డెడ్లీ సెల్ఫీ: ప్రమాద ఘంటికలు మోగేస్తున్నాయ్‌ - ..

dedly selfee
సెల్ఫీ ఓ సరదా. ఏ సరదా అయినా ముదిరి పాకాన పడితే, అది వ్యవసనమై కూర్చుంటుంది. ఆ వ్యసనం కూడా హద్దులు దాటేస్తే, దాన్ని ఏమనాలో ఏమో! సెల్ఫీ పైత్యం గురించి కూడా ఇప్పుడు అందుకే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంట్లో సెల్ఫీ తీసుకోవడం సాధారణమైన విషయం. అందమైన లొకేషన్లలో సెల్ఫీ తీసుకుంటో, అదో తీపి గురుతు. కానీ మనం అన్న గురుతు ఈ భూమ్మీద చెరిగిపోయేందుకు సెల్ఫీ కారణమైతే? ఆ ఆలోచన భరించలేనిదే. కానీ, ఆ భయం ఇప్పుడు చాలామందిలో కన్పించడంలేదు. ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని అనలేంగానీ, నిర్లక్ష్యమైతే చాలా ఎక్కువైపోయింది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అనే ఆలోచనలతో అత్యంత ప్రమాదకర స్థితిలో సెల్ఫీలకు తెగబడ్తున్నారు ఔత్సాహికులు. అదే వారి కొంప ముంచేస్తోంది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ ఇప్పుడీ సెల్ఫీ మరణాలు ప్రమాద ఘంటికలు మోగించేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు సర్వేలు, ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారికంటే కూడా సెల్ఫీల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారే ఎక్కువని తేల్చేతుండడం ఇంకా ఆందోళన చెందాల్సిన విషయం. ఎక్కువగా ఈ సెల్ఫీ మృతుల్లో యువతే ఉండడం చాలా చాలా బాధాకరమైన విషయం. 14 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళలోపువారిలో ఈ సెల్ఫీ పిచ్చి మరింత ఎక్కువగా ఉందని ఓ అంచనా. సెల్ఫీ మరణాలు పెరిగిపోతున్న దరిమిలా, 'ప్రమాద హెచ్చరికల బోర్డుల్లో' సెల్ఫీల గురించిన సమాచారాన్ని ఉంచుతూ పాశ్చాత్య దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఆ హెచ్చరికల్ని చాలామంది బేఖాతరు చేస్తుండడంతో, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలకు భారీ జరీమానాలు విధించడమే కాయ, జైలు శిక్షలు కూడా విధించే దిశగా కొన్ని దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి.

టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్‌ ఫోన్లలో వచ్చిన మార్పులైతే అనూహ్యం. ముందు ముందు ఇంకెన్ని మార్పులు రాబోతున్నాయో తెలియదు. అరచేతిలోనే ప్రపంచమంతా అన్నట్లుగా మనిషి ఆలోచనల్ని స్మార్ట్‌ ఫోన్‌ మార్చేసింది. అది నిజమే కూడా. కానీ ఆ అరచేతిలోనే స్మార్ట్‌ఫోన్‌ రూపంలోనే మృత్యువు కూడా దిగి ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చట్టాలు తీసుకొచ్చి, సెల్ఫీలను కంట్రోల్‌ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. సెల్ఫీ అనే కిల్లింగ్‌ వ్యసనంపై ఎవరికి వారే అప్రమత్తంగా ఉండడం మంచిది. రోడ్లపైనా, రైల్వే ట్రాక్స్‌పైనా, ఎక్కడికక్కడ సెల్ఫీలకు పోజులిస్తూ, తమ ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేయడమే కాదు, ఇతరుల ప్రాణాలకూ ప్రమాదకరంగా మారుతోన్నవారిలో మార్పు ఎలా వస్తుందోగానీ ఈ సెల్ఫీ మరణాల్ని ఎలా తగ్గించాలో తెలియక పోలీస్‌ వ్యవస్థ కూడా చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏదేమైనా పరిస్థితి చూస్తోంటే క్యాన్సర్‌, గుండెపోటు వంటి తీవ్రమైన రోగాల జాబితాలోకి ఈ సెల్ఫీ రోగం కూడా చేరిపోయేలా ఉంది. కానీ ఈ రోగానికి సొంత చికిత్స మాత్రమే ఉంది. అది ఎవరికి వారు చేసుకోవాల్సిన చికిత్స.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి