చివరికి ఆగేది మనిషి దగ్గరే ? - శ్రావణ్ దమ్ములూరి.

chivariki agedi manishi daggare
మనిషి జీవనం భూమిపై ప్రారంభమైనప్పుడు.. మనిషికి  మాటలు లేవు , ఆలోచనలు లేవు , తెలివితేటలూ లేవు...తెలియవు.కేవలం తనలాగే ఉన్న మరో మనిషి మాత్రమే తెలుసు. మేమందరం ఒక్కటే మా మధ్య ఎటువంటి బేధాలు లేవు అనుకునే సమయానికి , ఒకడు నిప్పుని కనిపెట్టాడు. వాడిని చూసి మిగిలిన వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. మనిషికి మనిషికి మధ్య బేధం ఏర్పడటం ప్రారంభమైంది.
ఒకడు మంచివాడు ఐతే ఇంకొకడు చెడ్డవాడు అయ్యాడు,ఒకడు నాయకుడైతే ఇంకొకడు సేవకుడయ్యాడు. అలా మనుషులు తమని తాము తెలియకుండానే వేరు చేసుకోవటం ప్రారంభించారు. ఈ విధానంలో ఎం జరిగిందంటే మనుషులు వర్గాలుగా విడిపోవటం ప్రారంభించారు.

అప్పుడు మనిషిలో కొత్త కొత్త  ఆలోచనలు రావటం ప్రారంభించాయి. అదేంటంటే ,  

గుంపులు కింద ఏర్పడటం తిరుగుబాటు చెయ్యటం. ఆధిపత్యం కోసం యుద్దాలు చెయ్యటం ప్రారంభించారు. కంచెలు వేసుకొని ప్రాంతాలుగా విడిపోయారు. పగలు, ప్రతీకారాలు పెరిగాయి.

చెడ్డ వాళ్ళు  ఒక చోట చేరి తమ బలాన్ని అందరకి చూపించాలని ఆలోచించారు. అలా ఆక్రమించుకోవడం అనే మాట వచ్చింది వాళ్లలోకి... ఆయుధాలను తయారు చెయ్యటం,మనుషులను చంపటం ప్రారంభించారు.

వీటి స్థాయి పెరిగిపోతున్న సమయంలో, కొందరు ఇలా జరిగితే భవిష్యత్తు తరాలకి మంచిది కాదు అని మంచి మాటలతో బోధనలు చెయ్యటం మొదలుపెట్టారు. అలా తత్వవేత్తలు , శాస్త్రవేత్తలు, గురువులు మొదలై మంచిని  బోధిస్తూ అందరిని ఒక మార్గంలో ఉంచటానికి ప్రయత్నాలు చేసారు.

ఇలా ఆక్రమణలు , బోధనలు జరుగుతూ జరుగుతూ ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడి , తమను పాలించడానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. వాడు "రాజు" అయ్యాడు. ఆ రాజ్యాన్ని ఎలా నిర్మించారంటే , అందులో పాలించటానికి  నాయకుడు , మంచిని చెప్పటానికి గురువులు , తత్వవేత్తలు ; శత్రువులను ఎదుర్కోవటానికి ఆక్రమణకారులను ; అలా ఎవరికీ నచ్చిన దానిని వాళ్ళు చేసుకుంటూ అందరూ కలసి  ఒకే దగ్గర ఉండేలా రాజ్యాన్ని నిర్మించారు.

అదే విధంగా కొన్ని వందల రాజ్యాలు ఏర్పడ్డాయి . నాగరికత మొదలైంది .. సంస్కృతీ , ఆచారాలు ఎన్నో వచ్చి ఒక "నవ సమాజాన్ని" ఏర్పరిచాయి.

మార్పులు అంతటి తోనే ఆగలేదు ... సమాజంలో చాలా మార్పులు వచ్చాయి,అలాగే  మనిషి ఆలోచనలలో కూడా . ఆధిపత్యం , స్వార్థం , అసూయా , ఆనందం, కోరిక ,కోపం వాటన్నిటి కంటే ప్రమాదమైనవి "తెలివితేటలు, డబ్బు"  మనిషిలో చేరి... మరలా ఏమి తెలియని ఒంటరి మానవుడిని చేసేశాయి...

ఎలా అంటే....

రాజ్యాలును, దేశాలు చేసారు; దేశాలు, రాష్ట్రాలుగా విభజించుకున్నారు;

రాష్ట్రాలును, జిల్లాలుగా విడదీశారు; జిల్లాలు, మండలాలుగా వేరుచేసారు ;

మండలాలను, ఊర్లుగా ; ఊర్లన్నీ, వీధులుగా ;

వీధులు, ఇల్లులుగా ; ఇల్లు,గదులుగా మారి ....ఆఖరికి  గదిలో మనిషి ఒక్కడే అయ్యిపోయాడు ...ఇలా ఎందుకు జరిగింది అంటే కేవలం మనిషికి తెలివి పెరగటం వల్ల మాత్రమే అనుకుంటే పొరపాటే కావచ్చు.... ఇలా జరగటమే సృష్టి అయ్యి ఉండొచ్చు.

శ్రావణ్ దమ్ములూరి.

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి