మనిషి తన జీవితంలో ప్రతీ రోజూ చాలా విషయాల వెనుక పరుగులు తీస్తూనే ఉంటాడు, అందులో ఆనందం ఒకటి. కొందరు డబ్బు వెనుక, కొందరు ఆధిపత్యం వెనుక , కొందరు ఆశయాల వెనుక , అలాగే ఇంకొందరు ప్రేమ వెనుక పరుగులు తీస్తారు .మనిషి దేని వెంటపడినా చివరికి దాని నుండి ఆనందాన్నే వెతుక్కుంటాడు, అదే జీవితమేమో!!!
అసలు ఆనందం అంటే?
మనం పుడుతూనే ఒకరి ఆనందానికి కారణం అవుతాం, పెరుగుతూ వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తాం. కొంత వయసు వచ్చిన దగ్గరినుండి మనం కూడా ఆనందం, ప్రతీ విషయంలో కావలి అనుకుంటాం. తల్లి తండ్రుల నుండి , స్నేహితుల నుండి , బంధువుల నుండి మనం ఎం చేసినా దాని నుండి అదే కోరుకుంటాం.
దీని బట్టి ... ఆనందం రెండు రకాలు ... మొదటిది ,మన నుండి ఎదుటివారు ఆనందం పొందడం.రెండోది, ఎదుటివారి నుండి మనం ఆనందం పొందడం . నాకు తెలిసిన ప్రపంచమంతా ఇదే సూత్రంతో నడుస్తుంది అనుకుంటున్నా.
ఎదుగుతున్న సమయంలో తెలిసిన ఆనందం ..!!
మనిషి జీవిత ప్రయాణంలో .... ఆనందం ఒక్కటే కాదు ,ఇంకా చాలా ఉన్నాయ్. కేవలం ఆనందాన్ని మాత్రమే ఎవరూ కోరుకోరు."మనిషి దేనిని జీవితాంతం భరించలేడు, ఒక్క తనని తాను తప్ప".
నేను చుసిన ఎంతో మంది మనుషుల ఎలా ఉన్నారంటే.... ఏదైనా సాదించాలనుకుంటారు;కానీ , అనుకున్నది సాదించలేకపోతారు. చాలా తెలుసుకోవాలి అనుకుంటారు;కానీ, అనుకున్నది తెలుసుకోలేకపోయారు. సంపాదించాలి అనుకుంటారు ; కానీ , అనుకున్నంత సంపాదించలేకపోతారు (సంపాదించినా త్రుప్తి పొందరు)......
ఇలా అనుకున్నది , అయినది: అన్న ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి మనిషి తన ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా నేను ఎం అనుకున్నా అంటే పూర్తిగా ఆనందంగా ఉండే మనిషిని నేను కలుసుకోలేనేమో అని. అలా అనుకుంటూ నడిచి వెళ్తున్న ఒక రోజు....
ఎదురైనా ఆనందం?
..... ఒక వ్యక్తి మెట్రో రైల్ స్టేషన్ కింద ఉన్న ఒక బెంచ్ పైన కాళ్ళ పైన కాళ్ళు వేసుకొని ఎంతో ఆనందంతో వెళ్లే పోయే వాహనాలను చూస్తున్నాడు. అతని మోహంలో చిరునవ్వు పోలేదు నేను చాలా సమయం నుండి గమనిస్తున్నా. ఒక రెండు రోజుల తరువాత మరలా చూసాను , అతను మరలా అంతే ఆనందంతో ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అతనికి మతిస్థిమితం లేదని....
ఆ తరువాత కూడా నేను అతనిని గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు చూసినా అంతే ఆనందం అతని మొహం పై .... తిన్నా, తినక పోయినా అలానే ఉంటున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే ... అతని మెదడులో ఎటువంటి కోరికలు గాని , ఆశలుగాని లేవు. ప్రస్తుతమే అతని జీవితం ... అందుకే ఇలా సాధ్యమైందేమో.
చివరిగా నేను తెలుసుకున్నదేంటంటే ?
అందరూ... ఆనందంగా ఉండటానికే ప్రయత్నిస్తుంటారు . కానీ, "రేపు" అనే ఆలోచన మనుషులని వాళ్ళను ఆనందం నుండి దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది. రేపు అనే ఆలోచనను దూరం చేసుకోవటం కష్టం. కాబట్టి , నీటిలోనే ఆనందాన్ని వెతుకుందాం.
"ఈ క్షణం ఆనందంగా ఉంటె ... వచ్చే క్షణం రెట్టించిన ఆనందాన్ని తెస్తుందని ఆశిద్దాం".|
శ్రావణ్ దమ్ములూరి