ప్రదక్షణ - గుమ్మా రామలింగ స్వామి

Why we do Pradakshina

ప్రదక్షణ ఎందుకు చెయ్యాలి?
హిందువులు గుడికి వెళ్ళి దైవదర్శనం ముందు కానీ తరువాత గాని గుడిచుట్టు ప్రదక్షణ చెయ్యడం చూస్తున్నాము.  చాలామందికి ఎందుకు ఈ ప్రదక్షణో  తెలియక కూడా చేస్తుంటారు. ఈ ప్రదక్షణ  కుడి వైపునండి చెయ్యాలని మాత్రం  చాలామందికి తెలుసు.

మనమొక వృత్తము గీయాలంటె  దానికి ఒక కేంద్ర స్థానము కావాలి.  ఆ కేంద్రమును అధారము చేసుకును వర్తులాకారముగా గీసిన రేఖే వృత్తము. మన మనస్సులో భగవంతుడు కేంద్రికృతమయి ఉంటాడు. మనలోని భగవంతుడే గుడిలోని ఆ ఒక ఆకారము ధరించి మనకు దర్శన మిస్తున్న దేముడు, మనలోని దైవాన్ని స్మరిస్తూ ప్రదక్షణ చెయ్యడం ఆత్మ ప్రదర్శన.  అలానే గుడిలో ఉన్న దైవాన్ని స్మరిస్తూ కూడా ప్రదక్షిణ చెయ్యడం దైవ ప్రదక్షిణ. అందరూ గుడి చుట్టూ ప్రక్షణ చెయ్యడములో ఒక ధర్మ సూక్ష్మముంది. ఒక కేంద్ర బిందువు చుట్టూ వర్తులాకారముగా ప్రదక్షిణ చేయునప్పుడు, ఆ దైవానికి అందరూ ఒకే దూరములో ఉంటారు. ఆదైవానుగ్రహము అందరిపైనా ఒకేలా ఉండునను భావము కలుగుతుంది, ఒక కేంద్రమునుండి వృత్తరేఖపై ఎక్కడ ఉన్ననూ దూరము సమానము కదా!

ప్రదక్షణ కుడివైపునుంచి చెయ్యడం లో ఒక అంతరార్ధము ఉంది. " కుడి ఎడమల నుండి చేస్తే గమనము స్థంభించి పొతుంది కనుక" అని ఒక వితండవాదన చేసే వారూ ఉన్నారు. భారతీయులు దక్షణ భాగమును పవిత్రముగానూ అన్ని శుభకార్యములూ కుడి చేతితో చేయు అచారమున్నది కనుక దానికి ప్రాధాన్య మీయబడినది. ఆంగ్లమున కూడా దీనిని " రైట్" అని వ్యవహరించుచున్నాము. ఈ ప్రదక్షణ చేయునపుడు మనము దైవమును స్మరిస్తూ అన్ని ఉత్తమమయిన, ధర్మ బద్ధ మయిన కార్యములు చెయుదునని ప్రమాణము చేయుటగా భావించాలి. అట్టి బలము సంకల్పమూ ఆ భగవతుడీయవలెనని ప్రార్థించాలి.

హిందువులు తల్లిని తండ్రిని గురువును కూడా దైవముగా భావించు అచారమును నమ్మినవారు. ఆ నమ్మకముతోనే తల్లి దండ్రులకు  సకల విజయములూ కలగాలని కోరుతూ ప్రదక్షణ చెయ్యాలి. ఇందుకు గణేషుడు మాతాపితలకు ప్రదక్షణచేసి సకల దేవతలు తీర్ధములు చుట్టిన
పుణ్యము సంపాదించెనను కధ మనమందరమూ ఎరిగినదే.

గృహములందు దేవాలయములందు పూజలు ఆరాధన ముగించిన తరువాత ఆత్మ ప్రదక్షణ చెయ్యవలెనని చెప్పుదురు.  అప్పుడు  ఈ శ్లోకము పఠిస్తూ చెయ్యాలి.

యాని కానిచ పాపాని  జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణష్యంతి  ప్రదక్షిణ పదే పదే.


దీని అర్ధం "గతకాలంలో నేను చేసిన పాపాలు సమస్తమూ నేను ఈ ప్రదక్షణ చేయుచున్నప్పుడు వేయు ప్రతీ అడుగు తోను  నశించిపోవాలి.  నేను పాప రహితుడను కావాలి " అని చెప్పుకోవాలి. ప్రదక్షణ లేని ఆలయ దర్శనము పూజ, మొదలగు నన్నియూ వ్యర్ధమని  గ్రహించ గలరు.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు