బహుపరాక్‌: బలిపీఠంపై యువత - ..

youth on danger gone

పదేళ్ళ వయసులోనే ఓ విద్యార్థికి మానసిక సమస్యలు తలెత్తాయి. ఇంట్లో ఎప్పుడూ అల్లరి చేసే ఆ చిన్నారి, ముబావంగా కన్పిస్తుండడంతో అతన్ని వైద్యులకి చూపిస్తే, 'ఆత్మన్యూననతో బాధపడుతున్నాడు' అనే విషయం డాక్టర్‌ ద్వారా అతని తల్లిదండ్రులకి తెలిసింది. కారణమేంటని ఆరా తీస్తే, స్కూల్‌లో సహ విద్యార్థులు 'గేలి' చేస్తుండడం కారణంగానే అన్న విషయం వెలుగుచూసింది. ఓ ఇంటర్‌ విద్యార్థి పరిస్థితీ ఇదే, ఉద్యోగం చేస్తున్న యువకుడిదీ అదే పరిస్థితి. రంగు, శరీరాకృతి సహా అనేక విషయాల్లో ఈ 'గేలి' అనేది ఇటీవల సర్వసాధారణమైపోయింది. అదే అన్ని సమస్యలకూ కారణమని మానసిక వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నల్లగా ఉన్నవారు జీవితంలో అత్యున్నత శిఖరాల్ని అందుకోలేరా? పొట్టిగా ఉన్నవారు జీవితంలో ఏమీ సాధించలేరా? అన్న ప్రశ్నలు వేసుకుంటే, అదంతా ఉత్తదేనని అర్థమవుతుంది. 'నేనెలా ఉన్నా సరే, అది నాకిష్టం' అనే ఆత్మస్థయిర్యంతో వుంటే గనుక, రంగు కావొచ్చు, ఎత్తు కావొచ్చు ఇంకొకటి కావొచ్చు. ఏదీ మీ ఎదుగుదలకు అడ్డంకి కాబోదు. సాధించాలన్న పట్టుదల మాత్రమే ముఖ్యమిక్కడ. దురదృష్టవశాత్తూ ఇతరుల 'గేలి' కారణంగా, యువత బలహీనమైపోతోందిప్పుడు.

బ్యూటీ ప్రోడక్ట్స్‌ చాలావరకు యువతని టార్గెట్‌గా చేసుకున్నవే. ఏ ప్రోడక్ట్‌ అయినాసరే హాని కారక పదార్థాలు ఎంతో కొంత వుంటాయి. తద్వారా మంచి జరగాల్సిందిపోయి, చెడు జరిగేందుకూ ఆస్కారముంటుంది. ఈ మధ్యన 'సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని' అంటూ కొన్ని ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాటి పట్ల యువత బాగా ఎట్రాక్ట్‌ అవుతున్నా, అవి తెచ్చే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఓ సర్వేలో వెలుగు చూసిన సారాంశమేంటంటే, యువత తమ రంగు గురించీ, ఎత్తు గురించీ కలత చెందుతూ, కృత్రిమ పద్ధతుల్లో తమ మేని ఛాయని పెంచుకోవాలనీ, ఎత్తుని పెంచుకోవాలని చూడటం ద్వారా ప్రాణమ్మీదకు తెచ్చుకుంటున్నారట. హైదరాబాద్‌లోనే ఓ కుర్రాడు హైట్‌ పెంచుకోవడం కోసం సర్జరీని ఆశ్రయిస్తే, అది వికటించి, ఆ తర్వాత ఆ కుర్రాడు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంకో ఘటనలో, అందం పెరగడానికి ఓ 'జ్యూస్‌'ని ఓ అనాకారీ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొస్తే, అది సేవించి ఓ యువతి ఆసుపత్రి పాలైంది. నోటి నుంచి జీర్ణవ్యవస్థ వరకూ పాడైపోయి, ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకుందామె. వైద్యులు ఎలాగోలా ఆమె ప్రాణాల్ని కాపాడగలిగారు.

అందం ఆత్మవిశ్వాసాని పెంచుతుందన్నది వెనకటి మాట. ఆత్మవిశ్వాసంతో ఎవరైనా అందంగా కన్పించగలుగుతారన్నది నేటి మాట. ఏ రంగంలో తీసుకున్నా అత్యున్నత స్థాయి శిఖరాలకు చేరినవారు రంగుతోనో, అందంతోనో, ఎత్తుతోనో ఆ ఘనతను సాధించారనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఎవరన్నా మిమ్మల్ని 'గేలి' చేస్తున్నారంటే, వారిలో లేని ఏదో టాలెంట్‌ మీలో ఉన్నట్లే భావించాలి. అలా మిమ్మల్ని మీరు పూర్తిగా 'ఆమోదించుకోగలిగితే' అద్భుతాలు సాధించొచ్చు. ఎవరో గేలి చేశారని అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఆత్మన్యూనతకు దిగితే ప్రాణమ్మీదకు తెచ్చుకున్నవారవుతారు. తద్వారా ఇతరులు మరింతగా మిమ్మల్ని గేలి చేసేందుకు చాన్స్‌ ఇచ్చినట్లవుతుంది. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి