పొలిటికల్‌ ఉద్యోగాలున్నాయ్‌.. గెట్‌ రెడీ యంగ్‌ గన్స్‌ - ..

get ready young guns

ఎలక్షన్స్‌ సీజన్‌ వచ్చేసింది. అదేంటి ఎలక్షన్స్‌ సీజన్స్‌కీ, ఉద్యోగాలకీ సంబంధం ఏంటనుకుంటున్నారా? ఉందండీ. ఇదివరకటి ఎలక్షన్స్‌ పద్ధతి వేరు. ఇప్పుడు పద్థతి వేరు. అన్నింట్లోనూ మార్పులు వచ్చినట్లే ఎలక్షన్స్‌ క్యాంపెయినింగ్‌లో కూడా చాలా మార్పులు వచ్చేశాయి. వీటిన్నింటికీ కారణం టెక్నాలజీనే. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సోషల్‌ మీడియా. ఇదివరకటి రోజుల్లో ప్రచారాల ప్రోసెస్‌ వేరు. ఇప్పుడు అవే ప్రచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా కూడా జరిపించేస్తున్నారు. గతంలో ఎలక్షన్స్‌ ప్రచారానికి చదువుతో సంబంధం ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు, చదువుకున్న యువతని ఎక్కువగా ఎలక్షన్స్‌ నిమిత్తం ఉపయోగించుకునేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. దాంతో రాబోయే ఎలక్షన్స్‌లో యూత్‌ది ప్రత్యేక పాత్ర కానున్నదన్న సంగతి తెలుస్తోంది.

యూత్‌ కోసం ప్రత్యేక ప్యాకేజీలు, క్రేజీ క్రేజీ ఆఫర్స్‌ని ఇస్తున్నారు. తెలివైన, చదువుకున్న యూత్‌ని ఎంచుకుని, వారిని కొన్ని గ్రూపులుగా డివైడ్‌ చేసి, ఎలక్షన్స్‌కి సంబంధించిన పలు అంశాల్లో ఉపయోగించుకోనున్నారట. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వివిధ పార్టీలకు చెందిన అప్‌డేట్స్‌ని అందించడంలోనూ, కొంతమందిని జనంలోకి పంపించడం ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంలోనూ యూత్‌ని ఉపయోగించనున్నారట. అలాగే మరికొంతమందితో కొన్ని సర్వేలు నిర్వహించి, పలు అంశాలపై అంచనాలను సేకరించనున్నారట. ఇవన్నీ చూస్తుంటే, రానున్న ఎలక్షన్స్‌లో యూత్‌ పాత్ర ఎంత ప్రత్యేకంగా ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా చేసినందుకు యూత్‌కి భారీ స్థాయిలో వేతనాలు కూడా ఆఫర్‌ చేస్తున్నారట వివిధ పార్టీలకు సంబంధించిన అధికారులు. ఈ ఆఫర్స్‌తో యూత్‌ ఎక్కువగా ఎలక్షన్స్‌ ప్రచారంలో స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే మన రాజకీయాల్లో పలువురు యువ రాజకీయ నాయకులు సక్సెస్‌ఫుల్‌గా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. దీంతో రాజకీయాలంటే తల పండినవారే ఉండాలన్న ఆలోచన నుండి కొద్ది కొద్దిగా మార్పు వచ్చినట్లేనని చెప్పక తప్పదు. 
మరో పక్క పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన 'జనసేన' పార్టీకి యూత్‌ ఎట్రాక్షన్‌ ఎలాగూ ఉండడంతో, మిగిలిన పార్టీలు కూడా ఇదే స్ట్రేటజీని మెయింటైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా వివిధ జిల్లాలు, ప్రాంతాల వారీగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బాగా మాట్లాడగలిగి, కొత్తగా ఆలోచించగలిగిన యంగ్‌స్టర్స్‌ని తమ పార్టీ విధి నిర్వహణకు ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ వివిధ విభాగాల్లో ఇప్పటికే పవన్‌ సేన యంగ్‌ అండ్‌ డైనమిక్స్‌ని నియమించింది. ఇదే స్పూర్తితో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ ఈక్వేషన్స్‌నే ఫాలో చేయాలనుకుంటున్నాయట. దాంతో నేటి రాజకీయాల్లో యువత కీలక పాత్ర వహించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. నిరుద్యోగులైన యువతకు ఇది ఓ రకంగా మంచి పరిణామమే అని చెప్పాలి. ఇప్పటిదాకా పలువురు రాజకీయ నాయకులు వేదికలెక్కి, 'పోలిటిక్స్‌లో యువతకు భాగస్వామ్యం కల్పించాలి' అనే నినాదాలు చేయడమే కానీ, ఆచరించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే ఈ సారి మాత్రం ఎక్కువ స్థాయిలోనే ఆ నినాదం ఆచరణకు వచ్చేలా కనిపిస్తోంది. ఇది జరిగితే, భవిష్యత్‌ రాజకీయాల్లో యువతకు భాగస్వామ్యం పుష్కలంగా అందే అవకాశాలున్నాయనే చెప్పొచ్చు.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి