16-2-2018 నుండి 22-2-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద చిన్న పనుల విషయంలో నిదానంగా వ్యవహరించుట, అలాగే ప్రణాళికా బద్దంగా ముందుకువెళ్ళుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలతో ముందుకువెళ్ళుటకు అవకాశం కలదు. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వాటిమూలాన లబ్దిని పొందుటకు ఆస్కారం కలదు. కుటుంభంలో నూతన చర్చలకు ఆస్కారం కలదు కుటుంభీకుల నుండి చక్కటి సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చును.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండుట సూచన ఇతరులనుండి నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులుపెరుగుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగిఉంటారు. మిత్రులతో కలిసి చేపట్టిన చర్చలు నూతన ఆవిష్కరణలకు దారితీస్తాయి. వారితో కలిసి చేసిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. చాలావరకు మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. ప్రయాణాల విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబసభ్యుల నుండి కొంత వ్యతిరేకత ఉండుటకు అవకాశం కలదు కావున సర్దుకుపోవడం అనేది మంచిది. సంతానపరమైన విషయాల్లో నూతన మార్పులకు అవకాశం కలదు. 

 


మిథున రాశి :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు రావడం వలన ఊరట చెందుటకు అవకాశం కలదు. మాత్రువర్గం నుండి నూతన సమాచరం వస్తుంది మీకుఉపయోగపడేవిధంగా ఉండే అవకాశం కలదు. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. మీయొక్క ఆలోచనాసరళిని కొంత సరిచూసుకోవడం వలన మేలుజరుగుతుంది. నలుగురిలో పనిచేసే సమయంలో అందరిని కలుపుకొని వెళ్ళడం సూచన. అనవసరమైన విషయాలకు సమయం ఇవ్వకపోవడం ఉత్తమం.  
 .

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద మీయొక్క వ్యవహారశైలి ఇతరులను ఇబ్బందికి గురిచేసే అవకాశం కలదు కావున కొంత నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగున్మగా పనిచేయుట సమయపాలన తప్పకమేలుచేస్తుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండేప్రయత్నం చేయుట అనేది సూచన. నూతనపరిచయాలకు అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. మిత్రులతో కలిసి విందులు,వినోదాలకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి అధికమైన సమయం కేటాయిస్తారు. కుటుంభంలో శుభకార్యములకు అవకాశం ఉంది నూతన ఆలోచనలు కలిగి ఉండే అవకాశం కలదు. నచ్చిన వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం మీకు లబ్దిని చేకూరుస్తుంది. కుటుంబంలో కొన్ని కొన్ని విషయాల్లో మొండి మొండి నిర్ణయాలు తీసుకొనే అవశరం కలదు. దూరప్రదేశం నుండి ఒకవార్త అందుటకు అవకాశం కలదు.

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట వలన మంచి పేరును కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే ఖర్చులు కూడాపెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. విలువైనవస్తువులను పోగొట్టుకొనే లేక దొంగిలించబడే ఆస్కారం కలదు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. రాజాకీయపరమైన రంగాలలో ఉన్నవారికి బాగుంటుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఇది సమయం కాదు. పెద్దలతో కలిసి సమయాన్ని గడుపుతారు వారి ఆలోచనలను గౌరవించుట అనేది సూచన. ఉద్యోగంలో సమయపాలన ఆలాగే అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన తప్పకమేలుజరుగుతుంది. 
 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద  ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏమాత్రం అశ్రద్దచేసిన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట అలాగే సర్దుబాటు తత్త్వం ఉండుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో కలిసి చేపట్టుచర్చలు ఆశించినఫలితాలు ఇవ్వకపోవచ్చును వేచిచూసే దొరని మేలుచేస్తుంది. ప్రయాణాలు కలిసి రావుకావున వాటిని వాయిదా వేయుట మేలు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మంచిమార్పులకు అవకాశం ఇస్తుంది. పనుల్లో మాత్రం ఒత్తిడి ఉంటుంది వాటిని నలుగురి సహకారంతో తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. సమయానుకూలంగా వ్యవహరించుట అనేది సూచన.

 

తులా రాశి :   ఈవారం మొత్తంమీద ప్రణాళికా అనేది మీ లక్ష్యం వైపుకు మిమ్మల్ని నడిపిస్తుంది. నలుగురిలో మీ ఆలోచనలు పంచుకొనే సమయంలో కొంత సమయస్పూర్తిని వాడుట మంచిది. మిత్రులనుండి నూతన సూచనలు వస్తాయి వాటి విషయంలో అనుభవజ్ఞుల అభిప్రాయాలను తీసుకోండి మంచిది కుటుంబంలో నూతన చర్చలకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట అనేది సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు,సమయానికి పనులను పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేపట్టుటకు అవకాశం కలదు. తోటివారికి సహాయం చేస్తారు వాఇతొ మీకున్న అనుభందం మరింత బలపడే అవకాశం కలదు. బందుమిత్రుల నుండి వచ్చు సూచనల విషయంలో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.   

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద నచ్చినవారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరవర్గంతో చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అలాగే కుటుంభంలో స్వల్పమార్పులకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఒకవార్త మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేసిన దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం వలన వాటిని అధిగమించే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను మొదలుపెట్టుటకు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనలను వ్యాపారపరమైన విషయలకు అన్వయించుకోవడం వలన మేలుజరుగుతుంది. బంధువులనుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది వాటిని బాగాఆలోచించి జాగ్రత్తగా పరిశీలించుకోవడం మేలు.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన నూతన ఉత్సాహంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనలు చక్కటి ఫలితాలను కలుగజేయుటకు అవకాశం బలంగా ఉంది. పెద్దలను సంప్రదించే అవకాశం కలదు వారితో కాస్త సమయం గడుపుతారు. ప్రయాణాలలో మాత్రం స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటుమంచిది. మీ ఆలోచనల్లో స్పష్టమైన మార్పును కలిగి ఉండే అవకాశం కలదు. మిత్రులతో కలిసి సామాజికసేవా కార్యక్రమాలకు సమయం ఇస్తారు. పనిఒత్తిడి పెరుగు సూచనలు కలవు, సమయానికి భోజనం చేయుట అనేది సూచన. వాహనముల మూలన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంబంలో స్వల్పమార్పులకు అవకాశం ఉంది సిద్దంగా ఉండుట సూచన.

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో కలిసి నూతనసంభందమైన చర్చల్లో పాల్గొనే అవకాశం కలదు. కుటుంభంలో నూతన ఆలోచనలు కలుగుతాయి అనుభవజ్ఞుల సూచనల మేరనడుచుకోండి. స్త్రీ / పురుష సంభందమైన విషయాలకు దూరంగా ఉండుట మేలు. అనవసరమైన వివాదాలకు ఎంత దూరం ఉంటె అంత ఉత్తమం. చేపట్టిన పనులలో శ్రమను కలిగి ఉంటారు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది యాత్రలకు సమయం ఇస్తారు. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని గడుపుతారు నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం కలదు. మాటపట్టింపులకు పోకపోవడం అనేది మాంచిమార్పులను ఇస్తుంది.

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద బంధుమిత్రుల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మార్పులకు అవకాశం ఉంది సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. మిత్రులనుండి వచ్చిన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబసభ్యుల ద్వార అనుకోని ఖర్చులకు అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వచ్చిన సమాచరం మీలో మార్పులను కలుగజేస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు వీలైన జాగ్రత్తలు చేపట్టుట వలన తప్పక మేలుజరుగుతుంది. మాటతీరు తోటివారిని ఇబ్బందులకు గురిచేసే అవకాశం కలదు కావున కొంత సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. గతకొంతకాలంగా మిమ్మల్ని వేదిస్తున్న విషయాలు ఒక కొలిక్కి వచ్చుటకు ఆస్కారం కలదు.

 

మీన రాశి :  ఈవారం మొత్తంమీద అధికారులతో చర్చలలో పాల్గొనే అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. కుటుంభంలో సమయాన్ని సరదాగా గడుపుతారు శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతకొంత కాలంగా ఆగిఉన్న పనులను పూర్తిచేస్తారు. మీయొక్క మాటతీరు మీ మిత్రులను కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది కావున కొంత నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాలలో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండుట సూచన. ఇష్టమైనవ్యక్తులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు వారినుండి ఆశించిన సహకారం లభించుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకోనేముందు నిదానంగా ఆలోచించి ముందుకువెళ్ళుట సూచన.
 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి