జయజయదేవం - డా. ఎస్. జయదేవ్ బాబు

 

 

కేతువు: నేను చంద్రుడ్ని మింగాను. పళ్ళు జివ్వుమంటున్నాయి.
రాహువు: నేను సూర్యుడ్ని మింగాను కదా... గొంతు నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి.

 

 

ఒకడు: శుక్రదశ జాతకం లో వుంటే , ఆ జాతకుడు సుఖభోగాలు అనుభవిస్తాడట కదా..
ఇంకొకడు: నేను శుక్రదశ జాతకుడినే, ఐతే మితిమీరి భోగాలు అనుభవించి , సుఖ వ్యాధులు అంటించుకున్నాను.

 

 

సుబ్బరాజు: ఆ యజమాని ని గమనించావా? మూటలు నౌకరు చేతకాక , తనే మోస్తున్నాడు!  
గంగరాజు: డబ్బు ఆదా చేస్తున్నాడు గామోసు.
రామరాజు: కాదు, శారీరక శ్రమ చేస్తున్నాడు. అతడికి మధుమేహం లే!!

 

 

 

మూషికం, సహా మూషికం తో రహస్యంగా: స్వామీ పొట్టకింద నాగుపాము, చలికి గజగజ వణికి పోతున్నాడు గమనించావా?
సహమూషికం: ఎందుకేం?
మూషికం: గణపతి శరీరం లో నవగ్రహాలు నివాసముంటారు తెలిసిందేగా? స్వామీ పొట్టలో చంద్రుడున్నాడు!!

 

గురువు: రోజూ, మూడు పూటలూ, నాకు సెనగలే వండిపెడతావేమీ శిష్యా?
శిష్యుడు: తమరు భోధించిన, "నవగ్రహాలూ - నవధాన్యాలూ పాఠం లో గురువుకి ప్రీతికరమైన ధాన్యం సెనగలు కదా గురువుగారూ!!

 

 

 
ఒక పౌరుడు : ఈ నాయకుడి ప్రసంగం వినడానికి , వేలకు వేలు జనం వస్తారు కదా...ఈ రోజు, ఒక్కడైనా రాలేదేమి?
రెండో పౌరుడు : అతడు ధరించే " జనాకర్షణ " యంత్రాన్ని ప్రత్యర్థి నాయకుడు అపహరించాడని తెలిసిందిలే !!

 

 

ముని : ఓయీ రాజా, నువ్వు రాజ్యం పోగొట్టుకున్నావు, చేయని దొంగతనం నింద మోపబడి శిక్ష అనుభవించావు..బాధలు భరించలేక , నిర్వీర్యుడివై , భ్రష్టైనావు. శనిభగవానుడిని పరిహాసమాడావా?
రాజు : పొరుగురాజు మీద సవాళ్ళు విసిరి, ఆ రాజ్యం ముట్టడించాను. యుద్ధంలో ఓడిపోయాను..నా పూర్వవైభవం తిరిగి రావాలంటే, శని భగవానుని ప్రార్ధించమంటారా?
ముని: " పొరుగు రాజుని ప్రార్ధించు పో...!!

 

కింపురుషుడు : ఈ సౌధ నిర్మాణంలో, నైరుతి దిశన , వాస్తు దోశం సరి చెయ్యడానికి , మయులవారు , వాస్తు శిల్పిని రప్పించక , ఎవరో రాక్షసుడిని నియమించారే ?
కిన్నెరుడు : ఆయన " నివృత్తి " రాక్షసుడు . నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత! తెలీదా?

 

 

 

ఒక గంధర్వుడు : " ఈ అమరావతి పట్టణంలో, వాహనాలు లాగడానికి గుర్రాలూ, ఎద్దులూ కనిపించవే ? ఎక్కడ చూసినా ఏనుగులే ?
ఇంకో గంధర్వుడు : " నువ్వే చెప్పావ్ గా, ఇది అమరావతి పట్టణమని, ఈ నగర పాలకుడు ఇంద్రుడుగా !

 

బల్లి ఒకటి ఏమిటీ...బల్లి శాస్త్రం చదువుతున్నావా ?
బల్లి రెండు : ఔను, నేను ఈ ఇంటి యజమాని వెన్నెముక మీద పడ్డాను. ఫలితం, " పిశాచ భయం " అని వుంది.
ఆ భయం తొలగడాని మార్గాలేమైనా వున్నాయాని చూస్తున్నాను.

బల్లి ఒకటి : " పిశాచ భయం " ఆ ఇంటి యజమానికి, చూడబోతే నీకూ పిశాచ భయం పట్టుకున్నట్టుంది.....హు....!
 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి