16-3-2018 నుండి22-3-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం  మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసినను, వారం మధ్యలో కాస్త పనిభారం పెరుగుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకొనే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవచ్చును. కుటుంబంలో పెద్దలతో కలిసి చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో పనిచేసే వారు స్థానచలనం పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం అలాగే స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి.

 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సోదరులతో సాద్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకండి, సర్దుబాటు విధానము మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఒప్పందాలకు ఆస్కారం ఉంది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. పనిఒత్తిడి మాత్రం పెరుగుటకు ఆస్కారం ఉంది , నలుగురిని కలుపుకొని వెళ్ళుట మంచిది. స్త్రీ పరమైన విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు, జీవితబాగస్వామితో చర్చలకు ఆస్కారం కలదు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. మిత్రులతో సమయం గడుపుతారు.

 

 


మిథున రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు. ముఖ్యమ్గా చర్చల్లో వివాదాలకు దూరంగా ఉండుట ఉత్తమం. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలకు అలాగే పనులకు అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులకు అవకాశము ఉంది , జాగ్రత్త. నూతన ఉద్యోగ అవకాశాలు ముందుకు వెళ్తాయి. తండ్రి తరుపు బంధువులను కలుస్తారు, వారితో సమయం గడుపుతారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది.

కర్కాటక రాశి :  ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. చిన్న చిన్న పనులను మొదలు పెడతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తండ్రితరుపు బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భూముల కొనుగోలు అలాగే రాతపరమైన విషయాల్లో కాస్త ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, చర్చలు సత్ఫలితాలు ఇస్తాయి. రావలిసిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, చేపట్టు పనుల విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. సంతానం వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన చర్చలకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఉన్నతవిద్య కోసం విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం, కాకపోతే కాస్త ఖర్చులు మాత్రం పెరుగుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు.

 

కన్యా రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన పనులకు సమయం ఇవ్వడం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. తండ్రి తరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో సమయాన్ని గడుపుతారు. కుటుంబపరమైన విషయాల్లో చర్చలకు అవకాశం ఇవ్వకండి , అలాగే ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. గతంలో మొదలు పెట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట ఉత్తమం. మీ ఆలోచనలను మిత్రులతో పంచుకుంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది జాగ్రత్త.

 

 

తులా రాశి :  ఈవారం మొత్తం మీద పెద్దలతో చర్చల్లో పాల్గొంటారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన పనులకు శ్రీకారం చుడుతారు. సంతానం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది , నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలతో మనస్పర్థలు వచ్చే ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం మేలు. నూతన వివాదాలకు ఆస్కారం కలదు, జాగ్రత్త. సాధ్యమైనంత మేర ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

 

 

 

వృశ్చిక రాశి :  ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మంచిది. ఉద్యోగంలో పనిఒత్తిడి ఉంటుంది, కాకపోతే తోటివారి సహకారంతో పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. రావాల్సిన ధనమ్ సమయానికి చేతికి అందకపోవచ్చును , ఈ పరంగా ఇబ్బందులు పొందుతారు. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు.  అధికారులతో మీకున్న పరిచయం సరైన సమయంలో ఉపయోగపడుతుంది. నూతన పెట్టుబడులకు అవకాశం కలదు.

 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. నలుగురిలో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఎవ్వరితోను వివాదాలకు వెళ్ళకండి, సాధ్యమైనంత మేర సర్దుబాటు మంచిది. నూతన ఉద్యోగప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. కుటుంబంలో ఖర్చులకు అవకాశం ఉంది. సోదరులతో గతంలో చేపట్టిన చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. పూర్వీకుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు, వారై ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తారు.

 

 

మకర రాశి :  ఈవారం మొత్తం మీద చేపట్టు నిర్ణయాల విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న మాటపడవలసి వస్తుంది. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తండ్రితో కలిసి నూతన పనులను మొదలు పెడతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పనులను మొదలు పెడతారు. కుటుంబంలో పెద్దలతో మాటాడేటప్పుడు వారిని నొప్పించక ముందుకు వెళ్ళుట మేలు. ఆత్మీయుల ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని భాదిస్తాయి , జాగ్రత్త అవసరం.

 

కుంభ రాశి : ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండుట అవసరం. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు మంచి ఫలితాలు ఇస్తాయి. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విదేశాల్లో ఉన్న వారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మనస్పర్థలు రాకూండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుట ద్వారా పెద్దల నుండి ప్రశంశలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, కాకపోతే నూతన పరిచయాలు అవడం శుభసూచకం. గతంలో చేపట్టిన పనులకు గాను నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో సభ్యుల నుండి పూర్తిస్థాయిలో సహకారం లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళుట ఉత్తమం. చర్చలో సమయం గడుపుతారు, మీ ఆలోచనల్లో మార్పు ఉంటుంది.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి