సంకల్పం: కేరాఫ్‌ స్టీఫెన్‌ హాకింగ్స్‌ - ..

stephen hawking

ఒక పని చేయాలని గట్టిగా సంకల్పించుకుంటే ఆ పని తేలికవుతుందనీ పెద్దలు చెబుతుంటారు. సంకల్పం ఎంత గట్టిదైతే, ఎంత నిఖార్సయినదైతే, ఫలితం అంత గొప్పగా ఉంటుంది. సంకల్పం బలంగా ఉంటే, విధిని సైతం ఎదిరించగలం. స్టీఫెన్‌ హాకింగ్‌ దానికి పర్‌ఫెక్ట్‌ ఎగ్జామ్‌పుల్‌. ఒక శాస్త్రవేత్త, ఒక మ్యాథమిటిక్స్‌ ప్రొఫిసర్‌, ఇవే కాదు స్టీఫెన్‌ హాకింగ్స్‌ అంటే. ప్రపంచానికి దిక్సూచి ఆయన. 'మనిషి' అన్న మాటకే ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌. అందుకే ఆయన్ని 'కలిపురుషుడు'గా అభివర్ణించారు. మంచి వయసులో ఉండి కాయకష్టం చేసుకుని బతకలేని చాలా మందికి చెంప పగులగొట్టే సమాధానం స్టీఫెన్‌ హాకింగ్‌. కాళ్లు పని చేయవు. చేతులు స హకరించవు. నోట్లోంచి మాట కూడా రాని దయనీయ స్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మెర్సీ కిల్లింగ్‌కి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇరవై ఒక్కేళ్ల వయసులో నయం కాని వ్యాధి ఓ యువకున్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసేస్తే, ఆ యువకుడు రెండేళ్లలో చనిపోతానని తెలిసినా, విధిని సంకల్ప బలంతో సవాల్‌ చేశాడు. అలా రెండేళ్లలో చనిపోతాడనుకున్న వ్యక్తి అదనంగా ఏభై ఏళ్లు బతికాడు.

నేను ఎప్పుడోకప్పుడు చనిపోతానేమో, చనిపోవడానికి నాకు తొందర లేదు.. అని డెభ్బై ఏళ్ల వయసులో అచేతనావస్థలో తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ సక్రమంగా ఉండి, ఏమీ చేయడం చేతకాని చాలా మందిని ఉద్దేశించి చెంప ఛెళ్లుమనే మాట చెప్పాడు. ఒక మనిషికి ఇంతకంటే స్పూర్తినిచ్చే అద్భుతం ఇంకేముంటుంది. నోట్లోంచి మాట రాదు కదా. మరెలా శాస్త్రవేత్తగా ప్రయోగాలు చేశాడు అనే డౌట్‌ రావడం సహజమే. రెటీనా కదలికల్ని బట్టి, ఆయన ఆలోచనలేంటో తెలియచేసేలా ఓ కంప్యూటర్‌ని ఆయనకు అనుసంధానించారు. అంతకు ముందు కేవలం కుటుంబ సభ్యులకే అర్ధమయ్యేలా పెదవుల కదలికతో కొన్ని పరిశోధనలు చేశారు. క్రమ క్రమంగా ఉన్న ఆ చిన్న చిన్న అవకాశాలు చేజారిపోయాయి. కానీ అంతకంతకూ ఒకదాన్ని మించిన అద్భుత పరిశోధన ఇంకోటి చేసి చూపించేవారు స్టీఫెన్‌ హాకింగ్‌. తుది శ్వాస విడిచే దాకా పరిశోధనల గురించే ఆలోచించిన స్టీఫెన్‌ హాకింగ్‌ ప్రపంచమంతటికీ ఆదర్శం.

పదిహేనేళ్ల వయసులో ప్రేమ కోరిక పుట్టేస్తుంది. ప్రేమించిన అబ్బాయో, అమ్మాయో కాదంటే ఆత్మహత్య. నాకు నచ్చిన చదువు చదవనివ్వడం లేదనీ, తల్లితండ్రుల మీద కోపంతో బలవన్మరణాలు, ఒక కాలు లేదు, ఒక చేయి లేదు అని సాకులు చూపి జీవితాన్ని వ్యర్థం చేసుకునే అభాగ్యులు ఎందరో, అన్నీ సరిగా ఉన్నా, నాకెందుకు..? అనే నిర్లక్ష్యం. ప్రపంచం ఏమైపోతే నాకేం. నేను బాగానే ఉన్నానన్న మూర్ఖత్వం, కుట్రలు, కుతంత్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే, సాటి మనిషి మీద అసహ్యం పెరిగిపోతుంది. 'సూర్యుడు అనే ఓ సాధారణ నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాల్లో ఓ చిన్న గ్రహం మీద నివసిస్తున్న అడ్వాన్స్‌డ్‌ వానర జాతి మనది' అని చెప్పడం ద్వారా స్టీఫెన్‌ హాకింగ్‌ మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారు. ఆ మెసేజ్‌ ఏంటంటే, వానర జాతికి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ అయిన మనం విశ్వం గురించి తెలుసుకోగల శక్తిని కలిగి ఉన్నాం. ఆ విషయంలో మనం ఒక చిన్న చుక్క కూడా కాదు. అలాంటి మనం మన సమర్ధత మీద నమ్మకం ఉంచి సంకల్పించుకుని సరికొత్త ఆవిష్కరణల వైపు పరుగులు పెట్టాలి తప్ప, ఇతరత్రా పనికిమాలిన విషయాలను తలచుకుని క్షణం కూడా వృధా చేయకూడదు. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి