1. అతిలోక సుందరి అకాల మరణం అభిమానులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అనేక అనుమానాలను రేకెత్తించింది, ప్రేక్షకుల ఆసక్తికి తగినట్లు మీడియా స్పందన సబబే. అనేక కోణాల్లో ' దర్యాప్తు ' చేసినంత స్థాయిలో కవరేజ్ చేయడం మీడియా బాధ్యత.
2. సెలబ్రిటీలకు ఏదైనా జరిగినప్పుడు మీడియా కవరేజ్ సహజమే. కానీ అది ఏ స్థాయి వరకు అనే స్వీయ నియంత్రణ మీడియాకు చాలా అవసరం. అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ, స్థానిక సమస్యలు, సంఘటనలు, వార్తలను పక్కకు తోసి మరీ ఒకే విషయాన్ని పదే పదే చూపించడం, అభిప్రాయాలను సేకరించడం ముమ్మాటికీ అతి ధోరణే. టబ్ లో పడుకుని మరీ ' ఇలా చనిపోతారా ' అని మైకు పట్టుకుని ప్రశ్నించడం హాస్యాస్పదం, జుగుప్సాకరం. భౌతికంగా ఒక్కసారి చని పోయిన మనిషిని ఇలా అనేక సార్లు చంపడం మీడియాకు తగదు. ఈ ధోరణి మారాల్సిందే.
పై రెండిట్లో ఏది కరెక్ట్ ?