గ్యాడ్జెట్స్‌ గ్యాడ్జెట్స్‌ గ్యాడ్జెట్స్‌ - ..

Gadgets gadgets gadgets

ప్రపంచం టెక్నాలజీలో పరుగులు పెడ్తోంది. 'స్మార్ట్‌ - ఇంకా స్మార్ట్‌' అంటూ దూసుకుపోతోంది. మొబైల్‌ దగ్గర్నుంచి, ఇంటికి వేసే తాళం వరకూ అన్నీ స్మార్ట్‌ కబుర్లే. రోజుకో కొత్త స్మార్ట్‌ కబురుని వింటున్నాం. ఇంకా ఏమేం కబుర్లను వింటామోనన్న ఆసక్తి స్మార్ట్‌ స్మార్ట్‌గా మన మెదళ్ళను తొలిచేస్తున్నాయి. రోజుకో కొత్త వింత గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ మరుసటి రోజుకే ఆ వింత పాతదైపోతోంది. ఇదివరకటి పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయనడానికి ఇదే పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. భవిష్యత్‌ అంతా స్మార్ట్‌ మాత్రమే కాదు చాలా చాలా స్మార్ట్‌గా మారబోతోంది. గాల్లో తేలినట్టుందే అన్న మాట త్వరలో నిజం కాబోతోంది. దానికోసం జెట్‌ ప్యాక్స్‌ ఇప్పటికే ప్రయోగాలు పూర్తి చేసుకున్నాయి. డ్రోన్‌లతో పిజ్జా డెలివరీల గురించి వింటున్నాం. పిజ్జా మాత్రమేనా? మనుషులూ అలా డ్రోన్ల సహాయంతో ఎగిరిపోలేమా? అన్న ఆలోచన కూడా వచ్చేసింది. ఆ దిశగానూ కసరత్తులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రయోగాల దశలో ఉంటే, ఇంకొన్ని ట్రయల్స్‌ దశలోనూ ఉన్నాయి. ఎప్పుడో ఏడాది తర్వాతో, రెండేళ్ళ తర్వాతో అవి అందుబాటులోకి వస్తాయని డీలాపడిపోవాల్సిన పనిలేదు. నాలుగైదు నెలల్లో అలాంటివి అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, టెక్నాలజీ వేగం ఆ స్థాయిలో ఉంటోంది.

పేషెంట్‌, డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన రోగం సంగతేంటో డాక్టర్‌కి తెలిసిపోతోంది, ఇవ్వాల్సిన మందులేవో డాక్టర్‌ సూచించేస్తున్నాడు. కొన్ని శస్త్ర చికిత్సల్ని రోబోలు నిర్వహించేస్తున్నాయంటేనే వైద్య రంగం ఎంత స్మార్ట్‌గా మారింతో అర్థం చేసుకోవచ్చు. ఇదే టెక్నాలజీలో అత్యుత్తమం అని అనుకోవడానికి వీల్లేదు. రేప్పొద్దున్న ఇంకెలాంటి అద్భుతం చూడాల్సి వస్తుందో! యస్‌, ముందే చెప్పుకున్నట్టు ఈ రోజు ఏదైతే కొత్త టెక్నాలజీ అనుకుంటున్నామో, అది రేపటికి పాతబడిపోయి, ఇంకో కొత్త ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఒకప్పుడు అనుభవంలోంచి ఆవిష్కరణలు వచ్చేవి. ఇప్పుడు, కొత్త తరం నుంచి సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. దాంతో, ఈ ఆవిష్కరణల వేగం చాలా చాలా ఎక్కువగా ఉంటోంది. చిన్నప్పటినుంచే, అంటే ఎల్కేజీ వయసు నుంచే చదువుతోపాటు 'అంతర్గతంగా ఉండే ఇంకో టాలెంట్‌'ని వెలికితీయడం ప్రారంభమైపోతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైతే, ఇక అద్భుతాలు అక్కడినుంచే ప్రారంభమవుతాయనడం నిస్సందేహం.

పాస్‌వర్డ్‌లను బ్రేక్‌ చేయడం, ఎథికల్‌ హ్యాకింగ్‌ వంటివి చిన్నప్పటినుంచే ఓ సరదాగా మార్చేసుకుంటున్నారు నేటితరం పిల్లలు. దానిక తోడు మార్కెట్‌లో టెక్నాలజీ విరివిగా దొరికేస్తోంది. ఎలక్ట్రానిక్‌ యంత్ర సామాగ్రి అందుబాటులో ఉండటంతో, ప్రయోగాలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఆ ప్రయోగాలే సరికొత్త ఆవిష్కరణలకు దిశానిర్దేశం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇంటికి వేసే తాళం స్మార్ట్‌గా మారిపోతోంది. రైతు పంప్‌ సెట్‌ వేయడాన్ని కూడా స్మార్ట్‌గా అలవాటు చేసుకున్నాడు. వైద్యం స్మార్ట్‌గా తయారైంది. ఒకటేమిటి? ఇప్పుడు నడుస్నుదే స్మార్ట్‌ యుగం. ఇందులో యువత పాత్రే అత్యంత కీలకం. సాహోరే స్మార్ట్‌ యువత! 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి