జాతి సంపదను కొల్లగొడుతోన్నదెవరంటే! - ..

who spoils riches!

ఓ పన్నెండేళ్ల కుర్రోడు ఏ అనారోగ్యం లేకుండా డల్‌గా కనిపించాడంటే, గదమాయిస్తాం. కొంచెం చిన్న పిల్లాడే కాబట్టి, ఆడకోవాల్రా బుజ్జీ, సినిమాకెళ్దామా, పార్కుకు వెళ్దామా అని చెప్పి బుజ్జగిస్తాం. ఓ పదిహేనేళ్ల కుర్రోడికి ఇదే పరిస్థితి వస్తే ఇంకొంచెం జాగ్రత్తగా డీల్‌ చేస్తాం. పద్దెనిమిదేళ్ల తర్వాత పిల్లలకి, పిల్లలు కాదు వాళ్లు. అలా అని పెద్దోళ్లూ కాదు వారు. ఆ వయసు ప్రత్యేకమైనది ఆ యువతే దేశానికి భవిష్యత్తు. ప్రపంచంలోనే యువశక్తి అత్యధికంగా ఉన్న దేశం మనిది. మన రాజకీయ నాయకులు వేదికలెక్కి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. యువత కోసం అది చేశాం. ఇది చేశాం అంటూ. కానీ ఇటీవల గణాంకాలు, దేశంలో అత్యధిక క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోన్నట్లు చెబుతున్నాయి. ఆత్మహత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు ఇలాంటి వాటిలో పద్దెనిమిది నుండి 21 మధ్య వయస్కులు ఎక్కువగా పాలు పంచుకుంటున్నారు. ఈ వయసు అనే ఫిగర్‌నీ 16 నుండి 25 వరకూ కూడా వేసుకోవచ్చు. నివేదికలు వెల్లడిస్తున్న విషయమిది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వయసులోని వారు నిందితులుగానే కాదు, బాధితులుగా కూడా మారిపోతున్నారు. ఎక్కడుంది లోపం. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అంటున్నాం. ఉన్నత చదువుకు ప్రోత్సాహం అంటున్నాం. ఆకాశంలో సగం, అన్నింటా సగం అంటూ అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాం. కానీ అసలు బాధ్యతను విస్మరిస్తున్నాం. మార్క్‌ షీట్‌లో 100 అవుట్‌ ఆఫ్‌ 100 రావాలి అనే ఫిగర్‌ కోసం తల్లితండ్రులు ఆతృత పడుతున్నారే తప్ప, తమ పిల్లలు ఏం చేస్తున్నారు. వారిలో వస్తున్న శారీరక మార్పులేంటి..? ఇంటర్నెట్‌ కావచ్చు, స్మార్ట్‌ ఫోన్‌ కావచ్చు, ఫ్రెండ్స్‌ పరిచయాలు కావచ్చు. సమాజంలోని ఇతర పరిస్థితలు కావచ్చు. వారిని ఎలా మార్చేస్తున్నాయి అనేది తెలుసుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. తెలిసీ తెలియని వయసు అన్నీ తమకే తెలుసన్న భావన, యువతని ఆడ్డగోలుగా నడిపిస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం కనుగొనడం పెద్ద విషయమేం కాదు. కానీ ఆ పరిష్కారం తల్లితండ్రుల దగ్గర్నుంచీ, పాలకుల దాకా సమాజంలో ప్రతీ ఒక్కరూ చిత్త శుద్ధితో వ్యవహరించాలి.

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె తీవ్రమైన కుంగుబాటుతో బాధపడింది. ఇప్పటికీ ఆ సమస్యను ఆమెను ఎంతో కొంత వెంటాడుతోంది. కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కూడా అంతే. ఫలానా అని చెప్పుకోవడానికి లేదు. కుంగుబాటుకు ఎవరైనా బాధితులు కావచ్చు. అయితే ఈ సమస్యను అధిగమించేవారు, అధిగమించలేని వారు అనే విభజన మాత్రమే ఉంటుంది. చిన్న కుంగుబాటు, ఆత్మహత్యను ప్రేరేపించవచ్చు. సాటి మనిషిని హత్య చేయడానికి కూడా పురిగొల్పవచ్చు. ఓ దొంగతనానికి ప్రేరేపించొచ్చు. అత్యాచారానికి దారి తీయొచ్చు. అలా ఇటీవల కాలంలో 'కుంగుబాటుతనం' చేయిస్తున్న నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలు, సమాజంలో వివిధ వర్గాలు ఇస్తున్న కౌన్సిలింగ్‌, ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న మానసిక వైద్య నిపుణులు ఇవేమీ కుంగుబాటు సమస్యను నివారించలేకపోతున్నాయ్‌. యువతే దేశానికి దిక్సూచి. విద్య ఎంత అవసరమో, విద్యార్ధి కుంగిపోకుండా ఉండడం కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని గమనిస్తేనే, జాతి సంపదైన యువతను 'కుంగుబాటు' అనే జాడ్యం నుండి కాపాడుకోవచ్చు.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి