12-1-2018 నుండి18-1-2018 వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తం మీద నూతన విషయాల పట్ల అత్యుత్సాహం కలిగి ఉండక పోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన పెట్టుబడులకోసం చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట మంచిది. ఉద్యోగంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి సహకారం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదాపడుతాయి, కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చును. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు పడుతాయి. మిత్రులతో చర్చలకు అవకాశం ఉంది. గతంలో మొదలు పెట్టిన వాటిని పూర్తిచేయండి.

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరప్రదేశప్రయాణాలు చేయవల్సి వస్తుంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన నూతన సమస్యలు వస్తాయి. రుణపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. మీస్థాయికి మించి వెళ్ళకండి అలాగే హామీలు కూడా ఇవ్వకండి. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమఫలితాలను ఇస్తాయి. వారిఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళుట మంచిది. చర్చల్లో నిదానం అవసరం. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. సమయాన్ని విశ్రాంతికి
వినియోగించుట మంచిది.

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుట ద్వారా పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు నూతన విభేదాలకు కారణం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీరు తీసుకున్న రుణసంబంధమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన నష్టం తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రణాళిక లేకపోతే అధికారులకు సమాధానం చెప్పవలసి వస్తుంది. జీవితభగస్వామితో కలిసి దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా నిర్ణయాలు తీసుకోవడం సూచన.
 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద కాస్త మీ ఆలోచనలు తోటివారిని ఇబ్బందికి గురిచేసే విధంగా ఉండే ఆస్కారం ఉంది, కాస్త సరిచేసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరంగా కాస్త మెరుగయ్యే అవకాశం ఉంది, వచ్చిన నూతన అవకాశాలను అందిపుచ్చుకోండి. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ఈవారం విందులల్లో పాల్గొనే ఆస్కారం కలదు. సంతానం నుండి మీకు పూర్తిసహకారం లభిస్తుంది , అలాగే వారివలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. వాహనాల వలన అనుకోకుండా ఖర్చులు కలుగుతాయి.

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద అధికసమయం ప్రయాణాలకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని వెళ్ళుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు సత్ఫాలితాలు ఇస్తాయి. కుటుంబంలో సమయాన్ని సరదాగా గడుపుతారు, గతకొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు పెద్దలకు సమాధానం చెప్పవలసి వస్తుంది, అందుకోసం సిద్ధంగా ఉండుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మిత్రులతో సాధ్యమైనంత మేర వివాదాలు రాకూండా జాగ్రత్త పడటం మంచిది.

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద మీ ఆలోచనలు పెద్దలకు నచ్చేవిగా ఉంటాయి, వారినుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. మేకురావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఇంటికి రావాల్సిన బంధువులు అనుకున్న సమయానికి రాకపోవచ్చును. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది , తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట మంచిది. అధికారుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది.  దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. సోదరులనుండి ఆశించిన సలహాలు , సూచనలు అందుతాయి. సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, అనుభవజ్ఞుల సూచనలను పరిగణలోకి తీసుకోండి.

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కొన్నింటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన సూచనల్ను పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఆస్కారం కలదు. అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, కాస్త పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చూపకండి. సమయానికి భోజనం చేయుట సూచన. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. స్త్రీ పరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించుట మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉన్నతవిద్యకోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అప్పుల విషయంలో మాత్రం స్పష్టత అవసరం , లేకపోతే నూతన సమస్యలు ఎదుర్కొంటారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనేముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్న బంధువుల అలాగే మిత్రుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు సందిగ్దత ఉండే అవకాశం కలదు. మీ కోపం మూలాన ఆత్మీయులను ఇబ్బందికి గురిచేస్తారు. స్త్రీ పరమైన విషయాల్లో నిదానం అవసరం. అలాగే ఎవరికైనా మాటఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించుత అలాగే సర్దుబాటు విధానం అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పెద్దలను కలుస్తారు, వారి నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళండి. నూతన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు నిదానం అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. జీవితభాగస్వామితో ఊహించని విధంగా మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది,సర్దుబాటు విధానం శ్రేయస్కరం. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు లేదా ఆత్మేయుల కోసం హాస్పిటల్ ఖర్చులు అయ్యే ఆస్కారం ఉంది. సొంత నిర్ణయాలు తీసుకొనేటప్పుడు స్పష్టత ఉండకపోవచ్చును అలాగే మీ పై మీకు నమ్మకం కలిగి ఉండుట సూచన. ముఖ్యమైన మిత్రులను కలుస్తారు.

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఆరంబంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం సూచన. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపడుతారు. వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. అలాగే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. తండ్రితరుపు బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. వారం చివరలో ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద చర్చలకు అవకాశం ఇవ్వకండి. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన. ఎవరికీ మాటఇవ్వకపోవడం మంచిది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. వాహనాల వలన ఖర్చులు కలుగుతాయి. అలాగే వాహన ప్రమాదాలు జరుగుటకు ఆస్కారం ఉంది , జాగ్రత్త. కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. జీవితభాగస్వమితో మీరు చేసిన పనులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.  

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి