జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

రాజధిరాజు: కొలువులో అందరూ చెవుల్లో పూలు పెటుకున్నారే?
మహా మంత్రి: మీ దిక్కుమాలిన పరిపాలనకి, నిరసనగా ప్రభూ!  
రాజాధిరాజు: ఐతే, పువ్వులు పట్రా... నేనూ చెవుల్లో పెట్టుకుంటాను!
మహామంత్రి: మీరు పెట్టుకోడమెందుకూ?
రాజాధిరాజు: నాకు సలహాలందించేందుకు, నీ లాంటి దిక్కుమాలిన వాడిని మహా మంత్రిగా నియమించినందుకు!!



*****************
(అంతరంగిక మందిరం లో)

రాజు: రాణిగారెక్కడ?
పరిచారిక: కోశాగారం లో చిల్లిగవ్వలేదట కదా?
రాజు: అందుకని?
పరిచారిక: వంటింట్లోంచి ఉల్లిపాయల్ని తీసుకుని బజారుకెళ్ళారు!
రాజు: ఎందుకు?
పరిచారిక: ఉల్లి ధర బాగా పెరిగిందిగా, అమ్మి డబ్బు చేసుకుందామని!!

*****************

సైఫుల్లా: నీ టోపీ బాగుందే?
కలీముల్లా: ఆలంపనా ఔరంగా జేబ్ గారు స్వయంగా కుట్టిన టోపీ! మస్తాన్ కొట్లో  పదికాసులిచ్చి కొన్నాను! మరి నీ టోపీ యో?
సైఫుల్లా: ఒకే కాసిచ్చి కొన్నా!
కలీముల్లా: అంత తక్కువ ధరకా? ఎక్కడా?
సైఫుల్లా: ఆలంపనా ఔరంగా జేబ్ గారి నుంచే... నేరుగా!!




*****************

ఒక ఆశ్రమవాసి: రోజూ మూడు సార్లు ప్రాణాయామం చేసి, మూడు పూటలూ సాత్వికాహారం తింటే మాంచి నిగ్రహ శక్తి వస్తుంది తెల్సా?
రెండో ఆశ్రమవాసి: ఇప్పుడర్ధమైంది... నీకు పుత్ర సంతానం ఎందుకు కలగలేదో అని!!




*****************

కుజుడు: గంధర్వ కన్యలంతమంది శుక్రుడి వెంటపడి తిరుగుతున్నారే?
బుధుడు: నువ్వు పగడం ధరించావ్! నేను పచ్చ ధరించాను!!
శుక్రుడు అమెరికన్ డైమండ్ ధరించాడుగా! అదే మోజుకి కారణం!!




*****************

కాకి పిల్ల :
అమ్మా... గూట్లో రెట్టవెయ్యకని ఎన్నిసార్లు చెప్పాలి? కంపు భరించలేకపోతున్నాం!
తల్లి కాకి: అయితే రేపట్నుంచీ సముద్రం లో వేస్తానులే!!




*****************
లంక రాక్షసుడు అక్రమ తుంగ:
  అబ్బబ్బ... ఎవరయ్యా ఆ గావు కేకలు పెట్టేదీ... ఏమైందని?
లంకరాక్షసుడు దరిద్ర నాయక: కుంభ కర్ణుల వారు మంచం మీది నుంచి దొర్లిపడ్డారు! ఆయన గారి శరీరం కింద రక్షక భటులు చిక్కుకున్నారు తెలియదా?
లంక రాక్షసుడు అక్రమ తుంగ:  వాళ్ళని బయటికి లాగేయొచ్చుగా?
లంకరాక్షసుడు దరిద్ర నాయక: ఆరు నెలలు ఆగాలట!!


*****************

ఎండ్రకాయ బావ: "వానా వానా చెన్నప్పా..." ఆడుకొందాం వస్తావా?
ఎండ్రకాయ మరదలు: నా వేళ్ళు కత్తిరించనని మాటిస్తే వస్తా!!




*****************

మిత్రుడు:
నిషిద్ధాక్షరి పప్పులో కాలేశావటగదా? ఇంతకీ ఏం పద్యమేమిటీ?
అష్టావధాని ఎర్రన్న: పప్పులో కాలేయమనే పద్యం! 'పా, ' కా' లు పలక్కూడదన్నారు పృచ్చకులు!!

 

 

 

*****************

వెంగళప్ప: పోతన గారు కర్షకులట గదా?
చెంగలప్ప: కర్షకులే కాదు.. ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా...
"ఇంతింతై... వటుడింతింతై..." పద్యం చదివితే తెలుస్తుంది!!                        

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి