ఎగ్జామ్స్‌ టెన్షన్‌ వద్దు: ఎంజాయ్‌ చేయ్‌ గురూ! - ..

no exams tention.. do enjoy

ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఎగ్జామ్స్‌ టెన్షన్‌ స్టార్ట్‌ అయిపోయినట్లే. ఈ ఎగ్జామ్స్‌ కేవలం స్కూలు పిల్లలకే కాదు. ఇతరత్రా కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌కి కూడా ఫిబ్రవరి కీలకమైన మంత్‌ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే, ఎగ్జామ్స్‌ వస్తున్నాయంటే పిల్లలతో పాటు, తల్లితండ్రుల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి వాతావరణం నెలకొంటుంది. చాలా మంది పేరెంట్స్‌ ఈ విషయంలో టెన్షన్‌ తట్టుకోలేక ఈ మధ్య మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారనీ, తమతో పాటు, తమ పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారనీ తాజా ఆధ్యయనాల్లో తేలింది. అవును మరి ఇప్పుడు ఐదారు తరగతుల పిల్లలకే, 10వ తరగతి రేంజ్‌లో పాఠాలుండడం, తద్వారా వారిపై ఇంట్లోనూ, స్కూల్లోనూ కూడా అదే స్థాయిలో ఒత్తిడి పెంచడం జరుగుతోంది. దాంతో ఓ వైపు పిల్లలకీ, మరోవైపు పేరెంట్స్‌కీ ఈ టెన్షన్‌ తప్పడం లేదు. అయితే వాస్తవానికి అంత సీన్‌ అవసరం లేదుంటున్నారు నిపుణులు. చిన్న చిన్న చిట్కాలు పాఠించడం ద్వారా ఈ ఎగ్జామ్స్‌ టెన్షన్‌ నుండి ఇట్టే ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్‌ అన్ని రోజులూ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కి పిల్లల్ని దూరంగా ఉంచాలి. అంటే టీవీ, మొబైల్స్‌, ట్యాబ్లెట్స్‌ వంటి వాటికి కొంచెం దూరంగా ఉంచాలి. అలాగే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. టైమ్‌ టు టైమ్‌ తినడం, తీసుకునే ఆహారంలో పోషక విలువలతో కూడిన ఆహార పదార్ధాలు ఉండేలా చూసుకోవడం చేస్తే ముందుగా ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి శరీరానికి, మెదడుకీ లభిస్తుంది. అలాంటి కూరగాయాల్లో ముఖ్యంగా క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరదోస వంటి పచ్చి కూరగాయలను తరచుగా తీసుకునేలా చూడాలి. అలాగే మన మెనూలో ఆకుకూరలను కూడా రెగ్యులర్‌గా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు, కంటి నిండా నిద్ర కూడా అవసరం. రోజులో ఎనిమిది గంటల పాటు నిద్రపోయేలా ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. దాంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటి వాటికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. ఇలా చేయడం వల్ల మైండ్‌కి రీఫ్రెష్‌మెంట్‌ దొరుకుతుంది.

ఇకపోతే గంటలకొద్దీ చదువే కాదు, ఆటలకు కూడా కాస్త టైమ్‌ కేటాయించాలి. అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ పిల్లలైతే, కాస్సేపు ఓపెన్‌ ప్లేస్‌లో ఆటలాడేందుకు అనుమతినివ్వాలి. అంతకన్నా పెద్ద పిల్లలకు ఇండోర్‌ గేమ్స్‌ ప్రిఫర్‌ చేస్తే మంచిది. ఉదాహరణకు చెస్‌, క్యారమ్స్‌ లాంటి గేమ్స్‌ని కాస్సేపు ఆడనివ్వాలి. అదే పనిగా చదువు పైనే కాన్‌సన్‌ట్రేషన్‌ చేసినా చదివిన ప్రతీ విషయాన్ని గుర్తుంచుకునే సామర్ధ్యం మన మెదడుకు ఉండదు. అందుకే మెదడుకు అదే టైంలో వేరే వేరే వ్యాపకాలపై కూడా దృష్టి మళ్లించాలి. తద్వారా మెదడుకు సరైన మేత అంది, జ్ఞాపక శక్తి సామర్ధ్యం పెరుగుతుంది. ఈ టైంలో కావాల్సిన మొదటి ఆయుధం అదే కదా. ఇకపోతే ఏ రోజు ఏ సబ్జెక్ట్‌ చదవాలి. ఎంత సేపు చదవాలి అని ముందుగానే పక్కా ప్రణాళికను సిద్ధం చేసి ఉంచుకోవాలి. దానిననుసరించి, కంటిన్యూస్‌గా చదువే కాకుండా, మధ్య మధ్యలో గ్యాప్‌ ఇచ్చి, పైన చెప్పిన పద్థతులను అనుసరిస్తూ, ఈ ప్రణాళికను ఫాలో చేయాలి.

గమనించాల్సిన విషయమేంటంటే టెన్షన్‌ ఉండాలి. టెన్షన్‌ ఉంటేనే మంచి ఫలితాల్ని అందుకోగలం. అయితే ఆ టెన్షన్‌ శృతి మించి ప్రమాదకర స్థాయికి చేరకూడదు. విద్యార్ధి నైపుణ్యాన్ని దెబ్బ తీసేలా అస్సలుండకూడదు. ఈ చిన్న చిన్న చిట్కాలను పాఠిస్తే, ఒత్తిడిని తరిమికొట్టి, మంచి విజయాల్ని మీ సొంతం చేసుకోవచ్చు. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు