జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

 

 

 

పౌరుడు: నీకో రహస్యం తెలుసా? మన రాజు గారు మూడో లింగం!!
రెండో పౌరుడు: అందుకేగా, రాణి గారిని వెతికి వెతికి పట్టి పెళ్ళిచేసుకున్నారు!
మూడో పౌరుడు: ఔనా? మరి రాణి గారి ప్రత్యేకత ఏమిటి?
నాలుగో పౌరుడు: ఆమె కూడా మూడో లింగం!!

 

***********
మంత్రి: రాజు గారి అల్లుడు గారు, తనకి రాజ్యం వొద్దు అన్నారట!
ఉపమంత్రి: ఎందుకూ?
మంత్రి: దానికి బదులు, గోశాలకి ఎండు గడ్డి, అశ్వశాలకి పచ్చిగడ్డి, గజ శాలకి చెరుకు గడల  'కాంట్రాక్ట్' తనకే ఇప్పిస్తే చాలట!!

 

 

***********
వింజామర కన్య విమల:  ఒశేవ్, నిన్ను ఉద్యోగం లోంచి పీకేశారటగా? ఏం చేశావ్?
వింజామర కన్య కనకం: రాజు గారి మీద ఒక ఈగ వాలింది!
వింజామర కన్య విమల: వాలితే?
వింజామర కన్య కనకం: దాన్ని ఒక్క బాదు బాది చంపేశాను!!
వింజామర కన్య విమల: ఒక చిన్న కీటకాన్ని చంపినందుకా శిక్ష?
వింజామర కన్య కనకం: రాజు గారి భుజం విరిగిందిగా?!

 

***********
ఒక రాక్షసుడు: అరె... ఈ దసరా వేషం భలే వింతగా వుందే?
ఇంకోరాక్షసుడు: ఎహె... ఆయన ఎవరనుకున్నావ్... హిరణ్య కశిపుని వధించి ఉగ్రంగా నడిచివస్తున్న విష్ణుమూర్తి... తప్పుకో!!

 

 

 

***********

ఒక పౌరుడు: నువ్వు నేపాళం వెళ్ళి, అక్కడ మాంత్రికుల వద్ద శిక్షణ పొంది వచ్చావటగా? నువ్వేం నేర్చుకున్నవ్?? ఏం తెల్సుకున్నావ్?
రెండో పౌరుడు: మంత్రాలకి చింతకాయలు రాలవని తెల్సుకున్నాను!!

 

 

***********

తెలివైన అత్తమ్మ: బియ్యం రుబ్బితే పిండొస్తుంది కదా!
గడసరి కోడలు: ఔను! మరి పిండి రుబ్బితే రాళ్ళొచ్చాయే?
తెలివైన అత్తమ్మ: దానిక్కారణం నువ్వే ! బియ్యం లో రాళ్ళేరమన్నాను!! మరి.. నువ్వేరలేదు!!


 

***********
సముద్రం తండ్రి చాప: ఏరా నువ్వు... కోనేటి చాప పిల్లని ప్రేమించావా? ఆ పిల్లని ఎప్పుడు కలిశావ్?
కొడుకు చాప: నేను కలవలేదు! ఆ పిల్లే వరదల్లో కొట్టుకుని ఇక్కడికొచ్చింది!!
తండ్రి చాప: అది మంచి నీటి చాప! దాన్ని పెళ్ళి చేసుకుంటావంటే నేనొప్పుకోను!
కొడుకు చాప: "మంచి" అని నీ నోటి ద్వారానే చెప్పావ్! కనుక ఆ పిల్లనే చేసుకుంటాను నానా!!

***********
ఎల్లయ్య: ఈ ఏడు సంవత్సరికానికి మా తాతగారే వచ్చారు! మా నాన్న రాలేదు
పుల్లయ్య: ఎలా?
ఎల్లయ్య: ఒక కాకే వచ్చింది, పిండ ప్రసాదం తినడానికి!!
పుల్లయ్య: ఆ కాకి  మీ నానెందుకు కాకూడదు?
ఎల్లయ్య: ఆ వొచ్చింది, ముసలి కాకి!!
 

 

***********

రాజవైద్యుడు: రాజుగారికి సుస్తీ చేసి పడుకుని వున్నారు! గుళికలిచ్చి వస్తున్నాను! ఐతే కొలువులో రాజుగారు సిం హాసనం మీద కూర్చుని వున్నారే!
మంత్రి: అది రాజుగారి "డూప్" !
రాజ వైద్యుడు: ఆ "డూప్" పక్కన మహారాణిగారు కూర్చుని వున్నారే?
మంత్రి: అది రాణి గారి "డూప్" !!

 

 


***********

మొగుడు: స్వామికి నైవేద్యం పెట్టనన్నావ్? పళ్ళెం ఖాళీ గా వుందే?
పెళ్ళాం: స్వామి తినేశారు!!
మొగుడు: నమ్మశక్యంగా లేదే??
పెళ్ళాం: (చేతులూ, నోరూ కడుక్కుంటూ..) దేవుడి మీద మీకు నమ్మకం వుంటేగా?

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి