మొటిమల నివారణ కోసం ఏం చేయాలంటే..!? - ..

beauty-tips/

టీనేజర్లూ మొటిమల నివారణ కోసం ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మొటిమలను నివారించవచ్చు. ఆ చిట్కాలేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. తులసి ఆకు, రసం కొంచెం మెత్తగా కలిపి రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి రాసుకుని ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు పోతాయి.

అలాగే కొంచెం వేపాకు మెత్తగా నూరి దానికి చందనం పొడి కిలిపి మొటిమల మీద పూసి గంట తర్వాత స్నానం చేయండి మొటిమలు తొలగిపోతాయి. రోజ్‌వాటర్‌లో చందనంపొడి పసుపునీళ్ళలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత కడిగినా ఫలితం ఉంటుంది.

మందులషాపులలో లభించే క్లియరాసిల్ అయింట్‌మెంట్ ప్రతిరోజూ రాత్రిపూట రాసుకుని ఉదయం గోరువెచ్చని నీటితో కడగండి. చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి పేస్టులా చేసి రాత్రిపూట రాసుకుని ఉదయమే కడుక్కుంటే మొటిమలు పోతాయి.

పాలతో టమోటా రసము కలిపి పూస్తేనూ, తెల్లపాయలను రసం తీసి మొటిమలకు రాస్తే కూడా మొటిమలు పోతాయి. అలాగే బొప్పాయి రసం ముఖానికి రాస్తే మొటిమలు వాటి మచ్చలు పూర్తిగా తొలగిపోతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం