స్టార్టప్‌: న్యూ జనరేషన్‌ 'థమ్స్‌' అప్‌ - ..

start up: new generation

ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత ఉన్నత చదువులు చదివినా సర్కారీ కొలువులకున్న క్రేజే వేరు. ఎంతైనా ఖర్చుపెట్టి, సర్కారీ కొలువుల్ని పొందాలనే తపనతో ఉండేవారు గతంలో యువత. కానీ రోజులు మారాయి. యువత ఆలోచనలు అంతకన్నా మారాయి. సర్కారీ కొలువులపై ఆశక్తి తగ్గింది. ఆశలు కూడా సన్నగిల్లాయి. అందని ద్రాక్షలాంటి గవర్నమెంట్‌ ఉద్యోగాల కోసం కాలాన్ని వృధా చేయాలనుకోవడం లేదు నేటి యువత. ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తమలోని మేధా సంపత్తిని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా పరుగులు పెడుతోంది. అందులో భాగంగానే తమ మెదడుకు పదును పెట్టి, కొత్త కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు కనిపెడుతోంది. తమతో పాటు, తమలాంటి పది మందికి ఉపాధిని ఇచ్చే దిశగా అడుగులు కదుపుతోంది. ఆ కొత్త ఆలోచనలలోంచి పుట్టకొచ్చిందే 'స్టార్టప్‌'. 'ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం..' అన్నట్లుగా కాదేదీ స్టార్టప్‌కనర్హం అనే రేంజ్‌లో వివిధ రంగాలలో యువత తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు.

ప్రభుత్వాలు కూడా ఈ స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తూ పార్లమెంట్‌లో స్పీచ్‌ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రభుత్వ ఉద్యోగాలపై యువతకు ఆశక్తి తగ్గిపోయిందనీ, ఆర్థికంగా తామే సొంతంగా ఎదగాలనుకుంటున్నారనీ, అట్టి వారి ఆశక్తిని ప్రోత్సహించేందుకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు ప్రోత్సాహకాలను అందించాలనీ నరేంద్రమోడీ సూచించారు. తమ మేధాశక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఉవ్విళ్లూరే యువతను ఎంకరేజ్‌ చేస్తే. సరికొత్త స్టార్టప్స్‌ దేశంలో పుట్టుకొస్తాయనీ, అవి దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయనీ ఆయన అన్నారు. ఈ స్టార్టప్స్‌ ట్రెండ్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటి నుండో ఉన్నదే. కానీ ఈ మధ్యనే మన భారతదేశానికి పరిచయమైంది. ఈ తరుణంలో యువత ఆలోచన నుండి అంకురించిన చిన్న చిన్న స్టార్టప్స్‌కి ప్రభుత్వ సహాయ సహకారాలు అండగా ఉంటే, ప్రపంచ దేశాల్ని మించిపోయేలా ఇక్కడ సరికొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తాయనడం నిస్సందేహం. 
అందుకే యువత ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకుని ఈ కొత్త పంథా వైపు పరుగులు పెడుతోంది. తక్కువ బడ్జెట్‌తో మొదట్లో చిన్న చిన్నగా స్టార్ట్‌ అయిన స్టార్టప్‌ కంపెనీలు రాబడిలో మెల్ల మెల్లగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి ఎదుగుతున్నాయి. దీంతో కొత్త కొత్త ఆవిష్కరణలను విదేశాల నుండి దిగుమతి చేసుకునే రోజులకు కాలం చెల్లింది, మన దేశమే కొత్త కొత్త ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోంది. ఇది నిజంగా శుభ పరిణామం. ఇందుకు చేయాల్సిందల్లా, మట్టిలో మాణిక్యాల్లా, యువత నుండి పుట్టుకొచ్చిన ముత్యంలాంటి ఆలోచనలకు తగిన ప్రోత్సాహకాలు అందించడమే. తద్వారా దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య అయిన నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు, భవిష్యత్తులో దేశ ఆర్థిక అభివృద్ధికి పూల బాటలు వేసేందుకు సదవకాశం కల్గుతుందనడం నిస్సందేహం.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు