జయజయదేవం - డా. ఎస్. జయదేవ్ బాబు

 

వెంకటాచారి: ఈ ఊళ్ళో కుక్కలు మొరుగుతున్నాయి! ఐతే సంగీతం వినవస్తోందే?
సంకటాశాస్త్రి: ఈ ఊరి పేరు కూచిపూడి! ( ఒక సామెత ఆధారంగా)

 

 

ప్రియుడు: పిల్లనగ్రోవి వూదిన మరుక్షణం వొచ్చేశావ్... దేవంద్రుడికి ఎలా డుంకా కొట్టావ్?
దేవకన్య: అమరశిల్పి జక్కన్న గారి చేత నా శిలా రూపాన్ని చెక్కించి, ఇంద్రుడి కొలువులో పెట్టివస్తున్నా!

 

 

 

మామగారు: కోడలు పిల్ల తుమ్ముతూ దగ్గుతూ గెంతులేస్తున్నదే పాపం?
అత్తగారు: వర్షం లో తడిసొచ్చి, తడి చీర విప్పి, పొడిచీర కట్టుకుంది!
మామగారు: జలుబు చేసిందన్నమాట?
అత్తగారు: బీరువాలో ఆ పొడి చీర పక్కన మీ ముక్కుపొడి డబ్బాలున్నాయి. ఒకటి కింద పడింది!!

 

 

 

రాక్షస నాయకుడి భార్య: ఏవండోయ్... నా గర్భం లోని శిశువు విష్ణుసహస్ర నామం పలుకుతోంది...? భయంగా వుంది!
రాక్షస నాయకుడు: ఆ నారదులవారొచ్చినప్పుడు, నిండు గర్భిణివి, ఆయనతో కబుర్లాడుతూ కూర్చోవద్దని హెచ్చరించాను.. విన్నావు కాదు!

 

 

 

 

లకుముకి పిట్ట: అడివంతా కల్లోలంగా వుంది! నక్కలు ఊళ పెడుతున్నాయి. గుడ్లగూబలు అరుస్తున్నాయి. పైన గద్దలు తిరుగుతున్నాయి, జెముడు కాకులు గొంతులు నులుముకుంటున్నాయి.
చెకుముకి పిట్ట: వనభోజనాలకి దుష్టచతుష్టయం వచ్చారుగా...!

 

 

 

భటుడు: అగ్రహారం లో ప్రత్యేక స్నానవాటిక  మురుగు కంపు కొడుతున్నదని ఫిర్యాదు వచ్చింది నాయకా!
రక్షక నాయకుడు: అది భ్రాహ్మణోత్తములు స్నానం చేసే  కొలను కదా?
భటుడు: ఔనండీ...! వారికి అభ్యంతరకరమనీ, ఆ కొలనులోని జలచరాలనీ, చాపలనీ పట్టి అవతల పారేసి, శుభ్రం చేశామండీ!!
రక్షక నాయకుడు: ఓరి మీ మతి మండా!!

 

ఒక ఆత్మ: జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, ప్రేతాత్మలన్నీ ఒక చోట కలిశారు - ఏమిటి కథ?
ఇంకో ఆత్మ: నా ఆత్మకథ రాస్తున్నారట!!

 

 

బాతు బ్రహ్మయ్య: మనతో ఒక మాటకారి కొంగ తిరుగుతుండేదీ... అది ఆ జిత్తులమారి నక్క వాత పడింది!
కప్ప కలమయ్య: అయ్యో పాపం! ఆ దారుణం ఎలా జరిగిందీ?
బాతు బ్రహ్మయ్య: ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ, కొంగ 'జిహ్వ చాపల్యం' గూర్చి పెద్ద ప్రసంగం యిచ్చిందట! నక్క

ఆగలేకపోయింది!!

 

అంత:పురసేవకుడు-1: మన దేశానికి విదేశీయులు వచ్చారు! వాళ్ళకు రాజుగారు స్వయంగా సేవలు చేస్తున్నారు!!
 అంత:పురసేవకుడు-2: ఏమిటీ వాళ్ళ ప్రత్యేకత?
 అంత:పురసేవకుడు-1: అందరూ దొరసానులు!!

 

 

 

 

                                         ఔరంగాబాద్ కారాగారం లో:

ఒక శిక్షితుడు: తానీషాని విమర్షించాను,  నాకీ  శిక్ష పడింది!
రెండో శిక్షితుడు: తానీషాని అభినందించాను, నన్ను కారాగారం లో తోసారు!
మూడో శిక్షితుడు: నేనేవరో తెలుసా? ఆ తానీషాని నేనే!!  
      

 

 

 

 

..

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు