ఆతిథ్య రంగం - మీదే ఈ ప్రపంచం - ..

this world is yours

ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి అయినా వెళ్ళి చూడండి, ఆతిథ్య రంగానికి పెద్ద పీఠ వేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. అభివృద్ధి చెందిన దేశాలకు అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నది ఈ ఆతిథ్య రంగం కారణంగానే. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఆతిథ్య రంగం వైపు దృష్టి సారించాయి. వెనకబడ్డ దేశాలూ, తాము అభివృద్ధి వైపుకు దూసుకుపోవడానికి ఆతిథ్య రంగాన్నే నమ్ముకుంటున్నాయి. ఆతిథ్య రంగమంటే, మళ్ళీ అక్కడా యువతకే పెద్ద పీఠ వేస్తుండడం కనిపిస్తుంది. ఆతిథ్యం అంటే ఒక్క హోటల్‌ రంగమే అనుకునేరు, కథ చాలానే ఉంది. హెల్త్‌ టూరిజం అనీ, ఆధ్మాతిక పర్యాటకమనీ కొత్త కొత్త పేర్లతో ఆతిథ్య రంగానికి కొత్త సొగసులు అద్దుతుండడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. తద్వారా ఆ రంగంలో ఉద్యోగావకాశాలు పెద్దయెత్తున పుట్టుకొస్తున్నాయి. ఓ అంచనా ప్రకారం, ఏ రంగంలోనూ లేని వృద్ధి ఈ ఆతిథ్య రంగంలో కన్పిస్తోందంటే ఈ రంగంలో అవకాశాలు ఎలా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఆతిథ్య రంగం అనగానే ముందుగా 'అందం' గురించిన ప్రస్తావన వస్తుంటుంది. అయితే కాస్తంత అందంగా ఉండడం ఈ రంగంలో అవకాశాల్ని మెరుగుపర్చుతుందేమోగానీ, ఇతరత్రా చాలా విషయాలు ఆ అందాన్ని డామినేట్‌ చేస్తాయని చెప్పక తప్పదు. స్మార్ట్‌గా వ్యవహరించడం, ఆ రంగం గురించిన పూర్తి అవగాహన ఇక్కడ అత్యంత కీలకం. స్థానిక భాషల్లో ప్రావీణ్యం, అతిథులు మెచ్చేలా బాడీ లాంగ్వేజ్‌ మార్చుకోవడం వంటివి ఈ రంగంలో ఎదుగుదలను నిర్దేశిస్తాయి. అక్కడా ఇక్కడా అని కాదు, ఎక్కడైనా ఆతిథ్య రంగం అద్భుతమే. అందుకే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆతిథ్య రంగంలో అవకాశాలు మెండుగా ఉంటాయని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతుంటారు. ఏమీ లేని చోట కూడా అత్యద్భుత పర్యాటక ప్రాంతాన్ని సృష్టించేస్తున్నారిప్పుడు. ఆ రకంగా చూస్తే ముందు ముందు ఈ ఆతిథ్య రంగానికి మరింత ఎదుగుదలే తప్ప, ఇందులో ఏమాత్రం 'డౌన్‌ ఫాల్‌' గురించిన ఆలోచన చేయాల్సిన పనిలేదు.

కనీస విద్యార్హత నుంచి, అత్యున్నతస్థాయి విద్యార్హత వరకు ఆతిథ్య రంగంలో ఎవరికైనా 'ఉపాధి' దొరుకుతుండడం చెప్పుకోదగ్గ ఇంకో ముఖ్యమైన అంశం. ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగంలో రాణించాలనుకునేవారికి ఎక్కడికక్కడ శిక్షణ ఇచ్చేందుకు వివిధ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. సముద్ర విహారం దగ్గర్నుంచి, హెల్త్‌ టూరిజం, డివైన్‌ టూరిజం వరకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఈ శిక్షణా సంస్థల్లో మిమ్మల్ని ఎడ్యుకేట్‌ చేయడానికి నిపుణులు సిద్ధంగా ఉంటున్నారు. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే కాదు, మీ అభిరుచి ఆతిథ్య రంగంలో రాణించడం వైపు ఉంటే, నిర్భయంగా ఈ రంగం వైపు వడివడిగా అడుగులు వేసేయొచ్చు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు