2-3-2018 నుండి8-3-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. మీ ఆల్కహానాలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. గతకొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది, కాకపోతే అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, ఆశించిన మేర పెట్టుబడులు రాకపోవచ్చును. స్త్రీ పరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది, సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది.

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద నూతన ఆలోచలకు అలాగే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి సహకారం లభిస్తుంది. వ్యాపార పరమైన విషయాల్లో పెట్టుబడులు లభిస్తాయి. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగాల కోసం చేయుప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. జీవితభాగస్వామితో విభేదాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి మార్పుకు అవకాశం ఇస్తాయి. మిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు.

 


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞులను సంప్రదించుట మంచిది. ఉద్యోగంలో అధికారుల లేదా పెద్దలతో కలిసి పనిచేస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో స్వల్పమేర ఇబ్బందులు తప్పక పోవచ్చును, కాస్త ప్రణాళిక కలిగి ఉండుట మంచిది. వ్యాపారపరమైన విషయంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మిత్రులత్యో కాస్త మనస్పర్థలు రావడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్త. సంతానం వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు. స్పష్టమైన ప్రణాళిక అవసరం.

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును కలిగి ఉంటారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. మీ మొండినిర్ణయాల వలన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచ్చేస్తాయి. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందక పోవచ్చును, వేచిచూసే ధోరణి మంచిది.

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయం సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఈవారం అధికభాగం సమయం విందులకు కేటయించే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది , వాటిని తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు ఆస్కారం ఉంది. వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి పెరుగుటకు అవకాశం ఉంది.
 

కన్యా రాశి :  ఈవారం మొత్తం మీద నూతన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఉన్న పనులు ముందుకు సాగుతాయి, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు చాలామందిని ఆకట్టుకుంటుంది. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సంతానం వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును, నిర్ణయాలు తీసుకునేముందు స్పష్టత అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా జీవితభాగస్వామితో మనస్పర్థలు వచ్చే ఆస్కారం ఉంది, సర్దుబాటు మంచిది.

 

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన నిర్ణయాలకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. అనుకోకుండా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఒత్తిడి ఉన్న, అనుకూలమైన ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ మాటతీరు మూలాన నూతన విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనాలనే మీ ఆలోచన వాయిదా పడే అవకాశం ఉంది , అనవసరమైన కోరికల మూలాన నూతన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మరింతగా విభేదాలు ఏర్పడుటకు ఆస్కారం ఉంది, సర్దుబాటు చర్యలు విఫలం అయ్యే అవకాశం ఉంది.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద సాద్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. సంతానం వలన నలుగురిలో మంచిపేరును తెచ్చిపెడతారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం కాస్త ఎక్కువ తీసుకొనే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సోదరుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కావల్సిన సహకారం పొందగలుగుతారు. విదేశాలలో ఉన్న బాంధవుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం ఏమరుపాటు వద్దు , జాగ్రత్తగా ఉండుట సూచన. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మరింతగా మేలుజరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో విలువైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

 

 

మకర రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబంలో సభ్యులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. నూతన వ్యాపారపరమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు. అవి సత్ఫాలితాలు ఇస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది, స్పష్టమైన ప్రణాలిక కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు సమయం పడుతుంది. గతంలో చేసిన పనులకు గాను సమాధానం చెప్పవలిసి వస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని వృధాచేయకండి. ప్రణాలిక కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. తల్లి తరుపు బంధువులలో ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో సాధ్యమైనంత మేర మౌనంగా ఉండుట సూచన. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది.

 

మీన రాశి :  ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల పట్ల స్పష్టత ఉండుట సూచన. తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల పట్ల స్పష్టత అలాగే సరైన ఆలోచన విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం సహాయం చేస్తుంది, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు పొందుతారు. ఆరోగ్యం విషయాల్లో ఒకింత మంచి మార్పు వస్తుంది. గతంలో చేపట్టిన పనులు మధ్యలో ఆగిఉన్న పనులు ముందుకు సాగుతాయి. మిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉండకపోవచ్చును , జాగ్రత్త.

మరిన్ని వ్యాసాలు