26-1-2018 నుండి1-2-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈ వారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళుట మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి,సానుకూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది. వాహనాల వలన ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. సంతానం విషయంలో సంతోషాన్ని పొందుటకు ఆస్కారం ఉంది, వారిమూలన మంచి పేరును పొందగలుగుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాల్లో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి , మిత్రులనుండి వచ్చిన సహకారం మీకు అభివృద్ధిని కలిగించేదిగా ఉంటుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో మరింతగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ప్రణాళిక కొన్ని విషయాల్లో కలిగి ఉండుట సూచన.

 

 


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద మిశ్రమఫలితాలు పొందుతారు. మానసికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడిని పొందుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, స్వల్పఅనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, జాగ్రత్త. మీ మాటతీరు చాలామందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో వివాదాలకు అవకాశం ఇవ్వకండి, సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట మంచిది. మిత్రులతో చర్చలకు అవకాశం ఉంది.

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి , ఆశించిన మేర సహకారం లభించుటకు అవకాశం ఉంది. భూ సంభందమైన విషయాల్లో నూతన కొనుగోలు వ్యవహారాలు చేస్తారు. జీవితభాగస్వామితో అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం అశ్రద్ధ కూడదు , పెద్దలు చెప్పినట్లుగా వినడం వలన మేలుజరుగుతుంది. కాస్త మానసికపరమైన ఒత్తిడి తప్పక పోవచ్చును. పూజల్లో పాల్గొనండి.

 

 సింహ రాశి :ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల్లో మీదైనా విధానం కలిగి ఉంటారు, సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల వలన అనుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది , కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశీ లేదా దూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, కలిసి వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి.

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకండి. మీ మాటతీరు వివాదాలకు కారణం అయ్యే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. ప్రణాళిక కలిగి ఉండుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మీ నిర్ణయాలు కాస్త కఠినంగా ఉండే అవకాశం కలదు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీకున్న ఇబ్బందులు కాస్త తొలగుటకు అవకాశం కలదు. మిత్రులను కలుస్తారు.

 

తులా రాశి :   ఈవారం మొత్తం మీద నూతన నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి తప్పక పోవచ్చును. జీవితభాగస్వామితో మీకున్న ఇబ్బందులు తగ్గకపోగా మరింతగా పెరిగే ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సోదరులతో లేదా పెద్దలతో తలపెట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది లేదా పూర్తికాకపోవచ్చును. కుటుంబంలో మీ ఆలోచనలు ఒంటరితనమును పెంచే అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు.

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చును. ధనం సమయానికి సర్దుబాటు కాదు. ముందుచూపు ఉండటం వలన మేలుజరుగుతుంది. వ్యక్తిగతమైన విషయాల్లో మీకంటూ ఒకవిధానం కలిగి ఉండుట మేలు. సాధ్యమైనంత మేర ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. పెద్దలనుండి సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణాలు అలాగే దూరప్రదేశప్రయాణాలు చేయాలనుకొనే వారికి అనుకూలమైన సమయం. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు.

 

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద నూతన నిర్ణయాల విషయంలో కీలకమైన ఆలోచనలు చేపడుతారు. తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. పెద్దలనుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, సాధ్యమైనంత మేర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడటం మంచిది. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం సూచన. వివాదాలకు దూరంగా ఉండుట మంచిది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆశించిన మేర ఆర్థికపరమైన విషయాల్లో సహకారం ఉంటుంది. మిత్రులను కలుస్తారు.

 

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వారితో కలిసి విందుల్లో పాల్గొనే అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఒప్పందాలకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన స్వల్ప ఇబ్బందులు ఎదురైనా తొందరగానే కోలుకునే అవకాశం ఉంది. పెద్దలతో పరిచయాలు అయ్యే అవకాశం ఉంది, వారినుండి సహకారం పొందుతారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.
 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సభ్యులనుండి వచ్చిన వ్యతిరేకతలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆస్కారం ఉంది. మిత్రులతో అనుకోకుండా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది, ఆర్థికపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంతానపరమైన విషయాల్లో కీలకమయిన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. తండ్రితరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దైవపరమైన విషయాలకు కాస్త సమయం ఇవ్వడం మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 

 

మీన రాశి :ఈవారం మొత్తం మీద సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలతో లేదా సభ్యులతో మీ ఆలోచనల్ను పంచుకుంటారు. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి సమాయన్ని గడుపుతారు. బంగారు అలాగే విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట మేలు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.

 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు