గ్యారెంటీ ? వారెంటీ ? - శ్రావణ్ దమ్ములూరి

gaurenty ..varenty
కొత్త కొత్త ఆవిష్కరణలు , విధానాలు మనిషి రోజువారీ జీవితంలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. అదే సమయంలో ఆ ఆవిష్కరణలను ప్రజలకు అందించే సంస్థలు , కంపెనీలు పుట్టుకువచ్చాయి. ఈ నవీన మార్పుకి అలవాటుపడిన మనుషులు వాటిని ఉపయోగించడానికే ఎక్కువ మొగ్గు చూపడం ప్రారంభించారు. దీనితో కొన్ని వేల కంపెనీలు పుట్టుకువచ్చాయి.

కంపెనీలు తమ  వస్తువుల యొక్క వినియోగాన్ని పెంచడానికి వివిధరకాల నవీన మార్పులను సమాజంలోకి తీసుకువచ్చాయి. ఈ ఆలోచన వినియోగదారి విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు కొన్న వస్తువు ఎలా పనిచేస్తుందో చెప్పేవారుగాని, ఎంత కాలం పనిచేస్తుందో భరోసా ఇచ్చేవారు కాదు. అప్పుడు వచ్చిన మార్పే అది , కొన్న వస్తువు ఎంత కాలం వరకు పనిచేస్తుందని నమ్మకంతో పాటు , మధ్యలో ఏమైనా ఐతే మేము దానిని మరలా రిపేర్ చెయ్యడమో లేదా ఆ వస్తువును మార్చడమో చేస్తామని ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.

ఇది మన రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. ఏ వస్తువును కొన్నా దానికి "గ్యారెంటీ " ఎంత కాలం "వారెంటీ " ఎంత కాలం అనే ప్రశ్నతోనే కొనటానికి వెళతాం. అవి మనకు కావలసినట్టు ఉంటేనే కొంటాం లేకపోతే కోనం. కానీ, చాలా మందికి అసలు "గ్యారెంటీ అంటే ఏంటో , వారంటీ అంటే ఏంటో తెలియదు". 

గ్యారెంటీ ? వారంటీ ?

ప్రస్తుతం బయట మార్కెట్లలో కొన్ని లక్షల వస్తువులు ... ఒకే రకమైనవి,ఒకే ఆకారమైనవి,ఒకే లక్షణాలు కలవి ఉంటున్నాయి. వాటిలో నుండి కావలసినది ఎంచుకోవటం కొంచెం కష్టమౌతుంది. ఒక  వినియోగదారునిగా, మనకు కావలసిన వాటికి ఎటువంటి లక్షణాలు,ఏ విధంగా ఉండాలో మనకు  ఒక అవగాహన ఉంటుంది.

ఇటువంటి సందర్భం నుండి పుట్టినదే , " వారెంటీ " ... ఇది ఒక భరోసా లేదా హామీ వినియోగదారునికి, వస్తువుని తయారు చేసే కంపెనీ ఇస్తుంది. తమ వస్తువు యొక్క పనితీరు మీద అలాగే ఒక వేళ వస్తువు చెడిపోతే దానికి పూర్తి బాధ్యత కంపెనీ భరిస్తుందని లేదా అటువంటి వస్తువుతో ఆ వస్తువును మార్చటమో చేస్తామని.

వారెంటీ గురించి మాట్లాడుతుంటే మధ్యలో గ్యారెంటీ వచ్చి కొంచెం గందరగోళాన్ని పుట్టిస్తుంది. "గ్యారెంటీ " అంటే వ్యాపారదారుడు ,వినియోగ దారునికి వస్తువు పనితీరుపై ఇచ్చే వాగ్దానం.

ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక మొబైల్ ఫోన్ కొనటానికి షాప్ కి వెళ్ళాం అనుకోండి. షాప్ వాడు ఫోన్ యొక్క పనితీరుతో పాటు " గ్యారెంటీ , వారెంటీ " గురించి కూడా చెబుతాడు. 2 సంవత్సరాలు గ్యారెంటీ , 1 సంవత్సరం వారెంటీ అని.

ఇక్కడ గ్యారెంటీ ఏంటంటే.... ఫోన్ ని మీరు ఎలా వాడినా 2 సంవత్సరాలు పనిచేస్తుందని. అలాగే వారెంటీ ఏంటంటే... ఫోన్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కొన్న  1 సంవత్సరం  వరకు కంపెనీ రిపేర్ చేస్తుంది లేదా వేరే కొత్త ఫోన్ తో మారుస్తుందని.

* గ్యారెంటీ కి ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు; వారెంటీ విషయానికి వస్తే డబ్బులు కట్టాలి.

*గారెంటీని మాటగా ఐనా ఇవ్వొచ్చు లేదా లిఖిత పూర్వకంగా ఐనా ఇవ్వొచ్చు; వారెంటీ కి  ఖచ్చితంగా లిఖిత పూర్వకంగానే ఉండాలి అలా ఐతేనే నిరూపించడానికి వీలవుతుంది.

*గ్యారెంటీ... వస్తువులకు , సేవలకు మరియు వ్యక్తులకు ఇవ్వొచ్చు ; వారెంటీ కేవలం వస్తువులకు మాత్రమే వర్తిస్తుంది.

*గ్యారెంటీ అనేది ఒక వాగ్దానం లాంటిది ; వారెంటీ అనేది ఒక హామీ , భరోసా లాంటిది.

* గారెంటీలో ఒకవేళ  వస్తువులో సమస్య వస్తే డబ్బు వెనకకు వస్తుంది; వారెంటీలో అది కుదరదు.

వీటి పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. వాటి గురించి తెలియని వారిని ఇప్పటికి మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి, వాటి గురించి  తెలియని వారికి తెలియజేసి జాగరూకులను చెయ్యాలనే ... మా ఈ చిన్ని మాట.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు