చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు అంటే రేడియోలు కొత్తగా వచ్చిన రోజుల్లో అన్నమాట,  విద్యుఛక్తి , ప్రతీ చోటా అందుబాటులో లేని రోజుల్లో, ఓ రేడియో, దానివెనకాల, ఓ కారు బ్యాటరీలాటిదానికి తగిలించేవారు. ఎలెట్రీదీపాలున్నచోట్లలో, అవేవో వాల్వ్  (  Valve )  సెట్లని ఉండేవి. పైగా ఆ రేడియోలుకూడా  సామాన్య ప్రజానీకానికి అందుబాట్లో ఉండేవి కావు…ఆ రేడియో పలకడానికి Sound signals  పట్టుకోడానికి ఆరుబయటో, డాబామీదో ఎత్తుగా ఏరియల్ అని ఉండేది. కానీ ప్రతీ Village పంచాయితీ పార్కులోనూ, ఆ రేడియోని పంచాయితీ ఆఫీసులో ఉంచి,  పెద్దపెద్ద లౌడ్ స్పీకర్ల (  Loud Speakers )  ద్వారా, పార్కుకి  సాయంత్రం వేళల్లో వచ్చిన చిన్నా, పెద్దా విని ఆనందించేవారు. ఆరోజుల్లో ప్రభుత్వ సంస్థ ఆల్ ఇండియా రేడియో వారి  స్టేషన్లు, మనవైపు  Madras ,  విజయవాడ, హైదరాబాదు లలో ఉండెవి. అప్పటికింకా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం రాకపోవడం వలన,  Madras  కేంద్రం వారు, తెలుగు కార్యక్రమాలు కూడా వినిపించేవారు.
 కాలక్రమేణా ప్రత్యెక రాష్ట్రం ఏర్పడిన తరువాత, 1953 నుండీ విజయవాడ కేంద్రం నుండి కొన్ని అద్భుతమైన సంగీత, సాహిత్య, పిల్లల కార్యక్రమాలు వినగలిగేవారం. పొద్దుటే, భక్తిరంజని తో మొదలెట్టి,  11 గంటలకి పాఠశాలల కోసం కార్యక్రమాలూ, మధ్యాన్నం 1230 కి కార్మికుల కార్యక్రమం, సాయంత్రం 630 కి  గ్రామస్థుల కార్యక్రమం— అందులో దేశపరిస్థితి గురించి బావగారి కబుర్లూ—రాత్రయేసరికి సంగీత కార్యక్రమాలూ, వారానికో నాటిక, ఓ హరికథ లాటివి ఉండేవి. ఆదివారం వచ్చిందంటే, ఓ శబ్దగ్రహణ చిత్రం ( సినిమా సంక్షిప్తంగా, పాటలు, డయలాగ్గులతో )  వివిధ రకాల వినోదకార్యక్రమాలూ ఉండేవి. మధ్యమధ్యలో  మనం కోరిన పాటలూ.. ఓహ్.. రేడియో అంటే, మన జీవితాల్లో ఓ భాగం అయిపోయేది… ఇది కాకుండా, రేడియో సిలోన్ వారి తెలుగు కార్యక్రమాలూ, అందులో శ్రీమతి మీనాక్షి పొన్నుదొరై గారి తమాషా తెలుగు వినడమో విశేషం… ఇవన్నీ కాకుండా, వార్తలు — ఢిల్లీ నుండి, పొద్దుటే 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకీ  తెలుగులో వార్తలు- శ్రీ పన్యాల వారు, శ్రీ కొత్తపల్లి వారూ, శ్రీ బుచ్చిరెడ్డిగారూ చదివేవారు మొదట్లో… అలాగే పొద్దుట, 8, మధ్యాన్నం 1.30 కి, తరవాత 9  PM  కీ ఇంగ్లీషు వార్తలు.. కావాల్సినంత కాలక్షేపం. మధ్యలో వివిధభారతి అని ఇంకో కార్యక్రమం మొదలెట్టారు.

ఈ రేడియోలు, మార్పు చెంది,   Transister  యుగం  మొదలయింది. ఎక్కడ చూసినా ఇవే.. దేశంలో ఎక్కడైనా ఏ  Cricket Match  అయినా జరుగుతోందంటే, కామెంట్రీ వినడానికి దాని చుట్టూరా చేరేవారు. వీటికేమీ  Electricity  అవసరమయేది కాదు, ఓ నాలుగు  టార్చ్ లైట్లలో వేసే బ్యాటరీలతో లక్షణంగా వినిపించేది… తరువాత్తరవాత బ్యాటరీల సైజు మారి, ఓ రెండో మూడో  Pen Cells  వేసి జేబులోపెట్టుకునే సైజుకి వచ్చేసాయి..

రేడియోలో వ్యాపారప్రకటనలు, మొట్టమొదటిసారిగా, వివిధభారతిలో మొదలెట్టి, మిగిలిన కార్యక్రమాలకి కూడా విస్తరించాయి… ప్రకటనలు మొదలెడితే, మరి మిగిలిన వాటిలో కూడా ప్రగతి ఉండాలిగా… పెద్దపెద్ద నగరాల్లో  FM Channels  మొదలెట్టారు…. మళ్ళీ అందులోనూ ఓ అరడజను కంపెనీల వాళ్ళు.. ఇదివరకటిరోజుల్లో ఏదో ఫలానా టైములో మొదలెట్టి ఏ 11 గంటలకో పూర్తయే కార్యక్రమాలు ఇప్పుడు 24 గంటలు అయాయి.

టెక్నాలజీ అభివృధ్ధితో పాటు, ఈరోజుల్లో ఎక్కడ, ఎవరిచేతుల్లో చూసినా మొబైల్ ఫోన్లలో కూడా ఈ  FM Radio  లు చోటుచేసేసికున్నాయి.. ఎవడిని చూసినా, జేబులో ఓ మొబైలూ, రెండు చెవుల్లోనూ అవేవో పువ్వులూ (  Ear phones ),,  ఏమేమిటో వింటూ తన్మయత్వం చెందిపోవడం, ఒళ్ళు తెలియదు—రోడ్డుమీద వెళ్తున్నా, కారు నడుపుతూన్నా, రైల్వే  Tracks  దాటుతూన్నా సరే, బాహ్యప్రపంచంతో ఎతువంటి సంబంధ బాంధవ్యాలూ లేకుండా, ఓ అలౌకికానందం అనుభవిస్తూ  ఒక్కోప్పుడు ప్రమాదాలుకూడా తెచ్చుకోవడం…
మర్చేపోయాను—ఈ రేడియోల్లో విదేశీ ప్రసారాలు  BBC, Voice of America, Radio Australia  లాటివికూడా వినగలిగేవారం.. మధ్యలో ఈ  All India Radio  ని “ ఆకాశవాణి “ గా మార్చారు..

ఎన్నిరకాల  FM  Radio లు వచ్చినా, అలనాటి  All India Radio  సాటికి మాత్రం రాలేవు…

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి