? నీ చుట్ట నిప్పు కాస్తివ్వు! కొరివి వెలిగిస్తాను!
"ఎవరు నువ్వు"
"కొరివి దెయ్యం!!"


దుష్యంతుడు: నిన్ను గాంధర్వ వివాహమాడ దలిచాను సుందరీ!
శకుంతల: తమరి పేరు?
దుష్యంతుడు: గుర్తు లేదు, మరిచిపోయాను నారీమణీ!!

ధ్వజ స్తంభం: ఈ గుడికెంతమందొచ్చారో నేను సరిగ్గా చెప్పగలను తెలుసా?
బలిపీటం: నేనూ సరిగ్గా చెప్పగలను!!
నంది: గుళ్ళో కెంతమందొచ్చారన్న సంగతి పక్కన పెట్టండి! గర్భగుడిలో ఎంత మంది ప్రవేశించారో మీరు చెప్పగల్రా? నేను చెప్పగలను!!


విటోబాయి: ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు?
పండరి నాధుడు: ఉన్నావా... అసలున్నావా... అనడుగుతున్నారు భక్త తుకారాం గారు!!
విటోబాయి: ఉన్నామని చెప్పండి!!
పండరి నాధుడు: చెబితే వినేరకం కాదు, ఆయన!
విటోబాయి: పోనీ దర్శనమిద్దాం!
పండరి నాధుడు: అదే ఆలోచిస్తున్నాను!! ఎప్పుడిద్దామా అని!!


ఒక గోపిక: నువ్వెన్నో గోపికవు?
మరో గోపిక: అది సరిగ్గా చెప్పగలను కానీ, ఎన్నో కృష్ణుడి గోపికవు అనడిగితే చెప్పనాతరం కాదు!


లంక రాక్షసి: రావణుల వారి భుజాలు వాచి వున్నాయే పాపం??
లంక రాక్షసుడు: కైలాసగిరిని పెకలించడానికి ప్రయత్నించారటలే!!
 


తుమ్మెద: పొద్దున్న తూర్పు వైపున, మధ్యాహ్నం పడమర వైపున తిరుగుతూ కనిపించావే??
తేనెటీగ: ఈ రోజు పొద్దు తిరుగుడు పూల నుండి మధువు గ్రోలాము మిత్రమా!!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు