అందరూ అందగత్తెలే లఘుచిత్రసమీక్ష - రూపినేని ప్రతాప్

Andharu Andhagathele || Telugu short film 2017 || a Gopinath Reddy's Treat

చిత్రం: అందరూ అందగత్తెలే
నటీనటులు: కిరణ్ రెడ్డి, సీమ చౌదరి, జెమిని కిరణ్, మెహిషాం, రవిశీతేజ, శ్రీను, గాయత్రి... ఇంకా మీ అభిమాన నటీనటులు
సినిమాటోగ్రఫీ: శ్వేత,  సంజయ్
రచన & దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి

కథ: అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ ప్రతి గురువారం జన్మించే మొదటి ముగ్గురు ఆడపిల్లల ఇంటికి ఏసీ లు గిఫ్ట్ గా ఇస్టుంది.  కట్ చేస్తే శృతి అనే అమ్మాయిని 11 మంది ప్రేమిస్తారు. మరియు వారందరు కలిసి ఆ అమ్మాయిని ఒకే సారి కలవాలనుకుంటారు. ఆ ప్రేమికులు అనుకున్న విధంగా  అందరు అమ్మాయిని ఒకే సారి కలవాలి...! కలిసాక ఆ అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమిస్తుందని చెప్పిందా..?  ఏసీ గిఫ్ట్ లకి ఈ ప్రేమికులకి వున్న  సంబంధం తెలుసుకోవాలంటే... అందరు కలిసి అక్కడ కనిపించే లింక్ ని క్లిక్ చెయ్యండి.

విశ్లేషణ: ఈ కథను చెప్పిన తీరు చూసుకుంటే ఓపెన్ చెయ్యగానే ఒక సక్సెస్ మీట్ లాంటి ప్రెస్ మీట్ తో మొదలు పెట్టి అక్కడ నుండి హాస్పిటల్ ఏ.సీలు లు ఎందుకిస్తున్నారు అనే వెతుకులాటలో నుండి వచ్చిన లవ్ స్టోరీ తప్పు తప్ప లవ్ స్టొరీస్ అస్సలు ఒక్క అమ్మాయిని ఒక్క అబ్బాయి ప్రేమించి ఆ ప్రేమ గెలుస్తుందో లేదో అని కన్ ఫ్యూజన్ లో వుండే పొజిషన్.. అలాంటిది ఒక్క అమ్మాయిని 11 మంది ప్రేమించడం, ఆ ప్రేమను ఒకొక్క యాంగిల్ లో చాలా ఆహ్లాదకరంగా నవ్విస్తూ మరియు ఉత్తేజ భరితంగా చివరి వరకు కథను నడిపించిన తీరు చర్చనీయాంశం. ఫిల్మ్ మొదలు పెట్టినప్పటి నుండి  చివరి వరకు ఎక్కడ కూడా ఎంటర్ టైన్ మెంట్ తగ్గకుండా చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడికి అభినందనలు.

ప్లస్ పాయింట్స్:
1. కథనం
2, సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
3. విజువల్స్
4. దర్శకత్వం
5. కామెడీ

మైనస్ పాయింట్స్:
1. కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు

సాంకేతిక వర్గం: ఒక కథను అనుకొని దానికి చక్కటి కథనాన్ని వ్రాసుకొని దాన్ని అనుకున్న విధంగా తెరకెక్కించిన గోపి నాథ్ మంచి ఫలితాన్ని పొందాడు. తరువాత మొదట నుంచి  చివరి వరకు మనం చూసేది సినిమా అనే విధంగా చాలా బాగా మంచి విజువల్స్ చూపించిన కెమెరా మెన్ మరియు ఉమెన్ కి అభినందనలు. ఆ తరువాత వున్నది ఒక్క సాంగ్ కంపోజ్ చేసిన శ్రవణ్ భరద్వాజ్ మంచి ట్యూన్స్ తో చక్కటి సంగీతాన్ని అందించాడు.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిద్ధు కుమార్ ప్రతి సన్నివేశాన్ని దానికి తగిన విధంగా హైప్ చేస్తూ సినిమాని ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఎడిటర్ చోటు చెర్రి . ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచిగా చేశాడు. ప్రొడక్షన్ వాల్యుస్ చాలా గొప్పగా వున్నాయి.

చివరగా: ఈ అందరూ అందగత్తెలే అందరు కలసి చూసి మరి కొందరికి చెప్పండి..

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు