వర్కవుట్స్‌ విషయంలో జర జాగ్రత్త గురూ! - ..

Careful  about work out

ఒత్తిడి, బిజీ లైఫ్‌ ఇతరత్రా వ్యాపకాల సందట్లో పడి, శారీరక శ్రమని అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో ఊబకాయంతో పాటు, రకరకాల జబ్బులు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నాయి. అందుకే చిన్నతనం నుండే ఆహారపు అలవాట్లతో పాటు, చిన్న చిన్న శారీరక వ్యాయామాల పట్ల కూడా కొంచెం అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈ వ్యాయామాలు అనేవి ఎలా పడితే అలా చేసేయకుండా, తగు అవగాహనతో చేయాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నప్పుడు ఈ అవగాహన ముఖ్యమైన అంశం. ఎందుకంటే సిక్స్‌ ప్యాక్స్‌, జీరోసైజులూ అంటూ యవ్వన దశలో యూత్‌ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా తమ శరీరంతో ప్రయోగాలు చేస్తున్నారు. దాంతో లేని పోని రోగాల బారిన పడడమే కాకుండా, ఒక్కోసారి శృతి మించిన వ్యాయామాల కారణంగా ప్రాణాపాయ స్థితిని కూడా కొని తెచ్చుకుంటున్నారు.

అరదుకే ఈ వర్కవుట్స్‌, వ్యాయామాల విషయంలో పాఠించాల్సిన కనీస జాగ్రత్తలు, అసలు వ్యాయామం ఎందుకు చేయాలి? ఎప్పుడెప్పుడు చేయాలి? వంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ఏ వ్యాయామాలు చేసినా ముందుగా ట్రైనర్స్‌ సూచించే సలహాలు తప్పక పాఠించాలి. వ్యాయాయం చేసేటప్పుడు ముఖ్యంగా మన శరీరం నుండి చెమట రూపంలో రక్తంలోని ప్లాస్మా నుండి వాటర్‌ బయటికి పోతుంది. దాంతో రక్తం పరిమాణం తగ్గి, శరీరానికి సరిపడా ఆక్సిజన్‌, ఇతర పోషకాలను అందించేందుకు గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అందుకే వ్యాయామం చేసేటప్పుడు సరిపడా లిక్విడ్‌ బాడీకి అందాలి. అది వాటర్‌ లేదా ఇతరత్రా జ్యూసెస్‌ రూపంలోనన్న మాట. లేదంటే డీ హైడ్రేషన్‌ సమస్య తప్పదనీ గమనించాలి. కొత్తగా వ్యాయామాలు మొదలు పెట్టినవారు మొదట్లోనే శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టడం సరైన పద్ధతి కాదు. చిన్న చిన్న వ్యాయామాలకే ఎక్కువ ప్రిపరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాకింగ్‌, జాగింగ్‌ లాంటివన్న మాట. వ్యాయామానికి, వ్యాయామానికి మధ్యలో కాళ్లు, చేతులను సాగదీయడం, కీళ్లను వివిధ రకాల డైరెక్షన్స్‌లో కదిలించడం చేస్తూండాలి. ఇలా చేయడం వల్ల కండరాలు పట్టేయడం, తద్వారా ఒళ్లు నొప్పులు వంటి బాధల నుండి తప్పించుకోవచ్చు.

మరో ముఖ్య విషయం ఏంటంటే పరగడుపునే వ్యాయామాలు చేయాలి అని చెబుతూ ఉంటారు. ఇది నిజమే. ఎందుకంటే, పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కడుపు ఖాళీగా ఉండి, కావల్సిన కార్భోహైడ్రేట్స్‌ని కొవ్వు పదార్థాల నుండి తీసుకొని శక్తిగా మలచుకుంటుంది శరీరం. తద్వారా శరీరంలో ఎక్స్‌ట్రాగా ఉన్న కొవ్వు కణాలు కరిగి, బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని అధ్యయనాల్లో ప్రయోగాత్మకంగా తేలింది. సో పరగడుపు వ్యాయామాన్ని ప్రిఫర్‌ చేయడం మంచిదే. ఏది ఏమైనా వ్యాయామం క్రమ పద్థతిలో చేస్తే మంచిదే. ప్రతీరోజూ వ్యాయామం చేయడం కుదరని వారు వారాంతంలో ఒక్కసారి చేసినా ఫలితం ఉంటుంది. ఏది ఏమైనా వ్యాయామం అనేది శరీరానికి తప్పనిసరి అనే విషయాన్ని గమనించి, పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకుంటే ఆనందంతో పాటు, ఆరోగ్యమైన భవిష్యత్తును కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే కదా మహాభాగ్యం. అట్టి ఆరోగ్యం లేకుంటే, ఎంతటి ఐశ్వర్యమున్నా వృధా ప్రయాసే అవుతుంది కదా. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు