సోఫియా యూత్‌కి హార్ట్‌ ఎటాక్‌ తెచ్చిందయా! - ..

Hate Attack to Sophia Youth!

సోఫియా హైద్రాబాద్‌కి వచ్చి వెళ్లింది. ఓ అంతర్జాతీయ సదస్సులో ఈమె పాల్గొంది. అందర్నీ ఆశ్యర్యపరిచింది. సోఫియా మాట్లాడింది. సోఫియా నవ్వింది. సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది. విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల్ని కూడా ఇచ్చింది. సోఫియా ఆశ్చర్యపోయింది. ఇవన్నీ చేసిన సోఫియా యువతకు పెద్ద షాకే ఇచ్చింది. అసలింతకీ ఎవరీ సోఫియా.. సోపియా అంటే ఓ మరమనిషి. మనిషిలాంటి మరబొమ్మ. మనిషికీ, మరబొమ్మకీ తేడా తెలుసుకోలేనంతంగా ఈ సోఫియా అనే హ్యూమనాయిడ్‌ని రూపొందించారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ సోఫియాని రూపొందించినప్పటికీ, ఇప్పుడీ సోఫియా రూపకల్పన ప్రపంచ వినాశనానికి తొలి మెట్టు అవుతుందా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

సోఫియా చాలా పనుల చేయగలదు. ఆటోమేషన్‌ విభాగంలో పదుల సంఖ్యలో మనుషులు చేయగల పనుల్ని సోఫియాలాంటి హ్యూమనాయిడ్స్‌ చేసేయగలవు. దాంతో ఆ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత ఆందోళన చెందుతోంది. ఇప్పటికిప్పుడు సోఫియాలాంటి మరబొమ్మల్ని మరిన్ని తయారుచేయడం అంత తేలిక కాకపోయినా, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసేయగలదు. కాబట్టి హ్యూమనాయిడ్స్‌తో భవిష్యత్‌లో ప్రమాదం విషయమై తలెత్తుతున్న ఆందోళన అర్ధవంతమైనదే. అంతేకాదు ఈ సోఫియాకి సౌదీ ప్రభుత్వం పౌరసత్వం కూడా ఇచ్చి గౌరవిచ్చింది. హ్యూమనాయిడ్‌ గురించి చెప్పుకోవాలంటే దాని కన్నా ముందు జపాన్‌ లాఇంటి దేశాల్లో తయారయ్యే బొమ్మల గురించి చెప్పుకోవాలి. అమ్మాయిల బొమ్మలు అక్కడ ఎక్కువగా తయారవుతుంటాయి. ఆ బొమ్మనే తన జీవిత భాగస్వామిగా భావించే వారున్నారక్కడ. సరదాగా మొదలైన ఈ మనిషిలాంటి బొమ్మ తయారీ అక్కడ వికృత పోకడలకు అవకాశం కల్పించింది. ఆ బొమ్మలతో లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నవారు కూడా కనిపిస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో భాగస్వామిని కోల్పోయి, కుంగుబాటుకు గురయ్యేవారి కోసం తొలుత ఈ బొమ్మల తయారీ మొదలైంది. అయితే చివరికి అవి లైంగిక వాంఛల కోసం ఉపయోగపడేలా మారిపోయాయి. అంటే ఏ విషయాన్ని అయినా వాడే విధానం ఎంత వక్రమార్గంలో ఉంటుందో ఈ బొమ్మ వాడకంతోనే అర్ధం చేసుకోవచ్చు

సోఫియా దగ్గరికి వస్తే, 'రోబో' సినిమా గుర్తుంది కదా. అందులో 'చిట్టి' అనే రోబోని తయారు చేస్తారు. ఆ చిట్టికి చాలా మేధస్సును అందిస్తారు. ఒక్క సైంటిస్ట్‌ చేసిన పొరపాటుతో ఆ సైంటిస్ట్‌ ప్రాణం పోవడమే కాక, ప్రపంచానికే పెను విపత్తు సంభవిస్తుంది. ఇది కేవలం సినిమా అని తీసిపారేయడానికి లేదు. మన మొబైల్‌ ఫోన్‌లోని కెమెరాని ఇంకెవరో, దేశాల అవతలి నుండి, ఇంటర్నెట్‌ ద్వారా ఆపరేట్‌ చేసేయగలుగుతున్నారు. అదీ మనకి తెలీయకుండా. అలాంటప్పుడు సోఫియా కావచ్చు, ఇంకో హ్యూమనాయిడ్‌ కావచ్చు. అలాంటి అక్రమార్కులకు చిక్కదన్న గ్యారంటీ ఏంటి? వివిధ రంగాల్లో ఈ తరహా హ్యూమనాయిడ్స్‌ అవసరం ఉందనీ వివిధ దేశాల ప్రభుత్వాలు అంచనాకి వస్తున్నాయి. అయితే ప్రమాదాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. మొదటి ప్రమాదం ప్రపంచంలోని యువత నిరుద్యోగంతో తల్లడిల్లిపోతారు. ఆ తర్వాత ప్రపంచమే హ్యూమనాయిడ్స్‌ గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. అందుకే నేటి యువతరం సోఫియా పేరు చెప్పితే, హ్యాపీ ఫీలవకుండా, గుండెల్లో విపరీతమైన టెన్షన్‌ పుట్టుకొచ్చినట్లుగా కనిపిస్తున్నారు. 'అతి సర్వత్రా వర్జయేత్‌' అని పెద్దలు చెప్పిన మాట. కానీ ఇప్పుడు అతి అత్యంత ఇష్టంగా మారిపోయింది. అన్ని అనర్ధాలకూ అదే కారణం.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి