నేస్తమా... - శ్రావణ్ దమ్ములూరి .

nestamaa...

రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను , భోజనం కూడా చెయ్యలేదు . ఇంకో 2 గంటలలో  ఉదయం కూడా అయ్యిపోతుంది , కానీ నాకు నిద్ర రావటం లేదు. అలా మంచం పై వాలి నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూ ఆలోచనలలో పడ్డాను ...

అసలు మనుషులు ఎందుకు ఇంతలా  బ్రతకటం కోసం ఆలోచిస్తారు . మరలా బ్రతకటం కోసం మాత్రమే కాకుండా చాలా ఎక్కువ కాలం బ్రతకాలి, చాలా హోదాగా బ్రతకాలి అనుకుంటారు . కానీ , ఎవరు ఎంత వరకు బ్రతుకుతారో  ఎవరికీ తెలియదు. అలా...చావు అనే ప్రశ్న జీవితం లోకి  ఒక్క సారిగా వచ్చేసరికి ....

....  ఇప్పటి వరకు గడిచిన  జీవితం ఒక్కసారిగా  నా కళ్ల ముందు కదలటం ప్రారంభించింది. కదిలే ప్రతీ జ్ఞాపకం లోనూ వాడే ఉన్నాడు ... వెదవ. జ్ఞాపకాలు మాత్రమే ఉంచి వాడు గాలిలో కలిసిపోయాడు. గాయాన్ని తగ్గించే శక్తీ మందులకు ఉన్నా, మనసు గాయాన్ని తగ్గించే శక్తీ మాత్రం కేవలం జ్ఞాపకాలకు మాత్రమే ఉందని నేను నమ్ముతూ వాడి గురించే ఆలోచిస్తూ.... నిద్రలోకి జారుతున్నా ...

ఇంతలో నా ఫ్రెండ్ మనోజ్  ఫోన్ చేస్తున్నాడు. నేను ఆలోచనల నుండి బయటపడుతూ... ఆ నిద్ర మత్తు లోనే  ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాను,  చెప్పారా !! .  ఏ రా ... ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావ, జస్వంత్.  అవును రా...వేరే ఆలోచనలు ఎలా వస్తాయి.

మనోజ్ :  సున్నా తెస్తూ పుడతాం అందుకే  " జననం " , సున్నా కూడా తీసుకుపోకుండా  చనిపోతాం  అందుకే  " మరణం ". ఆ పదాల మధ్య జరిగే  "జీవితం " కూడా సున్నా తోనే ముగుస్తుంది రా , జస్వంత్. మనతో ఉన్నవాళ్లు కేవలం మనల్ని..." ఒక సున్నా నుండి మరో సున్నాకి" వెళ్లే మార్గాన్ని సంపూర్ణం చెయ్యడానికి మాత్రమే. వాళ్ళ "సమయం" పూర్తి ఐతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చూసావా... సమయం కూడా సున్నా తోనే పూర్తయింది . అలాగే," స్నేహం, కుటుంబం , ప్రయాణం" కూడా.  ఇవన్నీ జీవితాన్ని సంపూర్ణం చెయ్యటానికి అవసరం , కానీ , మధ్యలో  " దుఃఖం " అనే పదాన్ని చేర్చి దాన్ని అసంపూర్ణం చెయ్యొద్దు రా !. ఐనా మనం ఇంతలా ఇష్టపడే వాళ్లు బాహ్యంగా దూరం  ఐనా , జ్ఞాపకాలలో చాలా దగ్గరగా మనలోనే ఆనందంగా ఉంటారు. మనల్ని విడిచి పోనే పోరు , ప్రతీ మాట, ప్రతీ పని, ప్రతీ ఆలోచనలోనూ మనతోనే ఉంటారు. నువ్వు అలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేక పోతున్నాను రా ... జస్వంత్ .

వాడి మాటలు వింటూ ఉంటే ... ఎవరో  నాకు వస్తున్న కన్నీళ్లు తుడుస్తూ, నా తలపై చేతులు వేసి  నిమురుతున్నారు. ఒక్క సారిగా పైకి లేచి చూసా , నా పక్కన మా నాన్న కూర్చొని ఏమైంది రా అంటున్నాడు నన్ను గట్టిగా పట్టుకొని. నా కుడివైపు చూసాను , అక్కడ టేబుల్ పైన నా ఫోన్ ఛార్జింగ్ లో ఉంది.

నాన్న, నేను ... మనోజ్ తో ఫోన్  మాట్లాడుతున్నా కదా ,ఇప్పటి వరకూ మరి నా ఫోన్ ఏంటి అక్కడ ఉంది. మా నాన్న ఏడుస్తూ "ఇంకెక్కడి మనోజ్ రా ... వాడు నిన్ను వదిలి వెళ్లి పోయాడు కధ రా ...."

లేదు నాన్న... ఇప్పుడే నాకు ఫోన్లో చెప్పాడు. మనల్ని ఇష్టపడేవాళ్లు మనల్ని విడిచి పోనే పోరు ....ఎప్పటికి మనతోనే ఉంటారు అని చెప్పాడు. అంటూ ..." కళ్ళలో సముద్రమంత కన్నీటితో, భూమి కంపించే అంత బాధతో  గుండెలు పగిలేలా  ఏడుస్తూ" మా నాన్న పై  వాలిపోయాను ..... 

మనకి ఊహ తెలిసిన దగ్గర నుండి ...మనం మన జీవితాన్ని కుటుంబ సభ్యులతో కంటే ఎక్కువగా  స్నేహితులతోనే గడుపుతాం. అటువంటి స్నేహితుడు దూరమైతే... ఆ ఆలోచననే భరించలేం.

******************************************

ఇది   మా స్నేహితుడైన " మనోజ్ " మరణించిన కొంత కాలానికి .... తన ప్రాణ స్నేహితుడైన " జస్వంత్ " కలలోకి వచ్చి... మీరంతా నాకు కనిపిస్తున్నారు రా , కానీ , మిమ్మల్ని తాకడానికి వీలవ్వటం లేదు రా .....

అన్న మాటలను నేను చిన్న కధగా మర్చి మీ అందరికి చెబుతున్నాను.

" నువ్వు ఎప్పటికి మా గుండెల్లోనే ఉంటావ్ మనోజ్ "    

శ్రావణ్ దమ్ములూరి                                                                   
 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు