నవ్వుల జల్లు - జయదేవ్

పెద్దగోపిక : చల్లలమ్మడానికి, ఏ నగరికి పోయావు?
చిన్నగోపిక : మధురా నగరికి!!
పెద్దగోపిక : అమ్మకుండా తిరిగొచ్చావ్... ఔనా??
 


పొడుగు నాయుడు : పెళ్ళి విందులో, లడ్డూలు, వడలు ఎక్కువ తిన్నాను, అజీర్తి చేసింది!
పొట్టి రెడ్డి : తక్కిన వంటకాలు తినలేదా?
పొడుగు నాయుడు : శ్రీనివాస పద్మావతి కళ్యాణం కదా! విందులో లడ్డూలూ, వడలే ఎక్కువ వడ్డించారు మరి!!!

పడవనడిపేవాడు : స్వామీ మీరు హట యోగి కదా! గాలిలో తేలగలరు, నీటిలో నడవగలరు! డబ్బులిచ్చి పడవెక్కారే?
హట యోగి : స్వప్రయోజనాలకి నేను విద్య ప్రదర్శించను నాయనా! నది పోటు మీదున్నది. మధ్యలో తెడ్డు ఆనకపోవచ్చు! అప్పుడు, నా విద్య ప్రదర్శించి, పడవనీ, ప్రయాణీకులనీ కాపాడుతా!!

చిలక : పోయిన జన్మలో నేను కాకిని. మరుసటి జన్మలో చిలకగా పుట్టాలని దేవుడ్ని వేడుకున్నాను!
కాకి : నీ కోరిక తీరిందిగా?
చిలక : ఏం తీరిందీ నా బొంద! ఈ చిలక జోస్యుడి బోనులో యిరుక్కున్నాను... వడ్లగింజలు మేస్తున్నాను!!

విజ్ఞాన వర్మ : గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పు!
సాంఘిక శర్మ : ఆ శక్తే లేకపోతే ముద్ద మింగుడు పడదు కదా!!

తిలోత్తమ : రంభా! ఆ బొమ్మకి, మీసాలూ, గెడ్డాలూ అతికించి, బొమ్మని కౌగలించుకుంటున్నావ్??
రంభ : భూలోకంలో ఎవరో మీసాలూ, గెడ్డాలాయన ఘోర తపస్సు చేస్తున్నాడంట! ఆయన తపో భంగం గావించి, ఆయన్ని పెళ్ళాడి, సంసారం నడిపించాలని దేవేంద్రులు ఆదేశించారు! సిద్ధం ఔతున్నా!!


గజదొంగ పెళ్ళాం : సంచి నిండా బూడిద మూటలు?
గజదొంగ : చీకట్లో తెలీలేదు! అవి డబ్బుమూటలనుకున్నాను!
గజదొంగ పెళ్ళాం : ఇంతకీ ఎవరింటికి కన్నం వేశావ్?
గజదొంగ : ఆయన పెద్ద శివభక్తుడట! ఇప్పుడు ఋజువైంది!!!


సూరప్ప : 'వృక్షో రక్షతి రక్షితః' అని చెప్పిందెవరు?
వీరప్ప : అశోక చక్రవర్తి ఐవుంటాడు! చరిత్రలో, మొట్టమొదటిసారిగా చెట్లు నాటించింది ఆయనేగా?


రాక్షస గురువు : పిల్లలూ, 'అ ఆ ఇ ఈ' లు పలకండీ?
రాక్షస శిష్యుల్లో ఒకడు : అం అహా, ఇం ఇహా, ఉం ఉహా...
రాక్షస గురువు : ఏవూరు నాయనా నీదీ?
రాక్షస శిష్యుల్లో ఒకడు : ఘటోత్కచుల వారి ఆశ్రమం నుండి వచ్చాను గురువర్యా!!


ఋషి : నాకు వైకుంఠ పదవైనా, కైలాస పదవైనా ప్రసాదించు స్వామీ!
బ్రహ్మ : అవి మరణించినవారికే, సాధ్యం నాయనా!
ఋషి : ఐతే నాకేవరాలొద్దు... నువ్వెళ్ళిపో స్వామీ!!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు