డైలాగ్ ఇన్ ద డార్క్ లఘుచిత్ర సమీక్ష - -సాయి సోమయాజులు

dilouge in the dark Short film review

పోయిన వారం విడుదలైన ‘అ!’ సినిమా సూపర్ సక్సస్ సాధించిన విషయం మనందరికీ తెలిసినదే. అయితే, ‘అ!’ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ తాను ఇండస్ట్రీకి రాకముందే, తనకంటూ ఓ మార్క్ ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సృష్టించుకున్నాడు. అలాంటి ఓ షార్ట్ ఫిల్మ్- డైలాగ్ ఇన్ ద డార్క్. డైలాగ్ ఇన్ ద డార్క్ ఇండియాలోని మొట్టమొదటి వర్చువల్ ఆడియో షార్ట్ ఫిల్మ్. అంటే, పాత్రలు ఏ పక్కన ఉంటే వాళ్ళ శబ్దాలు కూడా ఆ పక్క నుంచే వస్తాయన్నమాట. డైలాగ్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిల్మ్ సమీక్ష, మీ కోసం-

కథ :
ఈ కథ ‘డైలాగ్ ఇన్ ద డార్క్’ అన్న ఓ థీమ్ రెస్టారెంట్‍లో జరుగుతుంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే, చిమ్మ చీకట్లో కస్టమర్స్ కు సర్వ్ చేస్తారు. వాళ్లు డిషిస్ ని ఆస్వాదిస్తూ, చుట్టూ ఉన్న పరిసరాలనీ ఫీల్ అవుతారు. అలాంటి రెస్టారెంట్‍లో మొట్టమొదటిసారి కలుసుకున్న ఇద్దరి ప్రేమికుల కథే ఈ ‘డైలాగ్ ఇన్ ద డార్క్’.

 

 ప్లస్ పాయింట్స్ :

అద్భుతమైన సినిమాలు తీసే ప్రశాంత్ వర్మ షార్ట్ ఫిల్మ్స్ లో ఇది అన్నిటికంటే అపూర్వమైనది. వర్చువల్ ఆడియో ద్వారా, కథలో ఉన్న పాత్రలు ఎలాగైతే ఫీల్ అవుతాయో, చూస్తున్న మనం కూడా అలానే ఫీల్ అవుతాం. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చాలా బాగుంది. చెప్పాలనుకున్న విషయం చాలా విలువైనది. తేజా సజ్జ, యూట్యూబ్ స్టార్ అయిన చాందిని చౌదరిల సంభాషనలు బాగున్నాయి. డబ్బింగ్ అద్భుతం. డైలాగ్స్ బాగా రాశారు.

 

మైనస్ పాయింట్స్ :

ఓ మంచి థీమ్ తీసుకున్నటీమ్ ఈ ఫిల్మ్ ను ఇంకొంచెం డెవలప్ చేసుండొచ్చు. కథను ఇంకాస్త పెంచితే బాగుండేది!

 

సాంకేతికంగా :

చక్కటి సాంకేతిక విలువలున్న షార్ట్ ఫిల్మ్ ఇది . మొత్తం చీకట్లోనే నడుస్తుంది. వర్చువల్ ఆడియోని ఎక్స్పీరియెన్స్ చేసేందుకుగాను సినిమా ముందు ఇయర్ ఫోన్స్ ద్వారా చూడమని, కళ్ళు మూసుకుని వినమని డిస్ ప్లే చేస్తారు. శ్రవణ్ సంగీతం మధురం. సినిమా చివర్లో వచ్చే పాట సంగీత పరంగాను, సాహిత్య పరంగానూ వినసొంపుగా ఉంది. యాడ్స్ విల్లే నిర్మాణం అభినందనీయం.

 

మొత్తంగా :

‘కళ్ళుమూసుకుని’ చూసేయండి!

 

అంకెలలో :

4.5/5

 

LINK : https://www.youtube.com/watch?v=1r8sD-FtbGk

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి