9-3-2018 నుండి15-3-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. గతంలో మొదలుపెట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట సూచన. తండ్రి తరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురవుతారు.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనుల విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, జాగ్రత్త. విలువైన వస్తువులను మిత్రులనుండి పొందుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. సోదరులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.

 

 


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకే హైరానాపడే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట మంచిది. మీ మాటతీరు మూలన నూతన వివాదాలకు ఆస్కారం ఉంది, కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన, నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు వాయిదాపడే అవకాశం కలదు. జీవితభాగస్వామితో మనస్పర్థలు రాకూండా సర్దుబాటువిధానం కలిగి ఉండుట మేలు. మిత్రులతో చర్చలకు అవకాశం ఉంది.

 

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. చిన్న చిన్న పనులను మొదలు పెడతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తండ్రితరుపు బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భూముల కొనుగోలు అలాగే రాతపరమైన విషయాల్లో కాస్త ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటయి. సోదరులతో చేపట్టిన చర్చలు పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చును. కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే ధోరణి మంచిది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. తండ్రి తరుపు బంధవులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేస్తారు. గతంలో మొదలు పెట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరు లభిస్తుంది.
 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో ముఖ్యమైన పనులను చేపట్టుటకు సమయాన్ని ఇవ్వడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నం ఉత్తమం. కుటుంబపరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లడం మేలుచేస్తుంది. చర్చలకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీకురావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది.

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడి తప్పక పోవచ్చును, వారై విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత మేర సమయాన్ని వృధాచేయకుండా జాగ్రత్త పడటం సూచన. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. సంతానం వలన నలుగురిలో గుర్తింపును అలాగే గౌరవాన్ని పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంమంచిది. కుటుంబ పరమైన విషయాల్లో కాస్త సర్దుబాటు విధానం మంచిది. ఉద్యోగంలో అధికారులతో చర్చలకు అవకాశం ఉంది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు.

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో పనుల పట్ల స్పష్టత కలిగి ఉండుట మంచిది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి,  చర్చలు సంతృప్తిగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి, విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు.

 

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద చేపట్టిన పనుల నుండి మంచి గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో లబ్దిని పొందుతారు. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి.ఉద్యోగంలో పనిఒత్తిడి తప్పకపోవచ్చును, మానసికంగా దృడంగా ఉండుట మేలు. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. పెద్దలతో మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మేలు. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు, మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడటం సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. బంధువులలో ఓక్రి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్థాయి.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. గతంలో మీకు రావలిసిన ధనం చేతికి అందుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో ఏమాత్రం తొందరపాటు వద్దు, సర్దుబాటు విధానం లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది, వారితో చర్చలకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు.
 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు