.
1) ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని భాజపా భీస్మించుకు కూర్చున్న సమయంలో.... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు కనిపించే ఏకైక దిక్కు....తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకొస్తే వెంటనే ఆంధ్ర కి తప్పక హోదా ప్రకటిస్తుంది...కనుక కాంగ్రెస్ ను నమ్మి మళ్ళీ అధికారమివ్వొచ్చు.
2) అప్పట్లో కాంగ్రెస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి రాష్ట్రం ఏం ప్రకటించలేదు....నాలుగేళ్ళు ఇక్కడ జరిగే మారణహోమాలను చోద్యం చూసి, నానా రకాల పిల్లిమొగ్గలు వేసి ఎన్నికల సమయానికి హడావుడిగా ప్రకటించింది...అది పూర్తిగా ఓట్ల కోసమే...ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్రంలో ఎవ్వరు అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాల వారి సెంటిమెంట్లను గౌరవించరు, పట్టించుకోరు...అందుకే కేసీఅర్ ప్రకటించిన ఫ్రంట్ అధికారంలోకి రావాలి...దక్షిణాది రాష్ట్రాల వారి గొంతు గట్టిగా వినిపించడానికి ఈ ఫ్రంట్ అవసరం ఉంది....ఈ ఫ్రంటే అధికారంలోకి రావాలి.
పై రెండింట్లో ఏది కరెక్ట్...?